ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు | Sakshi
Sakshi News home page

ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

Published Sat, May 4 2024 4:45 AM

ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

తొర్రూరు: పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌ తెలిపారు. పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం డివిజన్‌ కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, డిగ్రీ కళాశాలలోని పోలింగ్‌ బూత్‌లను ఎస్పీ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. కేంద్ర బలగాలతో మార్చ్‌ఫాస్ట్‌ నిర్వహించి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా నగదు, మద్యం, కానుకల పంపిణీపై నిఘా ఉంచామన్నారు. పాత నేరస్తులు, రౌడీషీట్‌ ఉన్నవారిని బైండోవర్‌ చేశామన్నారు. సాధారణ పోలింగ్‌ కేంద్రంలో ఇద్దరు, సమస్యాత్మక కేంద్రంలో నలుగురు, అతి సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో ఆరుగురు పోలీసులతో భద్రత ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో సీఐ సంజీవ, ఎస్సైలు జగదీశ్‌, పిల్లల రాజు, సిబ్బంది పాల్గొన్నారు.

పోలీస్‌స్టేషన్‌ తనిఖీ చేసిన ఎస్పీ

కురవి: మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌ పరిసరాలతో పాటు రికార్డులను పరిశీలించారు. ఎస్సై, సిబ్బందితో మాట్లాడారు. స్టేషన్‌కు వచ్చిన వారితో స్నేహపూర్వకంగా మెలగాలని సూచించారు.

ప్రశాంత పోలింగ్‌ నిర్వహణకు చర్యలు

పెద్దవంగర: ప్రశాంత్‌ పోలింగ్‌ నిర్వహణకు చర్యలు తీసుకుంటున్న ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌ తెలి పారు. శుక్రవారం మండల కేంద్రంలోని పో లీస్‌స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ 13న జరిగే పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.

ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌

Advertisement
Advertisement