హోం ఓటింగ్‌ షురూ | Sakshi
Sakshi News home page

హోం ఓటింగ్‌ షురూ

Published Sat, May 4 2024 4:45 AM

హోం ఓ

ములుగు/ఏటూరునాగారం: పార్లమెంట్‌ ఎన్నికల్లో భాగంగా హోం ఓటింగ్‌, పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు నమోదు ప్రక్రియను ప్రారంభించనట్లు జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి తెలిపారు. ములుగు నియోజకవర్గంలో ఫారం 12 డి ద్వారా 85 ఏళ్ల వయసు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు ఓటర్లు మొత్తం 78 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ మంజూరు చేయగా శుక్రవారం 44 మంది ఓటర్లు ఇంటి వద్దనే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ప్రక్రియ 8వ తేదీ వరకు నిర్వహించనున్నారు. కాగా మే 13న పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా జిల్లాలో ఉన్న ఓటర్లకు పూర్తి స్థాయిలో పోల్‌ చిటీలు అందించాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు జిల్లాలోని బీఎల్‌ఓలు ఎండను సైతం లెక్కచేయకుండా పోల్‌ చిటీలను పంపిణీ చేస్తున్నారు. పోల్‌ చిటీలో పోలింగ్‌ స్టేషన్‌ అడ్రస్‌, వరుస సంఖ్యతోపాటు రూట్‌ మ్యాప్‌ కూడా పొందుపర్చారు. అలాగే నియోజకవర్గంలో 9 మండలాల్లో 307 పోలింగ్‌ స్టేషన్‌లో 2,33,191 మంది ఓటర్లు ఉన్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. అందులో ములుగు జిల్లా కేంద్రంలోని బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రత్యేకంగా ఒక మహిళా పోలింగ్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. దీనిలో కేవలం మహిళలు మాత్రమే ఓటు హక్కును వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు.

తొలిరోజు 44 మంది సద్వినియోగం

జిల్లాలో 78 మంది వృద్ధులు,

దివ్యాంగులు

హోం ఓటింగ్‌ షురూ
1/1

హోం ఓటింగ్‌ షురూ

Advertisement
 

తప్పక చదవండి

Advertisement