కేటీఆర్‌.., హరీశ్‌రావు | Sakshi
Sakshi News home page

కేటీఆర్‌.., హరీశ్‌రావు

Published Sat, May 4 2024 12:45 AM

-

హబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థులు మన్నె శ్రీనివాస్‌ రెడ్డి, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌కు మద్దతుగా బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల ఆయా పార్లమెంట్‌ స్థానాల్లో నిర్వహించిన రోడ్‌షోలు, కార్నర్‌ మీటింగ్‌లకు హాజరై పార్టీ శ్రేణులు, ప్రజలనుద్దేశించి మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ వారంలో ప్రచార గడువు ముగిసేలోపు ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్‌), మరో మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు వివిధ ప్రాంతాల్లో పర్యటించనున్నారు. కొత్తకోట, దేవరకద్ర, మక్తల్‌, భూత్పూర్‌, నాగర్‌కర్నూల్‌లో నిర్వహించనున్న రోడ్‌షోలు, కార్నర్‌ మీటింగ్‌కు హాజరుకానున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement
Advertisement