అంతరాయం లేకుండా విద్యుత్‌ అందించాలి | Sakshi
Sakshi News home page

అంతరాయం లేకుండా విద్యుత్‌ అందించాలి

Published Sat, May 4 2024 4:55 AM

-

గూడూరు: వేసవిలో అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా చేయాలని జిల్లా విద్యుత్‌ పర్యవేక్షణ అధికారి నరేష్‌ అన్నారు. మండల కేంద్రంలోని 33 కేవీ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌కు శుక్రవారం రాత్రి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది విధులు నిర్వహించే రిజిస్టర్‌, విద్యుత్‌ అంతరాయ సమయ నమోదు రిజిస్టర్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న వానాకాలం దృష్ట్యా ఈ నెల 15వ తేదీ అనంతరం ఫీడర్‌ మెయింటనెన్స్‌ పనుల ప్రణాళిక రూపొందించుకోవాలని ఏఈ ప్రణీత్‌కు ఆయన సూచించారు.

మార్కెట్‌కు

పోటెత్తిన ధాన్యం

కేసముద్రం: కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌కు శుక్రవారం ధాన్యం పోటెత్తింది. ఇటీవల ధాన్యం సీజన్‌ ప్రారంభం కాగా, 19వేలకు పైగా ధాన్యం బస్తాలు అమ్మకానికి వచ్చాయి. దీంతో షెడ్లు నిండిపోగా, ఓపెన్‌యార్డులో ధాన్యాన్ని రాశులుగా పోసుకున్నారు. టెండర్లు ఆలస్యం కావడంతో సాయంత్రం కాంటాలు, తొలకాలు ప్రారంభమయ్యాయి. అప్పటి వరకు రైతులు రాశుల వద్ద పడిగాపులు పడ్డారు. కాగా, క్వింటా ధాన్యానికి గరిష్ట ధర రూ.2,256, కనిష్ట ధర రూ.1,850 పలికినట్లు మార్కెట్‌ అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement