సీఎం జగన్‌ పాలనపై విస్తృతంగా ప్రచారం చేయండి | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ పాలనపై విస్తృతంగా ప్రచారం చేయండి

Published Sat, May 4 2024 8:55 AM

సీఎం జగన్‌ పాలనపై విస్తృతంగా ప్రచారం చేయండి

కొలిమిగుండ్ల: ీసఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనపై విస్తృతంగా ప్రచారం చేయాలని, అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని జెడ్పీచైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి వైఎస్సార్‌సీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం కొలిమిగుండ్లలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో పార్టీ మండల ఇన్‌చార్జ్‌ కాటసాని ప్రసాదరెడ్డితో కలిసి యువతీ, యువకులు, పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత పార్టీ కోసం కష్ట పడి పని చేసి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎంగా చేసేందుకు కృషి చేయాలని కోరారు. దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలను తీర్చిన ఘనత ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికే దక్కుతుందన్నారు. నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దిన కాటసానిని గెలిపించుకునే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు అంబటి గుర్విరెడ్డి, జిల్లా ప్రచార కార్యదర్శి పేరం సత్యనారాయణరెడ్డి, జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు లాయర్‌ మహేశ్వరరెడ్డి, జేసీఎస్‌ మండల కన్వీనర్‌ మొలక రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement