ఇంజినీరింగ్‌ విద్యార్థులకు మంచి ప్లేస్‌మెంట్స్‌ | Sakshi
Sakshi News home page

ఇంజినీరింగ్‌ విద్యార్థులకు మంచి ప్లేస్‌మెంట్స్‌

Published Sat, May 4 2024 8:55 AM

ఇంజినీరింగ్‌ విద్యార్థులకు మంచి ప్లేస్‌మెంట్స్‌

● ఆర్‌యూ వీసీ ప్రొఫెసర్‌ బి.సుధీర్‌ ప్రేమ్‌ కుమార్‌

కర్నూలు కల్చరల్‌: ఇంజినీరింగ్‌ విద్యార్థులకు మంచి ప్లేస్‌మెంట్స్‌ చూపించాలని రాయలసీమ విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ బి.సుధీర్‌ ప్రేమ్‌ కుమార్‌ అధ్యాపకులను ఆదేశించారు. శుక్రవారం వీసీ తన చాంబర్‌లో వర్సిటీ రెక్టార్‌ ప్రొఫెసర్‌ ఎన్‌.టి.కె.నాయక్‌తో కలిసి , ఇంజినీరింగ్‌ కళాశాల అధ్యాపకులతో సమీక్ష నిర్వహించారు. లెసన్‌ ప్లాన్‌తో పాటు అవసరమైన రికార్డులను అధ్యాపకులు తప్పనిసరిగా తయారు చేసుకోవాలన్నారు. వేసవి సెలవుల అనంతరం బయోమెట్రిక్‌ ద్వారా విద్యార్థుల హాజరును పర్యవేక్షిస్తామన్నారు. విద్యార్థుల స్థాయిని అనుసరించి అవసరమైన వారికి అదనపు తరగతులను నిర్వహించాలన్నారు. సైబర్‌ సెక్యూరిటీ అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. అధ్యాపకుల నైపుణ్యాల మెరుగుదలకు శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. కా ర్యక్రమంలోఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వై. హరిప్రసాద్‌రెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.

స్నాతకోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు చేయండి

రాయలసీమ విశ్వవిద్యాలయ 4వ స్నాతకోత్సవం (కాన్వకేషన్‌) జూన్‌ 21వ తేదీన నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాల్సిందిగా విశ్వ విద్యాలయ వీసీ సుధీర్‌ ప్రేమ్‌ కుమార్‌ వర్సిటీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం వీసీ ఛాంబర్‌లో కాన్వకేషన్‌ నిర్వహణపై వర్సిటీలోని వివిధ విభాగాల ఆచార్యులు, అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. స్నాతకోత్సవ నిర్వహణకు వివిధ కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వర్సిటీ రెక్టార్‌ ఆచార్య ఎన్‌టీకే నాయక్‌, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎన్‌.అంకన్న, సైన్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య సి.వి.కృష్ణారెడ్డి, రీసెర్చ్‌ డైరెక్టర్‌ ఆచార్య సి.విశ్వనాథరెడ్డి, అకడమిక్‌ అఫైర్స్‌ డీన్‌ ఆచార్య ఆర్‌.భరత్‌కుమార్‌, ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వై. హరిప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement