నాలుగైదు రోజులు జాప్యం జరిగేతే నష్టమేమి | Sakshi
Sakshi News home page

నాలుగైదు రోజులు జాప్యం జరిగేతే నష్టమేమి

Published Sat, May 4 2024 8:25 AM

నాలుగ

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోంది. ఇందువల్ల పెన్షనర్లకు పెన్షన్‌ ఇవ్వడంలో కొద్దిగా జాప్యం జరుగుతోంది. నాలుగైదు రోజులు జాప్యం కావడం వల్ల నష్టపోయేది ఏమీ లేదు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు మా వంతుగా సహకరిస్తాం. పెన్షన్‌ ఆలస్యం అవుతుందనే కారణంతో ప్రభుత్వంపై మాకు ఎలాంటి కోపం, ద్వేషం లేవు. ఈ ఎన్నికలు చాలా ముఖ్యమైనవి. ప్రతిఒక్కరూ విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాల్సిన అవసరం ఉంది.

– రంగారెడ్డి, కర్నూలు పెన్షనర్ల సంఘం

ఉద్యోగుల పట్ల జగన్‌ స్నేహభావం

చంద్రబాబుతో పోలిస్తే జగన్‌ ఉద్యోగుల పట్ల స్నేహభావంతో ఉంటారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కనీవినీ ఎరుగని రీతిలో సంక్షేమ పథకాలు అమలు చేశారు. ఎన్నో కుటుంబాలు సంక్షేమ పథకాలను వినియోగించుకొని పేదరికం నుంచి బయటపడ్డాయి. సచివాలయాలు, వలంటీర్‌ వ్యవస్థ ద్వారా పాలన ప్రజల వద్దకే వచ్చింది. ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నపుడు వేతనాలు, పెన్షన్‌ చెల్లింపులో కొందరికి జాప్యం జరగవచ్చు. దీనిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు.

– జి.రాముడు, విశ్రాంత ఉద్యోగి

కష్టకాలంలో కూడా పెన్షన్‌ ఇచ్చారు

పెన్షన్‌, వేతనాల చెల్లింపుల్లో కొంతమందికి నాలుగైదు రోజులు ఆలస్యమైనంత మాత్రానా ద్వేషం పెంచుకోవాల్సిన అవసరం లేదు. మాకు ప్రతి నెలా మొదటి వారంలోనే పెన్షన్‌ వస్తుంది. ఏప్రిల్‌ నెల పెన్షన్‌ మే ఒకటవ తేదీనే పడింది. కరోనా వంటి కష్టమైన పరిస్థితుల్లో ఇటు సంక్షేమం, ఉద్యోగులకు, పెన్షనర్లకు వేతనాలు, పెన్షన్‌ సకాలంలోనే ఇచ్చారు. కష్టకాలంలో అందరికీ ప్రభుత్వం అండగా నిలిచింది. – శివరామిరెడ్డి, విశ్రాంత ఉద్యోగి

నాలుగైదు రోజులు జాప్యం జరిగేతే నష్టమేమి
1/2

నాలుగైదు రోజులు జాప్యం జరిగేతే నష్టమేమి

నాలుగైదు రోజులు జాప్యం జరిగేతే నష్టమేమి
2/2

నాలుగైదు రోజులు జాప్యం జరిగేతే నష్టమేమి

Advertisement
 
Advertisement