నిరంతర విద్యుత్‌ సరఫరాకు చర్యలు | Sakshi
Sakshi News home page

నిరంతర విద్యుత్‌ సరఫరాకు చర్యలు

Published Sat, May 4 2024 12:53 AM

నిరంతర విద్యుత్‌ సరఫరాకు చర్యలు

ఖమ్మంవ్యవసాయం: వేసవిలో విద్యుత్‌ వినియోగం పెరుగుతుండగా, అంతరాయాలు లేకుండా సరఫ రా చేసేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు ఎన్పీ డీసీఎల్‌ ఖమ్మం ఎస్‌ఈ ఏ.సురేందర్‌ తెలిపారు. ఖమ్మం మమతా ఆస్పత్రి రోడ్డులోని సబ్‌ స్టేషన్‌లో రూ.కోటి వ్యయంతో ఏర్పాటు చేసిన అదనపు 5 ఎంవీఏ పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ మేరకు ట్రాన్స్‌ఫార్మర్‌ పని తీరును పరిశీలించిన ఎస్‌ఈ మాట్లాడుతూ నగరం విస్తరిస్తుండగా పెరుగుతున్న అవసరాల మేరకు సౌకర్యాలను మెరుగుపరుస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఏర్పాటుచేసిన అదనపు ట్రాన్స్‌ఫార్మర్‌ ద్వారా రాఘవయ్యనగర్‌, గొల్లగూడెం, చెరువుకట్ట బజార్‌, రోటరీనగర్‌, శ్రీనగర్‌ కాలనీ తదితర ప్రాంతాల్లో విద్యుత్‌ అంతరాయాలు ఉండవని చెప్పారు. డీఈలు బాబూరావు, నంబూరి రామారావు, భద్రుపవార్‌, ఏడీఈ రమేష్‌ పాల్గొన్నారు.

రఘునాథపాలెంలో...

రఘునాథపాలెం: రఘునాథపాలెంలో నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేసేందుకు రూ.4లక్షల వ్యయంతో నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేసినట్లు డీఈ ఎన్‌.రామారావు, ఏడీఈ సంజయ్‌కుమార్‌ తెలి పారు. గ్రామంలోని గాంధీ బొమ్మ సెంటర్‌, ఎస్సీ కాలనీల్లో అంతరాయాలు నివారించడానికి ఈ ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటుచేశామని చెప్పారు. ఏఈ ఇందిర, ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement