మద్దతు ధర పెంచి, బోనస్‌ ఇవ్వాలి | Sakshi
Sakshi News home page

మద్దతు ధర పెంచి, బోనస్‌ ఇవ్వాలి

Published Sat, May 4 2024 8:15 AM

-

కరీంనగర్‌: పంటలకు మద్దతు ధర పెంచి, బోనస్‌ ఇవ్వాలని సీపీఐ(ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ ఉమ్మడి జిల్లా కార్యదర్శి కె.విశ్వనాథ్‌ అన్నారు. శుక్రవారం కరీంనగర్‌ వ్యవసాయ మార్కెట్‌లో ఆయన రైతులను కలిసి మాట్లాడారు. ఏ–గ్రేడ్‌ వరి ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2,203, బీ–గ్రేడ్‌ ధాన్యానికి రూ.2,183 ఎటూ సరిపోవని, రూ.3,500 ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వరి పంటకు రూ.500 బోనస్‌, రైతు రుణమాఫీ, రైతు బీమా, సబ్సిడీ ఎరువులు వెంటనే అమలు చే యాలని డిమాండ్‌ చేశారు. మార్కెట్లో రైతుల కు తాగునీరు, బాత్‌రూం, మరుగుదొడ్లు, విశ్రా ంతి గదులు తదితర సౌకర్యాలు వెంటనే కల్పించాలని కోరారు. వారికి నష్టం చేసే మిల్ల ర్లు, దళారులపై అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. తేమ, మట్టి, తాలు లెక్కలోకి తీసుకోకుండా ధాన్యం కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు రత్నం రమేశ్‌, బాబు, సంతోష్‌, దుర్గ న్న, రాజేందర్‌, మల్లవ్వ, సుగుణ, బుచ్చన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement