ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌ ఖాళీ | Sakshi
Sakshi News home page

ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌ ఖాళీ

Published Sat, May 4 2024 5:15 AM

ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌ ఖాళీ

భిక్కనూరు: పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పూర్తిగా ఖాళీ అవుతుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ అన్నారు. కేవలం కేసీఆర్‌ కుటుంబీకులు, పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకున్న వారు మాత్రమే ఆ పార్టీలో ఉంటారని వ్యాఖ్యానించారు. శుక్రవారం మార్క్‌ఫెడ్‌ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు జేపీ సిద్ధాగౌడ్‌ తన అనుచరులతో కలిసి కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా షబ్బీర్‌ అలీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీకి ప్రజల్లో అపూర్వ ఆదరణ లభిస్తోందని పేర్కొన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో జహీరాబాద్‌ ఎంపీగా కాంగ్రెస్‌ అభ్యర్థి సురేశ్‌షెట్కార్‌ భారీ మెజారిటీతో గెలుస్తారన్నారు. కేసీఆర్‌ తన హయాంలో రైతులకు మాయమాటలు చెప్పడం తప్ప వారికి ఒరగబెట్టిందేమీ లేదన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గాలిరెడ్డి, పీసీసీ కార్యదర్శి ఇంద్రకరణ్‌రెడ్డి, కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు భీంరెడ్డి, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు బల్యాల సుదర్శన్‌, విండో చైర్మన్‌ గంగళ్ల భూమయ్య, నేతలు దయాకర్‌రెడ్డి, నర్సింహరెడ్డి, మ్యాతరి నర్సింలు, బత్తుల బాగులు, జేపీ వెంకటేశ్‌ గౌడ్‌ పాల్గొన్నారు.

కాంగ్రెస్‌కు ప్రజల్లో అపూర్వ ఆదరణ

ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ

Advertisement
Advertisement