అధికారులు అప్రమత్తంగా ఉండాలి | Sakshi
Sakshi News home page

అధికారులు అప్రమత్తంగా ఉండాలి

Published Sat, May 4 2024 5:15 AM

అధికారులు అప్రమత్తంగా ఉండాలి

కామారెడ్డి టౌన్‌: రాబోయే మూడురోజుల్లో జిల్లాలో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్‌ చంద్ర మోహన్‌ సూచించారు. మానిటరింగ్‌ అధికారులు, పౌర సరఫరాల డిప్యూటీ తహసీల్దార్లు, లారీ ట్రాన్స్‌పోర్ట్‌ కాంట్రాక్టర్లతో శుక్రవారం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 5 నుంచి 7 వరకు జిల్లాలో భారీవర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రైతులు ఇబ్బంది పడకుండా అవసరమైన టార్పాలిన్లు, గోనె సంచులను కేంద్రాల్లో అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ధాన్యాన్ని రైస్‌ మిల్లులకు తరలించేందుకు కొనుగోలు కేంద్రాలకు అవసరమైన లారీలను అందించాలని ట్రాన్స్‌పోర్ట్‌ అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఎటువంటి ఆలస్యం చేయకుండా రాత్రి కూడా కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని తూకం వేసి ట్యాగ్‌చేసిన మిల్లుల కు తరలించాలని, ట్యాబ్‌ ఎంట్రీ కూడా వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అందరూ డిప్యూ టీ తహసీల్దార్లు కేంద్రాల్లో కొనుగోళ్ల ప్రక్రియను నిశితంగా పరిశీలిస్తూ వేగవంతం అయ్యేలా చూడాలన్నారు. కేంద్రాల ఇన్‌చార్జీలు, ట్రాన్స్‌పోర్ట్‌ కాంట్రాక్టర్లు, రైస్‌మిల్లర్లతో సమన్వయం చేసుకుంటూ నాణ్యతా ప్రమాణాలకనుగుణంగా ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు తరలించే వరకు మానిటరింగ్‌ చేయాలని ఆదేశించారు. కాన్ఫరెన్స్‌లో జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున్‌ బాబు, పౌర సరఫరాల జిల్లా మేనేజర్‌ నిత్యానందం, డిప్యూటీ తహసీల్దార్లు, మానిటరింగ్‌ అధికారులు, లారీ ట్రాన్స్‌పోర్ట్‌ కాంట్రాక్టర్లు, రైస్‌ మిల్లర్లు పాల్గొన్నారు.

మూడు రోజుల పాటు

వర్షాలు కురిసే అవకాశం

అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌

Advertisement
 
Advertisement