కూలీల కనీస వేతనం పెంచాలి | Sakshi
Sakshi News home page

కూలీల కనీస వేతనం పెంచాలి

Published Sat, May 4 2024 5:15 AM

కూలీల

కామారెడ్డి క్రైం: మండలాల్లో ఉపాధి హామీ పథకం కింద ప్రజలకు అవసరమైన వివిధ పనులను గుర్తించి కూలీలకు ఉపాధి కల్పిస్తూ.. కనీస వేతనం 300 చెల్లించేలా చూడాలని రాష్ట్ర పంచాయతీ రాజ్‌ డిప్యూటీ కమిషనర్‌ జాన్‌ వెస్లీ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో డీఆర్‌డీవో చందర్‌ నాయక్‌తో కలిసి కూలీల హాజరు శాతం, కనీస వేతనం, పని ప్రాంతాల్లో సౌకర్యాలపై ఎంపీడీవోలు, ఏపీవోలు, టెక్నికల్‌ అసిస్టెంట్లు, ఈసీలతో సమీక్ష సమావేశం నిర్వాహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొన్ని మండలాల్లో కూలీల హాజరు, కనీస వేతనం చాలా తక్కువగా ఉందన్నారు. రాబోయే వారం రోజుల్లోగా సమీక్షించి హాజరుశాతం, కనీస వేతనం పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా ఉపాధి కూలీలకు వడదెబ్బ తగలకుండా పనిచేసే చోట టెంట్లు, తాగునీరు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. సమావేశంలో ఎంపీడీవోలు, ఏపీవోలు, టెక్నికల్‌ అసిస్టెంట్లు, ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్స్‌, తదితరులు పాల్గొన్నారు.

ఆర్డీవో కార్యాలయంలో

ఫెసిలిటేషన్‌ సెంటర్‌ ఏర్పాటు

కామారెడ్డి క్రైం: ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులు పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకునేందుకు గాను కామారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి ఓటర్‌ ఫెసి లిటేషన్‌ సెంటర్‌ను ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేశామని ఆర్డీవో రంగనాథరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రిసైడింగ్‌ అధికారులు, సహాయ ప్రిసైడింగ్‌ అధికారులు 4 ,5 తేదీల్లో, ఇతర పోలింగ్‌ సిబ్బంది 6, 7 తేదీల్లో తమ పోస్టల్‌ బ్యాలెట్‌ను ఉపయోగించుకోవాలని సూచించారు. నియోజక వర్గంలో 2167 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యాన్ని వినియోగించనున్నారని తెలిపారు. తహసీల్దార్‌ జనార్దన్‌, తదితరులు పాల్గొన్నారు.

నియోజకవర్గాలకు ఈవీఎంలు

కామారెడ్డి క్రైం: ఈవీఎంలను అసెంబ్లీ నియోజకవర్గాలకు రెవెన్యూ అదనపు కలె క్టర్‌ చంద్రమోహన్‌ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్గో బస్సుల్లో పంపారు. ప్రక్రియను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో శుక్రవారం నిర్వహించారు. జుక్కల్‌ నియోజకవర్గానికి 319, ఎల్లారెడ్డి నియోజకవర్గానికి 338, కామారెడ్డి నియోజకవర్గానికి 333 చొప్పున కేటాయించిన ఈవీఎంలను భారీ భద్రతతో పంపించారు. కార్యక్రమంలో పార్టీల ప్రతినిధులు నరేందర్‌, కాసీంఅలీ, ఎన్నికల విభాగం అధికారులు ఉమలత, ఇందిరా ప్రియదర్శిని, సంతోష్‌ రెడ్డి పాల్గొన్నారు.

పది కళాశాలల్లో

‘గుర్తింపు’ తనిఖీలు

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ వర్సిటీ పరిధి లో యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు కో సం నిర్వహిస్తున్న డిగ్రీ, పీజీ కళాశాలల తనిఖీలు శుక్రవారం కొనసాగాయి. ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ ఘంటా చంద్రశేఖర్‌ నేతృత్వంలో మ హాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల డిగ్రీ కాలేజీ(వర్ని), విజయ డిగ్రీ కాలేజీ (వర్ని), బాన్సువాడలోని ఎస్‌ఆర్‌ఎన్‌కే డిగ్రీ కాలేజీ, ఎస్‌ఎస్‌ఎల్‌ డిగ్రీ కాలేజీ, శశాంక్‌ డిగ్రీ కాలేజీ, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ(బిచ్కుంద), ప్రభు త్వ డిగ్రీ కాలేజీ(మద్నూర్‌), రత్న డిగ్రీ కాలేజీ (మద్నూర్‌), రెయిన్‌బో డిగ్రీ కాలేజీ (జుక్కల్‌), ఎస్‌వీ డిగ్రీ కాలేజీ (పిట్లం)లో తనిఖీలు నిర్వహించారు. నిబంధనల మేరకు వసతి, సౌకర్యలు లేని కళాశాలలకు నోటీసులు అందజేసినట్లు ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు.

కూలీల కనీస వేతనం  పెంచాలి
1/3

కూలీల కనీస వేతనం పెంచాలి

కూలీల కనీస వేతనం  పెంచాలి
2/3

కూలీల కనీస వేతనం పెంచాలి

కూలీల కనీస వేతనం  పెంచాలి
3/3

కూలీల కనీస వేతనం పెంచాలి

Advertisement
Advertisement