వైద్య శాఖలో 3,156 పోస్టుల భర్తీ | Sakshi
Sakshi News home page

వైద్య శాఖలో 3,156 పోస్టుల భర్తీ

Published Sat, May 4 2024 10:15 AM

వైద్య శాఖలో 3,156 పోస్టుల భర్తీ

కాకినాడ సిటీ: గతంలో వైద్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు ఏళ్ల తరబడి భర్తీ చేసేవారు కాదు. రెండు మూడు పీహెచ్‌సీలకు ఒక వైద్యుడు సేవలు అందించే పరిస్థితి. మూడు పీహెచ్‌సీలకు ఒక ల్యాబ్‌ టెక్నీషియన్‌ సేవలు అందించే వారు. ఈ పరిస్థితిని పూర్తిగా మారుస్తూ ప్రభుత్వం ప్రతి పీహెచ్‌సీకి ఇద్దరు వైద్యులను, ముగ్గురు స్టాఫ్‌ నర్సులను నియమించింది. ప్రతీ పీహెచ్‌సీకి ఒక ల్యాబ్‌ టెక్నీషియన్‌ను నియమించారు. జీరో వేకెన్సీ పాలసీ తీసుకొచ్చి పోస్టుల కొరత లేకుండా పోస్టులను భర్తీ చేశారు. వైద్య, ఆరోగ్య శాఖ, వైద్య విధాన పరిషత్‌, ప్రభుత్వ వైద్య కళాశాలల్లో వేలాది పోస్టులను భర్తీ చేశారు. వైద్య, ఆరోగ్య శాఖలో 2019 నుంచి ఇప్పటి వరకూ 3,156 మంది ఉద్యోగుల నియామకాలు జరిపారు. వార్డు బాయ్‌ దగ్గర నుంచి స్పెషలిస్టు డాక్టర్‌ వరకూ అన్ని కేడర్ల పోస్టులూ భర్తీ చేశారు. విలేజ్‌ క్లినిక్‌లలో కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్ల(సీహెచ్‌ఓ)ను నియమించారు. వీరు గ్రామ స్థాయిలో అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందిస్తున్నారు.

2019 నుంచి భర్తీ చేసిన పోస్టులు

కేడర్‌ పోస్టుల సంఖ్య

ప్రత్యేక వైద్యులు 28

మెడికల్‌ ఆఫీసర్లు 45

మెడికల్‌ ఆఫీసర్లు అర్బన్‌ 21

ఏఎన్‌ఎంలు 1,130

స్టాఫ్‌ నర్సులు 180

ఫార్మసిస్టులు 77

ల్యాబ్‌ టెక్నీషియన్లు 53

ఎంఎల్‌హెచ్‌పీలు 1,010

ఇతర పోస్టులు 56

క్లాస్‌–4 ఉద్యోగులు 120

డేటా ఎంట్రీ ఆపరేటర్స్‌ 25

ఎలక్ట్రీషియన్లు 4

థియేటర్‌ అసిస్టెంట్లు 3

ఈసీసీ టెక్నీషియన్లు 5

ఓటీ టెక్నీషియన్‌ 7

రేడియోగ్రాఫర్లు 10

ఫిజియోథెరపిస్ట్‌లు 4

డెంటల్‌ టెక్నీషియన్లు 2

108 సిబ్బంది 206

104 సిబ్బంది 120

102 సిబ్బంది 50

Advertisement
Advertisement