కార్మికుల కార్ఖానా | Sakshi
Sakshi News home page

కార్మికుల కార్ఖానా

Published Sat, May 4 2024 10:15 AM

కార్మ

కాకినాడ రూరల్‌

ఉపాధికి నెలవైన నియోజకవర్గం

సుందర సాగరతీరం

సందర్శకుల స్వర్గధామం

ఆధ్యాత్మిక కేంద్రాలకు నిలయం

కాకినాడ రూరల్‌: పరిశ్రమలకు నెలవుగా, కార్మికులకు ఉపాధి నిలయంగా, మత్స్యకారుల వేటకు భరోసాగా, ఆధ్యాత్మికతకు చిరునామాగా కాకినాడ రూరల్‌ నియోజవర్గం ఖ్యాతి గడించింది. నియోజకవర్గ పరిధిలోని నాగార్జున ఎరువులు, పురుగు మందుల తయారీ కర్మాగారం, కోరమండల్‌ డీఏపీ ఎరువుల తయారీ కర్మాగారాలతో కాకినాడకు ఎరువుల నగరంగా పేరొచ్చింది. కాకినాడ సీ పోర్టు ద్వారా విదేశాల నుంచి భారీగా వంట నూనెలు దిగుమతి చేసుకుని శుద్ధి చేసుకునేందుకు నియోజకవర్గ పరిధిలోని సూర్యారావుపేట, వాకలపూడి తదితర గ్రామాల్లో పెద్ద ఎత్తున వంట నూనెల శుద్ధి పరిశ్రమలు నియోజకవర్గంలో ఏర్పాటు కావడంతో వేలాది మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. వంట నూనెలను ఇతర ప్రాంతాలకు లారీ ట్యాంకర్లతో రవాణా చేయడంతో డ్రైవర్లు, క్లీనర్లు, ట్యాంకర్ల యజమానులు ఎందరో ఉపాధి పొందుతున్నారు. సీజనల్‌గా వేసవిలో లభించే మామిడికాయలను పండూరు, సర్పవరం గ్రామాల్లో దిగుమతి చేసుకుని పచ్చళ్లు, తాండ్ర తయారీ చేసి వందల సంఖ్యలో మహిళలు ఉపాధి పొందుతున్నారు. ఇక్కడ తయారు చేసే తాండ్ర, పచ్చళ్లకు ఒడిశా, మధ్యప్రదేశ్‌, ముంబై తదితర ప్రాంతాల్లో మంచి గిరాకీ ఉంది. సూర్యారావుపేట బీచ్‌ పర్యాటకంగా అభివృద్ధ్ది చెండడంతో ఆదివారం, సెలవు దినాల్లో వేలాదిగా సందర్శకులు వస్తూంటారు. సూర్యారావుపేట లైట్‌ హౌస్‌, బీచ్‌, బీచ్‌ పార్కు, శిల్పారామం హైలైట్‌గా నిలుస్తాయి. కాకినాడ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ నిధులు రూ.9 కోట్లతో బీచ్‌ పార్కు అభివృద్ధితో పాటు యుద్ధ విమాన మ్యూజియం ఏర్పాటు చేశారు. ఇవి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అలాగే, భారత నావికాదళంలో సుమారు 30 ఏళ్ల పాటు సేవలందించిన యూటీ–142ఎం యుద్ధ విమాన మ్యూజియం ఇక్కడ ఏర్పాటు చేశారు. దీని ద్వారా యువతకు వినోదం, విజ్ఞానం లభిస్తున్నాయి. ఆధ్యాత్మికంగా కూడా రూరల్‌ నియోజకవర్గానికి పేరుంది. సర్పవరం గ్రామంలో నారద మహర్షి స్వయంగా నిర్మించిన రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి ఆలయం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనే ఎంతో ప్రసిద్ధి గాంచింది. తూర్పున నేమాం గ్రామంలో పురాతన శివాలయం ప్రసిద్ధి చెందగా, తూరంగి, రేపూరు శివాలయాలు సైతం ఎంతో పేరొందినవే.

నియోజకవర్గ స్వరూపం

కాకినాడ రూరల్‌ నియోజకవర్గం 2009లో ఏర్పడింది. గతంలో తాళ్లరేవు నియోజవర్గంలోని కరప మండలం, సంపర నియోజకవర్గంలోని కాకినాడ రూరల్‌ మండలం, కాకినాడ అర్బన్‌లోని 8 డివిజన్లతో ఈ నియోజకవర్గం ఏర్పడింది. దీనికి తూర్పున బంగాళాఖాతం, మధ్యలో కాకినాడ సిటీ, పశ్చిమాన అనపర్తి, ఉత్తరం వైపు పిఠాపురం, దక్షిణాన రామచంద్రపురం, ముమ్మిడివరం నియోజకవర్గాలు సరిహద్దులుగా ఉన్నాయి.

రాజకీయ పోరు

కాకినాడ రూరల్‌ నియోజకవర్గం ఏర్పడిన తరువాత తొలిసారిగా 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా కురసాల కన్నబాబు విజయం సాధించారు. 2014లో పిల్లి అనంతలక్ష్మి టీడీపీ నుంచి గెలుపొందారు. 2019లో కురసాల కన్నబాబు వైఎస్సార్‌ సీపీ నుంచి రెండోసారి విజయం సాధించారు. 2019లో వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన వ్యవసాయ, సహకార, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ మంత్రిగా పని చేశారు. రెండున్నరేళ్ల పాటు ఆయన మంత్రిగా పని చేశారు. 2019 ఎన్నికల్లో 8,786 ఓట్ల మెజార్టీ సాధించారు.

మరికొన్ని విశేషాలు..

● సర్పవరంలోని రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి ఆలయంలో మాఘమాసం నాలుగో ఆదివారం తిరునాళ్లకు ప్రసిద్ధ్ది. ఇక్కడ మహిళలు పాలు పొంగించి, పొంగలి తయారు చేసి, సూర్యభగవానుడిని పూజించి నైవేద్యం సమర్పిస్తారు.

● రమణయ్యపేటలో పరిపూర్ణానంద స్వామి పర్యవేక్షణలో ఐశ్వర్యాంబికా సమేత సుందరేశ్వరస్వామి కొలువైన శ్రీపీఠం ఉంది.

● వేలాది మంది మత్స్యకారులు తమ బోట్లు లంగరు వేసుకునేందుకు, చేపలు, రొయ్యల విక్రయానికి వాకలపూడి ఫిషింగ్‌ హార్బర్‌ ప్రసిద్ధి.

● కాకినాడ డీప్‌ వాటర్‌ పోర్టు ద్వారా బియ్యం ఎగుమతులు, సీ పోర్టు ద్వారా వంట నూనెల దిగుమతులు జరుగుతాయి.

● ఓడలకు కాకినాడ ల్యాండ్‌ మార్కు తెలియజేసే దిక్సూచిగా సూర్యారావుపేట లైట్‌ హౌస్‌ ఉంది.

● నియోజకవర్గ పరిధిలోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ – కాకినాడ) ఎంతోమంది విద్యార్థులను ఇంజినీర్లుగా తీర్చిదిద్దింది.

కాకినాడలోని కోరమాండల్‌ కర్మాగారం

జనాభా వివరాలు

మొత్తం జనాభా 3,11,503

పురుషులు 1,55,519

మహిళలు 1,55,964

ఇతరులు 20

నియోజకవర్గంలో ఓటర్ల వివరాలు

మొత్తం ఓటర్లు 2,69,330

పురుషులు 1,33,475

మహిళలు 1,35,847

ఇతరులు 8

నియోజకవర్గ ప్రత్యేకతలు

● సందర్శకులను కట్టి పడేసే సాగర అందాలు

● ఎరువులు, వంట నూనెలు శుద్ధి పరిశ్రమలు

● పండూరులో పచ్చళ్ల తయారీ..

సర్పవరంలో చవులూరించే మామిడి తాండ్ర

● సందర్శకులను ఆకట్టుకుంటున్న

● యుద్ధ్ద విమాన మ్యూజియం

● సర్పవరంలో నారద మహర్షి నిర్మించిన

భావనారాయణ స్వామి ఆలయం

సూర్యారావు

పేట వద్ద లైట్‌ హౌస్‌

2019–24 మధ్య వివిధ పథకాల ద్వారా లబ్ధి

పథకం లబ్ధిదారులు లబ్ధి (రూ.కోట్లలో)

జగనన్న అమ్మ ఒడి 30,220 134.29

జగనన్న విద్యా దీవెన 20,549 72.77

జగనన్న వసతి దీవెన 16,000 27.53

వైఎస్సార్‌ రైతు భరోసా 22,716 106.96

డాక్టర్‌ వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా 16,790 64.43

వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాలు 9,919 4.85

రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ 15,900 16.70

వైఎస్సార్‌ మత్స్యకార భరోసా 4,993 11.86

వైఎస్సార్‌ పింఛన్‌ కానుక 38,823 348.86

వైఎస్సార్‌ చేయూత 15,073 63.29

వైఎస్సార్‌ ఆసరా 48,501 156.73

సున్నా వడ్డీ పథకం(డ్వాక్రా మహిళలకు) 59,666 13.89

వైఎస్సార్‌ కాపు నేస్తం 8,331 43.05

ఈబీసీ నేస్తం 1,334 5.92

వైఎస్సార్‌ కల్యాణ మస్తు/షాదీ తోఫా 70 3.24

వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ 12,584 52.92

హౌసింగ్‌ లబ్ధిదారులకు నేరుగా చెల్లింపులు 8,241 10.31

వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా 6,052 46.52

వైఎస్సార్‌ బీమా 659 9.65

వైఎస్సార్‌ వాహన మిత్ర 3,040 8.78

వైఎస్సార్‌ నేతన్న నేస్తం 99 0.91

జగనన్న చేదోడు 1,921 4.21

తెల్ల కార్డుదారులకు ప్రత్యేక కోవిడ్‌ సహాయం 70,493 8.17

జగనన్న తోడు(వడ్డీ) 4,599 22.64

మొత్తం 4,12,775 1200.87

నాన్‌ డీబీటీ లబ్ధి

ఇంటి స్థలాలు(భూసేకరణ అభివృద్ధికి పరిహారం) 28,423 1542.25

విద్యా కానుక 14,215 12.57

ట్యాబ్‌ల పంపిణీ 2,727 7.01

జగనన్న తోడు రుణాలు 8,240 14.52

జగనన్న గోరుముద్ద 14,778 15.00

వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ 18,728 34.45

వైఎస్సార్‌ కంటి వెలుగు 72,059 156.99

ఇంటింటికీ రేషన్‌ (79.8 లక్షల మిలియన్‌ టన్నులు) 7,620 16.21

మొత్తం 1,66,790 1,798.61

డీబీటీ, నాన్‌ డీబీటీ మొత్తం 5,79,565 2,999.47

నియోజకవర్గ సమాచారం

నియోజవర్గంలో డివిజన్లు, మండలాలు

నగరపాలక సంస్థ కాకినాడ (8 డివిజన్లు)

మండలాలు కాకినాడ రూరల్‌, కరప

మొత్తం పంచాయతీలు 41

(కాకినాడ రూరల్‌ 18, కరప – 23)

మేజర్‌ పంచాయతీలు 13

మైనర్‌ పంచాయతీలు 28

సచివాలయాలు 79

(కాకినాడ రూరల్‌ – 41, కరప – 21, అర్బన్‌ – 17)

రైతు భరోసా కేంద్రాలు 32

(కాకినాడ రూరల్‌ – 13, కరప – 19)

ఆర్బీకేలలో వెంటర్నరీ కేంద్రాలు 22

వెటర్నరీ ఆస్పత్రులు 7

విలేజ్‌/అర్బన్‌ క్లినిక్‌లు 75

కార్మికుల కార్ఖానా
1/3

కార్మికుల కార్ఖానా

కార్మికుల కార్ఖానా
2/3

కార్మికుల కార్ఖానా

కార్మికుల కార్ఖానా
3/3

కార్మికుల కార్ఖానా

Advertisement
Advertisement