పోస్టల్‌, హోం ఓటింగ్‌ షురూ.. | Sakshi
Sakshi News home page

పోస్టల్‌, హోం ఓటింగ్‌ షురూ..

Published Sat, May 4 2024 5:05 AM

పోస్టల్‌, హోం ఓటింగ్‌ షురూ..

జనగామ: పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్‌ కమిషన్‌ ఆదేశాల మేరకు చేపట్టిన పోస్టల్‌, హోం పోలింగ్‌ శుక్రవారం నుంచి ప్రారంభమైంది. ఎన్నిక ల అధికారి, కలెక్టర్‌ షేక్‌ రిజ్వాన్‌ బాషా ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఎన్నికల విధులు నిర్వహ్తి స్తున్న బాధ్యులు పోస్టల్‌, ఇంటింటికీ ఓటింగ్‌ ప్రక్రియ కొనసాగించారు. దివ్యాంగులు, 85 ఏళ్ల వయసు పైబడిన వృద్ధులు, ఎసెన్షియల్‌ సర్వీసెస్‌ విధులు నిర్వరిస్తున్న వారికి ఎన్నికల కమిషన్‌ హోం ఓటింగ్‌, ఎలక్షన్‌ డ్యూటీలో ఉన్న ఉద్యోగుల కు పోస్టల్‌ బ్యాలెట్‌ అవకాశం కల్పించింది. జిల్లాలో హోం ఓటింగ్‌కు అర్హత కలిగిన ఓటర్లు 950, పోస్టల్‌ బ్యాలెట్‌ వేసే ఉద్యోగులు సుమారు 2,600 మంది ఉన్నారు. ఇందులో మొదటి రోజు రెండు కేటగిరీల్లో 420 మంది ఓటు హక్కును సద్వినియోగం చేసుకోగా.. మరో రెండు రోజుల సమయం ఉంది.

మొదటి రోజు 420 ఓట్లు పోలింగ్‌

Advertisement
Advertisement