ఈవీఎంల సప్లిమెంటరీ ర్యాండమైజేషన్‌ పూర్తి | Sakshi
Sakshi News home page

ఈవీఎంల సప్లిమెంటరీ ర్యాండమైజేషన్‌ పూర్తి

Published Sat, May 4 2024 5:05 AM

ఈవీఎంల సప్లిమెంటరీ ర్యాండమైజేషన్‌ పూర్తి

జనగామ: పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో శుక్రవా రం కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా ఆధ్వర్యంలో ఈవీఎంల సప్లిమెంటరీ ర్యాండమైజేషన్‌ ప్రక్రియను రాజకీ య పార్టీల సమక్షంలో పూర్తి చేశారు. కలెక్టరేట్‌లో జరిగిన ఈ కార్యక్రమం అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ భువనగిరి పార్లమెంట్‌ బరిలో 39 మంది, వరంగల్‌(ఎస్సీ నియోజకవర్గం)లో 42 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని చెప్పారు. అభ్యర్థుల సంఖ్య పెరగడంతో అదనపు బ్యాలెట్‌ యూనిట్లు ఏర్పాటు చేశామని, ఇందుకు ఎలక్షన్‌ కమిషన్‌ నుంచి వచ్చిన ఈవీఎంలకు సప్లిమెంటరీ ర్యాండమైజేషన్‌ ప్రక్రియ నిర్వహించి నియోజకవర్గాల వారీగా కేటాయించినట్లు పేర్కొన్నారు. జనగామ నియోజ కవర్గంలో 278 పోలింగ్‌ కేంద్రాలకు బ్యాలెట్‌ యూనిట్లు 695, స్టేషన్‌ఘన్‌పూర్‌ 295 పోలింగ్‌ కేంద్రాలకు 738 బ్యాలెట్‌ యూనిట్లు, పాలకుర్తి 296 పోలింగ్‌ కేంద్రాలకు 740 బ్యాలెట్‌ యూనిట్లు కేటా యించామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ పింకేష్‌కుమార్‌, రాజకీయ పార్టీల ప్రతినిధులు భాస్కర్‌, రావెల రవి, విజయభాస్కర్‌, చంద్రశేఖర్‌, అజయ్‌కుమార్‌, కలెక్టరేట్‌ ఏఓ రవీందర్‌, ఎన్నికల సెల్‌ తహసీల్దార్‌ శ్రీనివాసరావు, ఎన్నికల విభాగం ప్రతినిధి బాలు, సతీష్‌ పాల్గొన్నారు.

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ పరిశీలన

జిల్లాలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ నమోదు ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. స్థానిక రెవెన్యూ డివిజనల్‌ కార్యాలయం(రిటర్నింగ్‌ అధికారి)లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్‌ కేంద్రంలో ఓటు నమోదు చేసే విధానాన్ని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా పరిశీలించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 1,003 మంది పోస్టల్‌ బ్యాలెట్లు వేయాల్సి ఉందని, ఇందుకు నియోజకవర్గాల వారీగా ఫెసిలి టేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మూడు రోజుల పాటు ఈ కేంద్రాలు అందుబాటులో ఉంటాయని, పోస్టల్‌ బ్యాలెట్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ వచ్చిన ప్రతి ఒక్కరికీ ఎలక్షన్‌ కమిషన్‌ పంపించిన ఎస్‌ఎంఎస్‌ చేరవేశామని తెలిపారు. కలెక్టర్‌ వెంట ఆర్డీఓలు కొమురయ్య, వెంకన్న, ఆర్డీఓ కార్యాలయ ఏఓ ప్రకాష్‌రావు, తహసీల్దార్‌ అహ్మద్‌ ఖాన్‌, పోలింగ్‌ సిబ్బంది ఉన్నారు.

రాజకీయ పార్టీల సమక్షంలో నిర్వహణ

Advertisement
Advertisement