నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు | Sakshi
Sakshi News home page

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు

Published Sat, May 4 2024 5:05 AM

నిబంధ

కొడకండ్ల : పార్లమెంట్‌ ఎలక్షన్స్‌ నేపథ్యంలో ఎన్నికల నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించా లి.. అతిక్రమిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని జనగామ డీసీపీ సీతారాం అన్నారు. శుక్రవారం గిర్నితండాలోని చెక్‌పోస్ట్‌ను సందర్శించిన ఆయన వాహనాల తనిఖీని పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. అనంతరం మాట్లాడు తూ.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్సై బండి శ్రావణ్‌కుమార్‌, ఇందిర సీఆర్‌పీఎఫ్‌ పోలీసులు పాల్గొన్నారు.

వేసవి క్రీడా శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

జనగామ రూరల్‌: వేసవి క్రీడా శిబిరాన్ని సద్వి నియోగం చేసుకుని తమలోని ప్రతిభ, నైపుణ్యాలకు మరింత పదును పెట్టాలని డీవైఎస్‌ఓ వెంకట్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని ధర్మకంచ మినీ స్టేడియంలో నెల రోజుల పాటు నిర్వహించే వేసవి ఉచిత క్రీడా శిక్షణ శిబిరాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. అథ్లెటిక్స్‌ శిక్షణ ఉదయం 6 నుంచి 7 30, సాయంత్రం 5 30 నుంచి 6 30 గంటల వరకు ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం కబడ్డీ, ఖోఖో, టెన్నిస్‌, వాలీబాల్‌ క్రీడాకారులకు దుస్తులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ధర్మకంచ పాఠశాల హెచ్‌ఎం శ్రీనివాస్‌, జిల్లా ఎస్‌జీఎఫ్‌ ఐ సెక్రటరీ పోగుల నరేందర్‌, పీఈటీ వేణు తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్‌ వినియోగ భద్రత

అందరి నైతిక బాధ్యత

దేవరుప్పుల : విద్యుత్‌ వినియోగ భద్రత ప్రతీ ఒక్కరూ నైతిక బాధ్యతగా తీసుకోవాలని ఎన్పీ డీసీఎల్‌ డీఈ కె.లక్ష్మీనారాయణరెడ్డి అన్నారు. విద్యుత్‌ భద్రతా వారోత్సవాల్లో భాగంగా స్థాని క సబ్‌స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. వేసవి కాలంలో గాలిదుమారం వచ్చినప్పుడు వ్యవసాయ క్షేత్రాల్లో వైర్లు తెగిపడి విద్యుత్‌ సరఫరా నిలిచిపోతే సంబంధిత శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వాలే తప్ప రైతులు సొంత ప్రయత్నాలు చేసి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దన్నారు. అనంతరం వారోత్సవాల లక్ష్యసాధ నకు సంబంధించి వాల్‌ పోస్టర్లు, కరపత్రాలు ఆవిష్కరించి ప్రతిజ్ఞ చేయించారు. ఏడీఈ అనిల్‌కుమార్‌, ఏఈలు పి.సుధాకర్‌, ఎం.రాజవర్దన్‌రెడ్డి, సబ్‌ఇంజనీర్లు సోనియా, ఉదయ్‌, ఎల్‌ఐలు సత్యనారాయణ, సురేంద్‌రెడ్డి, లైన్‌మెన్‌లు రాజేశ్వర్‌ రోశయ్య పాల్గొన్నారు.

సబ్‌స్టేషన్‌ను సందర్శించిన డైరెక్టర్‌

స్టేషన్‌ఘన్‌పూర్‌: మీదికొండ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ను నోడల్‌ అధికారి, ఎన్పీడీసీఎల్‌ డైరెక్టర్‌ సదర్‌లాల్‌ శుక్రవారం సందర్శించారు. ఓల్టేజీ హెచ్చు తగ్గులు, విద్యుత్‌ సరఫరా, అంతరా యాలు తదితరాలను పరిశీలించారు. విద్యుత్‌ అధికారులు, సిబ్బందితో మాట్లాడి విద్యుత్‌ అంతరాయాలకు కారణాలు, తీసుకున్న చర్యలను తెలుసుకున్నారు. డీఈ హుస్సేన్‌నాయక్‌, లైన్‌మన్‌ గబ్బెట సుధాకర్‌ పాల్గొన్నారు.

ఎన్పీడీసీఎల్‌ ఐపీసీ అండ్‌ రాక్‌

సీజీఎంగా తిరుమలరావు

హన్మకొండ: సీజీఆర్‌ఎఫ్‌ వరంగల్‌ ఇన్‌చార్జ్‌ చైర్మన్‌గా కొనసాగుతున్న కె.తిరుమల్‌రావును టీఎస్‌ ఎన్పీడీసీఎల్‌ ఐపీసీ అండ్‌ రాక్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌గా నియమించారు. ఈమేరకు టీఎస్‌ ఎన్పీడీసీఎల్‌ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. బాధ్యతలు స్వీకరించి న తిరుమల్‌రావుకు సీజీఎం (ఆపరేషన్‌) కిషన్‌, జీఎం మల్లికార్జున్‌, డీఈలు బి.సామ్యానాయ క్‌, రాంబాబు, శ్రీధరచారి, ఏడీఈలు కిరణ్‌, మధుకర్‌, అశోక్‌, ఈఈ జనార్దన్‌, అధికారులు, ఆయా సంఘాల నాయకులు పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.

నిబంధనలు అతిక్రమిస్తే  చర్యలు తప్పవు
1/3

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు

నిబంధనలు అతిక్రమిస్తే  చర్యలు తప్పవు
2/3

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు

నిబంధనలు అతిక్రమిస్తే  చర్యలు తప్పవు
3/3

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు

Advertisement
 

తప్పక చదవండి

Advertisement