బోరుబావులే దిక్కు | Sakshi
Sakshi News home page

బోరుబావులే దిక్కు

Published Sat, May 4 2024 9:00 AM

బోరుబ

మా తండాలో భగీరథ పథకం పైపులైన్‌ కనెక్షన్లు ఇవ్వలేదు. ఇంటి అవసరాలకు బోరుబావుల నీళ్లు వాడుతున్నాం. వేరే గ్రామాల్లో భగీరథ నీళ్లు అంటూ సంబరపడుతున్నారు. భగీరథ నీళ్లు ఎట్లుంటాయో మా తండావాసులు ఇప్పటికీ చూడలేదు. అన్ని పార్టీల నాయకులు మా తండా నుంచి వెళ్తుంటారు. కానీ నల్లా నీళ్ల సమస్యను ఏళ్లుగా పరిష్కరించలేదు. ఈ ప్రభుత్వం పట్టించుకోవాలి.

– ధరావత్‌ అమ్మి, కలిగోట తండా

ఎవరూ పట్టించుకునేటోళ్లు లేరు

కోరుట్ల– వేములవాడ రోడ్డు పక్కనే మా తండా ఉంది. పెద్ద ట్యాంక్‌ నిర్మించడానికి, పైపులు వేసేందుకు తండాకు చెందిన 20 గుంటల భూమి ఇచ్చాం. మాకు తాగునీళ్లు వస్తాయని అనుకున్నాం. అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా ఫలితం లేదు. ఇప్పుడైనా నల్లా నీళ్లు సరఫరా చేయాలి. – ధరావత్‌ సీతారాం,

మాజీ వార్డుమెంబర్‌, కలిగోట తండా

ప్రత్యేక ట్యాంక్‌ నిర్మిస్తేనే..

మూడు మండలాలకు నీళ్లు సరఫరా చేసే బ్యాలెన్స్‌ రిజర్వాయర్‌ ట్యాంక్‌ కలిగోట తండాలోనే నిర్మించాం. తండా కోసం ప్రత్యేకంగా ట్యాంక్‌ నిర్మిస్తే అందులో భగీరథ నీళ్లు నింపుతాం. ఆ ట్యాంక్‌ నుంచి ఇంటింటికీ నీరు సరఫరా చేసుకోవచ్చు. రిజర్వాయర్‌ ట్యాంక్‌ నుంచి నేరుగా నల్లా కనెక్షన్లు ఇవ్వరాదు.

– అనిల్‌,

మిషన్‌ భగీరథ గ్రిడ్‌ ఏఈ

బోరుబావులే దిక్కు
1/2

బోరుబావులే దిక్కు

బోరుబావులే దిక్కు
2/2

బోరుబావులే దిక్కు

Advertisement
Advertisement