ఈఏపీసెట్‌ ఫలితాల్లో ఎస్‌ఆర్‌ ప్రభంజనం | Sakshi
Sakshi News home page

ఈఏపీసెట్‌ ఫలితాల్లో ఎస్‌ఆర్‌ ప్రభంజనం

Published Mon, May 20 2024 7:45 AM

ఈఏపీస

విద్యారణ్యపురి: టీఎస్‌ఈఏపీసెట్‌ ఫలితాల్లో ఎస్‌ఆర్‌ విద్యాసంస్థల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని ఆ విద్యాసంస్థల చైర్మన్‌ ఎ వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్‌రెడ్డి,సంతోష్‌రెడ్డి తెలిపారు. ఈఏపీసెట్‌ ఫలితాల్లో కొతమ్‌ మణితేజ ఎంపీసీ విభాగంలో రాష్ట్రస్థాయిలో 9వ ర్యాంకు సాధించారని తెలిపారు. దొంతుల మనీష్‌ ఎంపీసీ విభాగంలో రాష్ట్రస్థాయిలో 24వ ర్యాంకు, టి తేజిస్వి ఎంపీసీ విభాగంలోరాష్ట్రస్థాయిలో 161వర్యాంకు సాధించారని తెలిపారు. మునకాల గణేష్‌ బీపీసీ విభాగంలో రాష్ట్ర స్థాయిలో 199వ ర్యాంకు, కె శ్రీరాంరెడ్డి ఎంపీసీ విభాగంలో 291వ ర్యాంకు సాధించి రాష్ట్రస్థాయిలో ఎస్‌ఆర్‌ విజయపతాకాన్ని ఎగురవేశారని తెలిపారు. అలాగే, చిల్ల హర్షిత 334వ ర్యాంకు, ఆర్‌ దీపాంశరెడ్డి 412వ ర్యాంకు, కె వర్షిణి 494వ ర్యాంకు, ఎస్‌ రాహుల్‌ 546వ ర్యాంకు, జి రాజీవ్‌ 552వ ర్యాంకు, అబుతాల్హా 554వ ర్యాంకు సాధించారని వారు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యావ్యవస్థలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ తమ విద్యార్థులకు సృజనాత్మకతతో కూడిన విద్యనందిస్తున్నామన్నారు. భవిష్యత్‌లో మరిన్ని అత్యుత్తమ ర్యాంకులు సాధించేలా తీర్చిదిద్దుతామని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. 50 సంవత్సరాల్లో పటిష్ట ప్రణాళికతో హైస్కూల్‌, జూనియర్‌ కాలేజీ, ఎంసెట్‌, ఐఐటీల్లో విద్యనందిస్తూ ప్రతి సంవత్సరం, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించారని వివరించారు. ఈ సంవత్సరం జేఈఈ మెయిన్స్‌లోనూ జాతీయ స్థాయిలోఉత్తమ ఫలితాలు సాధించారని తెలిపారు.

ఈఏపీసెట్‌ ఫలితాల్లో ఎస్‌ఆర్‌ ప్రభంజనం
1/7

ఈఏపీసెట్‌ ఫలితాల్లో ఎస్‌ఆర్‌ ప్రభంజనం

ఈఏపీసెట్‌ ఫలితాల్లో ఎస్‌ఆర్‌ ప్రభంజనం
2/7

ఈఏపీసెట్‌ ఫలితాల్లో ఎస్‌ఆర్‌ ప్రభంజనం

ఈఏపీసెట్‌ ఫలితాల్లో ఎస్‌ఆర్‌ ప్రభంజనం
3/7

ఈఏపీసెట్‌ ఫలితాల్లో ఎస్‌ఆర్‌ ప్రభంజనం

ఈఏపీసెట్‌ ఫలితాల్లో ఎస్‌ఆర్‌ ప్రభంజనం
4/7

ఈఏపీసెట్‌ ఫలితాల్లో ఎస్‌ఆర్‌ ప్రభంజనం

ఈఏపీసెట్‌ ఫలితాల్లో ఎస్‌ఆర్‌ ప్రభంజనం
5/7

ఈఏపీసెట్‌ ఫలితాల్లో ఎస్‌ఆర్‌ ప్రభంజనం

ఈఏపీసెట్‌ ఫలితాల్లో ఎస్‌ఆర్‌ ప్రభంజనం
6/7

ఈఏపీసెట్‌ ఫలితాల్లో ఎస్‌ఆర్‌ ప్రభంజనం

ఈఏపీసెట్‌ ఫలితాల్లో ఎస్‌ఆర్‌ ప్రభంజనం
7/7

ఈఏపీసెట్‌ ఫలితాల్లో ఎస్‌ఆర్‌ ప్రభంజనం

Advertisement
 
Advertisement
 
Advertisement