Dr Evita Fernandez: సిజేరియన్లను తగ్గించడమే లక్ష్యం... | Sakshi
Sakshi News home page

Dr Evita Fernandez: సిజేరియన్లను తగ్గించడమే లక్ష్యం...

Published Sat, May 4 2024 6:08 AM

Fernandez Hospital chair person Dr Evita Fernandez talks about Cesarean Delivery

‘‘ప్రసవం స్త్రీకి పునర్జన్మ లాంటిది. ఆ మరుజన్మ ఆమెకు ఎంతో ఆనందకరమైన అనుభూతిగా జీవితాంతం మిగిలి΄ోవాలి. అందుకోసమే నా కృషి’ అన్నారు
హైదరాబాద్‌లోని ఫెర్నాండేజ్‌ హాస్పిటల్స్‌ చెయిర్‌పర్సన్,  ప్రసూతి వైద్యురాలు డాక్టర్‌ ఎవిటా ఫెర్నాండేజ్‌.  ప్రసవ సమయంలో కీలకమైన మంత్రసానుల ఆవశ్యకతను గుర్తించి చేపట్టిన శిక్షణా కార్యక్రమాలతో ΄ాటు  గర్భిణులకు ప్రీ చైల్డ్‌ బర్త్‌ అవేర్‌నెస్‌ క్లాసులను నిర్వహిస్తున్నారు. 

భారతదేశంలో మిడ్‌వైఫరీ వ్యవస్థకు  నాయకత్వం వహిస్తున్న ఈ డాక్టర్‌  2011లో తెలంగాణలో మొట్టమొదటి ్ర΄÷ఫెషనల్‌ మిడ్‌వైఫరీ సర్వీసెస్‌ ్ర΄ారంభించారు. మే5 ‘ఇంటర్నేషనల్‌ మిడ్‌వైఫ్‌ డే..’  ఈ సందర్భాన్ని పురస్కరించుకొని  డాక్టర్‌ ఎవిటాను కలిసినప్పుడు మాతాశిశు సంరక్షణలో 
మంత్రసానుల కీలక ΄ాత్ర, గర్భిణులకు అవగాహన కలిగించే ఎన్నో విషయాలను తెలియజేశారు. 

‘‘సాధారణ ప్రసవాలను ్ర΄ోత్సహించాలి. అవసరం లేని సిజేరియన్స్‌ శాతాన్ని తగ్గించాలి. మాతా, శిశు సంరక్షణే ధ్యేయంగా పనిచేయాలన్నదే మా ప్రధాన ఉద్దేశ్యం. ఈ ఐదేళ్లలో సిజేరియన్ల శాతం బాగా తగ్గించగలిగాం. దీనికి గర్భిణుల్లో అవగాహన కల్పించడానికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నాం.  మహిళలు తమ శరీరం గురించి అర్ధం చేసుకుని, భయాలు తొలగి΄ోయేలా, ప్రసవానికి సంబంధించి వీలైనంత అవగాహన పెంచుకుంటే ఒత్తిడిని తగ్గించుకొని ఎన్నో సమస్యల నుంచి బయటపడవచ్చు. గర్భం దాల్చిన ప్రతి స్త్రీకి ప్రసవం గౌరవప్రదంగా, ఆనందకరమైన అనుభవంగా మారాలి. అందుకు తగిన ప్రణాళికలు ఎప్పుడూ చేస్తుంటాం.

ప్రసూతి సేవలకు వెన్నెముక
మంత్రసాని వ్యవస్థ స్త్రీ చుట్టూ, స్త్రీల కోసం కేంద్రీకృతమైంది. గర్భవతికి మద్దతు, గోప్యత, విశ్వాసం కలిగిస్తుంది. 2007 నాటికి ఏడాదికి 5వేలకు పైగా డెలివరీ చేసేవాళ్లం. ఎంతోమంది గర్భిణులు ముఖ్యంగా చిన్నవయసు వారిలో ప్రసవ సమయంలో వచ్చే సమస్యలు నన్ను బాగా కలిచి వేసేవి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ప్రసూతి మరణాల గురించి చదవడం, తెలుసుకోవడంపై దృష్టి పెట్టాను. అప్పటిదాకా మేం అనుసరించిన ప్రసవ పద్ధతుల్లో మార్పులు అవసరం అని గ్రహించాను. ఈ క్రమంలో ప్రసూతి మరణాల రేటు తక్కువ ఉన్న దేశాలు మిడ్‌వైఫరీ వ్యవస్థను బలోపేతం చేస్తున్నారని తెలిసింది. అయితే, మన దేశంలో ఆ వెసులుబాటు లేదు. ఒకప్పుడు గ్రామాల్లో ఒక అనుభవం ఉన్న మంత్రసాని ఉండేది. తల్లిలా చూసుకునే అనుభవజ్ఞురాలైన మంత్రసాని దేశంలోని అన్ని ఆసుపత్రులలో ఉండటం అత్యవసరం అనిపించింది. దీని ద్వారా ఎక్కువ మంది మహిళలకు అత్యున్నత స్థాయి గల ప్రసూతి సంరక్షణ అవకాశాన్ని కలిగించవచ్చని అనిపించింది. అలాగే, అనవసరమైన సిజేరియన్లు తగ్గించడానికి కూడా ఈ ప్రక్రియ ఎంతగానో దోహపడుతుంది.

తెలంగాణలో..
ఈ ఆలోచన చేసిన వెంటనే వెనకడుగు వేయకుండా 2011లో రెండేళ్ల అంతర్గత ్ర΄÷ఫెషనల్‌ మిడ్‌వైఫరీ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌ (పిఎమ్‌ఇటి) ్ర΄ోగ్రామ్‌ను ్ర΄ారంభించాం. మొదట పైలట్‌ ్ర΄ాజెక్ట్‌ పూర్తి చేశాం. ఆ తర్వాత ప్రభుత్వంతో కలిసి హెల్త్‌కేర్‌ ఎకో సిస్టమ్‌లో మంత్రసానుల ప్రవేశం మొదలైంది. 2018లో ఫెర్నాండేజ్‌ ఫౌండేషన్, తెలంగాణ ప్రభుత్వం, యునిసెఫ్‌ సహకారంతో రాష్ట్ర ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ నుండి నర్సుల కోసం మిడ్‌వైఫరీలో 18 నెలల సర్టిఫికేషన్‌ కార్యక్రమాన్ని ్ర΄ారంభించాం.  మిడ్‌వైఫ్స్‌ కోసం రూ΄÷ందించిన ఈ కోర్సు తెలంగాణలోనే మొట్టమొదటిది. మొదట తెలంగాణలోని పది మారుమూల ఆసుపత్రుల్లో 30 మంది నర్సులకు మిడ్‌వైఫరీలో శిక్షణ ఇవ్వడం, ప్రసూతి సంరక్షణలో గేమ్‌ ఛేంజర్‌గా నిరూపించబడింది. ఇప్పుడు తెలంగాణలో సహజ ప్రసవాల శాతం పెరుగుతుంది. ఈ పని ద్వారా ఎంతో సంతృప్తి కలుగుతుంది.

ఆంధ్రప్రదేశ్‌లో..
ఇటీవలే పీఎమ్‌టీ ్ర΄ోగ్రామ్‌ ఆంధ్రప్రదేశ్‌లోనూ ్ర΄ారంభించాం. యునిసెఫ్, డబ్ల్యూహెచ్‌వో, బర్మింగ్‌హమ్‌ యూనివర్శిటీ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం. మొదటగా తెనాలిలో ఈ ్ర΄ాజెక్ట్‌ పూర్తయ్యింది. తర్వాత  సి–సేఫ్‌ ్ర΄ాజెక్ట్స్‌ జిజిహెచ్‌ రాజమహేంద్రవరం, జిజిహెచ్‌ ఏలూరు, జిజిహెచ్‌ మచిలీపట్నం, డిహెచ్‌ అనకాలపల్లిలో చేయబోతున్నాం.

విస్తరణ వైపుగా... 
నవాబుల కాలంలో హైదరాబాద్‌లో మా అమ్మ నాన్నలు లెస్లీ, లౌర్డెస్‌ ఫెర్నాంyð జ్‌లు రెండు పడకలతో ఫెర్నాండెజ్‌ ఆసుపత్రిని ్ర΄ారంభించారు. ఆ రోజుల్లో మాతా, శిశు మరణాలను చూసి వాటిని అడ్డుకోవాలనే సదాశయంతో ఏర్పాటు చేసిన ఆసుపత్రి ఆ తర్వాత నేను బాధ్యతలు తీసుకునే నాటికి 30 పడకలకు పెరగింది. స్త్రీ వైద్య నిపుణురాలిగా, నిర్వాహకురాలిగా నా బాధ్యతలను విస్తరిస్తూ వస్తున్నాను. ఫలితంగా ఫెర్నాండేజ్‌ హాస్పిటల్స్‌ నేడు 300 పడకల సామర్థ్యంతో మూడు ఆసుపత్రులు, రెండు ఔట్‌ పేషెంట్‌ క్లినిక్‌లు, నర్సింగ్‌ స్కూల్‌కి పెరిగింది. ఈ క్రమంలో వారి ఆశయాన్ని నిలబెట్టడానికి ఎంతో కృషి జరిగింది. మాతా, శిశు సంరక్షణపై దృష్టి సారించి వారి ఆరోగ్య సంరక్షణ, వైద్య విద్య, పరిశోధన వైపుగానూ విస్తరించింది’’ అని వివరించారు. 

– నిర్మలారెడ్డి 
ఫొటోలు: మోర్ల అనీల్‌కుమార్‌
 

Advertisement
Advertisement