తొలిరోజు 579 మంది ఓటేశారు | Sakshi
Sakshi News home page

తొలిరోజు 579 మంది ఓటేశారు

Published Sat, May 4 2024 5:25 AM

తొలిరోజు 579 మంది ఓటేశారు

ఏలూరు (మెట్రో): దేశంలోనే తొలిసారిగా ఇంటి వద్దే ఓటు వేసే అవకాశాన్ని కల్పించిన క్రమంలో ఏలూరు జిల్లాలో శుక్రవారం హోం ఓటింగ్‌ విజయవంతంగా ప్రారంభమైంది. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 85 సంవత్సరాలు పైబడిన వారు, 40 శాతం కన్నా ఎక్కువ వైకల్యం ఉన్న వారికి ఎన్నికల సంఘం హోమ్‌ ఓటింగ్‌ సౌకర్యాన్ని కల్పించింది. దీనిలో భాగంగా తొలిరోజు శుక్రవారం జిల్లాలో 579 మంది హోం ఓటింగ్‌ వినియోగించు కోగా, పోలవరం నియోజకవర్గంలో 90 మంది, ఉంగుటూరులో 113, ఏలూరులో 54, చింతలపూడిలో 63, దెందులూరులో 87, కై కలూరులో 113, నూజివీడులో 59 మంది ఓటు వేశారు. పోలింగ్‌ అధికారులు, వీడియోగ్రాఫర్‌ సమక్షంలో ఓటింగ్‌ ప్రక్రియ జరిగింది.

10 నుంచి శ్రీవారి

సేవా రుసుముల పెంపు

ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయంలో జరిగే నిత్య సేవలలో ముఖ్యమైన మూడు రకాల సేవల రుసుములను పెంచినట్టు ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం రూ.200లుగా ఉన్న సుప్రభాత సేవా టికెట్‌ రుసుము రూ.300లకు, అష్టోత్తర శతనామార్చన టికెట్‌ రుసుము రూ.300 నుంచి రూ.500లకు, దీపారాధన సేవా టికెట్‌ను రూ.10 నుంచి రూ.20లకు పెంచినట్టు చెప్పారు. పెరిగిన ధరలు ఈనెల 10 నుంచి అమలులోకి వస్తాయని, భక్తులు గమనించాలని ఈఓ కోరారు.

10 నుంచి కాలువలకు నీటి విడుదల బంద్‌

ఏలూరు (మెట్రో): గోదావరి డెల్టా పరిధిలోని ప్రధాన కాలువలకు నీటి విడుదలను ఈ నెల 10వ తేదీ నుంచి నిలిపివేస్తున్నట్లు ధవళేశ్వరం, గోదావరి డెల్టా సిస్టం చీఫ్‌ ఇంజనీర్‌ సతీష్‌ కుమార్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గోదావరి తూర్పు, మధ్యమ, పశ్చిమ డెల్టా ప్రధాన కాలువల పరిధిలో సాగు, తాగునీటి అవసరాలకు సరిపడా ఇప్పటికే పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేశామన్నారు. ఈ నెల 10వ తేదీ సాయంత్రం ఆరు గంటల నుంచి కాలువలకు నీటిసరఫరా నిలిపివేయాలని నిర్ణయించామన్నారు.

Advertisement
Advertisement