నగదు, మద్యం స్వాధీనం | Sakshi
Sakshi News home page

నగదు, మద్యం స్వాధీనం

Published Sat, May 4 2024 10:25 AM

నగదు, మద్యం స్వాధీనం

అమలాపురం టౌన్‌: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అక్రమ రవాణాను అడ్డుకునేందుకు నిఘా బృందాలు దాడులు, తనిఖీలు నిర్వహించి మద్యాన్ని స్వాధీనం చేసుకుంటున్నాయి. నగదును సీజ్‌ చేస్తున్నాయి. జిల్లా ఎస్పీ సుసరాపు శ్రీధర్‌, ఏఎస్పీ ఎస్‌.ఖాదర్‌ బాషా ఆధ్వర్యంలో జిల్లాలో గురు, శుక్రవారాల్లో పట్టుబడ్డ మద్యం, నగదు వివరాలను జిల్లా ఎస్పీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

● కాట్రేనికోన మండలం బలుసుతిప్ప గ్రామంలో ప్రజలకు పోలీసు అధికారులు ఎన్నికలపై అవగాహన సదస్సు నిర్వహించారు.

● జిల్లాలో 17 కేసులు నమోదు చేసి 19 మందిని అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 2 నాన్‌ డ్యూటీ పెయిడ్‌ మద్యం సీసాలు, 115 డ్యూటీ పెయిడ్‌ మద్యం సీసాలు, 32.95 లీటర్ల ఇండియన్‌ మేడ్‌ లిక్కర్‌, 64 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. 100 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు.

● మండపేటలో నిఘా బృందాలు చెక్‌ పోస్టులో వాహనాలను తనిఖీ చేసి రూ.2.50 లక్షల నగదును సీజ్‌ చేశారు.

● మండపేట రూరల్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో రూ.90 వేల నగదు సీజ్‌ చేశారు.

● ఉప్పలగుప్తం పోలీసు స్టేషన్‌ పరిఽధిలో ఒక వ్యక్తిని అరెస్ట్‌ చేసి అతని నుంచి 30 డ్యూటీ పెయిడ్‌ మద్యం సీసాలు, 5.4 లీటర్ల ఇండియన్‌ మేడ్‌ లిక్కర్‌ను స్వాధీనం చేసుకున్నారు.

● కాట్రేనికోన పోలీసు స్టేషన్‌ పరిధిలోని బలుసుతిప్ప నిఘా బృందాలు తనిఖీలు చేసి రికార్డులు సరిగా లేని 20 మోటారు సైకిళ్లు, ఒక ఆటో సీజ్‌ చేశారు.

● తాళ్లరేవు మండలంలో పోలీస్‌ ఎన్నికల పరిశీలకుడు ఎంవీ చంద్రకాంత్‌, ద్రాక్షారామ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఎన్నికల పరిశీలకుడు పరదీప్‌కుమార్‌ సమస్మాత్మక పోలింగ్‌ కేంద్రాలను తనిఖీ చేశారు.

● ద్రాక్షారామ పోలీసు స్టేషన్‌ పరధిలో వెంకటాయపాలెం, బాపనయ్య చెరువు, పామర్రు పోలీసు స్టేషన్‌ పరిధిలో పేకేరు, తాళ్లపోడు, బట్లపాలిక గ్రామాల్లోని సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల ప్రాంతాల్లో పోలీసు అధికారులు కేంద్ర బలగాలతో కలిసి శుక్రవారం సాయంత్రం కవాతు నిర్వహించారు.

Advertisement
 
Advertisement