విశ్వ బ్రాహ్మణులు, స్వర్ణకారుల సంక్షేమానికి పెద్ద పీట | Sakshi
Sakshi News home page

విశ్వ బ్రాహ్మణులు, స్వర్ణకారుల సంక్షేమానికి పెద్ద పీట

Published Sat, May 4 2024 10:15 AM

విశ్వ బ్రాహ్మణులు, స్వర్ణకారుల సంక్షేమానికి పెద్ద పీట

అమలాపురం టౌన్‌: విశ్వ బ్రాహ్మణులు, స్వర్ణకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేసి వారి అభ్యున్నతికి పాటు పడుతోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి పినిపే విశ్వరూప్‌ అన్నారు. అమలాపురంలోని విశ్వ బ్రాహ్మణ కమ్యూనిటీ హాలులో పట్టణ విశ్వ బ్రాహ్మణ, స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటైన సభలో మంత్రి విశ్వరూప్‌ ముఖ్య అతిథిగా ప్రసంగించారు. రాష్ట్ర సంఘం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కట్టోజు సన్నయ్యదాసు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం తొలుత తమ సంఘం భవనం పై అంతస్తు నిర్మాణానికి మంత్రి విశ్వరూప్‌ రూ.10 లక్షలు నిధులు విడుదల చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపింది. జగన్‌ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే దిశగా, మంత్రి విశ్వరూప్‌ మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి మళ్లీ రాష్ట్ర మంత్రి అయ్యేలా పట్టణంలోని విశ్వ బ్రాహ్మణులు, స్వర్ణకారులు కృషి చేస్తామని సమావేశంలో పాల్గొన్న సంఘ ప్రతినిధులు తమ ప్రసంగాల్లో స్పష్టం చేశారు. మరో అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్‌ మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వంలో విశ్వ బ్రాహ్మణులకు జరిగిన లబ్ధిని వివరించారు. సమావేశంలో సంఘం రాష్ట్ర, జిల్లా, పట్టణ ప్రతినిధులు ర్యాలి రాజశేఖర్‌, దార్ల పాపయ్యాచారి, భరణకాన బాబు, తాళాబత్తుల లక్ష్మణరావు, కట్జోజు రాము ప్రసంగించారు.

మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రెడ్డి సత్య నాగేంద్రమణి, వైస్‌ చైర్మన్‌ రుద్రరాజు నానిరాజు, పార్టీ బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర, జిల్లా వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ షేక్‌ అబ్దుల్‌ ఖాదర్‌, కౌన్సిలర్లు గొవ్వాల రాజేష్‌, చిట్టూరి పెదబాబు, దొమ్మేటి రాము, కౌన్సిల్‌ కో ఆప్షన్‌ సభ్యుడు వంకాయల కాశి, మద్దింశెట్టి ప్రసాద్‌ పాల్గొన్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement