10 నుంచి పంట కాలువలకు నీటి సరఫరా నిలిపివేత | Sakshi
Sakshi News home page

10 నుంచి పంట కాలువలకు నీటి సరఫరా నిలిపివేత

Published Sat, May 4 2024 10:15 AM

10 ను

అమలాపురం రూరల్‌: గోదావరి డెల్టా పరిధిలో గల పంట కాలువలకు రబీ సీజన్‌ 2023–24కు సంబంధించి సాగునీటి సరఫరా ఈ నెల 10వ తేదీ సాయంత్రం 6.00 గంటలకు నిలుపుదల చేస్తామని గోదావరి డెల్టా సిస్టం ధవళేశ్వరం చీఫ్‌ ఇంజినీర్‌ సతీష్‌కుమార్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా ప్రధాన కాలువల పరిధిలో గల వరిపంట, తాగునీటి అవసరాలు చివరి స్థాయికి చేరుకున్నందున పంట కాలువలకు నీటి సరఫరా నిలిపివేస్తునట్లు తెలిపారు. ఈ వారం రోజులలో కాలువల పరివాహ ప్రాంతాలలో ఉన్న గ్రామాలకు చెందిన వారు వేసవి రక్షిత సమ్మర్‌ స్టోరేజ్‌ చెరువులను పూర్తి స్థాయిలో నింపుకోవాలని ఆయన ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

పవన్‌, చంద్రబాబు

నట్టేట ముంచేస్తారు

అబద్ధాలు చంద్రబాబుకు అలవాటే..

పవన్‌ను పిఠాపురంలో ఓడించాలి

ముద్రగడ పిలుపు

పిఠాపురం: పవన్‌ను, చంద్రబాబును నమ్మితే నట్టేట ముంచేస్తారని మాజీ మంత్రి వైఎస్సార్‌ సీపీ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. పిఠాపురంలో ఎన్నికల ప్రచారంపై వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత, ఎమ్మెల్యే పెండెం దొరబాబుతో శుక్రవారం ఆయన చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తప్పుడు హామీలతో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి సభ్యులు వస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఎన్నికలయ్యేంత వరకే చంద్రబాబు జిమ్మిక్కుల మేనిఫెస్టో ఉంటుందని, ఎన్నికలయ్యాక దానిని మూసివేస్తారని చెప్పారు. సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ ప్రజలను మోసం చేసే మేనిఫెస్టోతో, ఊకదంపుడు ప్రసంగాలతో ప్రజలను మోసం చేయడానికి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అధికా రం కోసం అబద్ధాలు చెప్పడం చంద్రబాబుకు అలవాటేనన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా గడచిన ఐదేళ్లలో సీఎం వైఎస్‌ జగన్‌ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని గుర్తు చేశారు. పిఠాపురంలో పవన్‌ కల్యాణ్‌ను ఓడించాలని ముద్రగడ పిలుపునిచ్చారు. ఎంత మంది సినీ నటులు ప్రచారం చేసినా పిఠాపురం ప్రజలు ఇచ్చే తీర్పు మాత్రం వైఎస్సార్‌ సీపీకేనని స్పష్టం చేశారు. వైఎస్సార్‌ సీపీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాయకులకు, కార్యకర్తలకు ముద్రగడ పిలుపునిచ్చారు. వంగా గీత, ఎమ్మెల్యే పెండెం దొరబాబు మాట్లాడుతూ, పిఠాపురంలో వైఎస్సార్‌ సీపీ విజయం ఖాయమని అన్నారు. ప్రజలందరు వైఎస్సార్‌ సీపీనే కోరుకుంటున్నారన్నారు. ముద్రగడ నీతి నిజాయితీ కలిగిన నాయకుడని, ఆయన పదవుల కోసం పార్టీలోకి రాలేదని చెప్పారు. రెండు నెలలుగా పిఠాపురంలో వంగా గీత విజయం కోసం ముద్రగడ పూర్తి స్థాయిలో పని చేస్తున్నారన్నారు.

10 నుంచి పంట కాలువలకు                 నీటి సరఫరా నిలిపి
1/1

10 నుంచి పంట కాలువలకు నీటి సరఫరా నిలిపి

Advertisement
Advertisement