సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ ఆత్మహత్య

Published Sat, May 4 2024 5:25 AM

సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ ఆత్మహత్య

పలమనేరు : సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం పలమనేరులో వెలుగుచూసింది. వివరాలు.. బంగారుపాళెం మండలం మిట్టూరు పంచాయతీ పామిరివాండ్లపల్లెకు చెందిన సురేష్‌(40) మణిపూర్‌లోని ఇంఫాల్‌లో సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌గా విధులు నిర్వహిస్తునానరు. ఏప్రిల్‌ 26వ తేదీన గ్రామంలో తన మరదలి పెళ్లికి వచ్చారు. ఈనెల 1వ తేదీన మళ్లీ ఇంఫాల్‌కు బయలుదేరారు. తాను బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నానని విమానం మిస్‌ అయిందని ఇక్కడే ఉండి వెళతానని కుటుంబీకులకు సమాచారం ఇచ్చాడు. అయితే ఒకటో తేదిన పలమనేరు పట్టణంలోని గుండుబావి సమీపంలో ఉన్న ఓ లాడ్జిలో ఉన్నాడు. శుక్రవారం మధ్యాహ్నం లాడ్జిలో సిబ్బంది పిలిచానా తలుపు తీయలేదు. దీంతో అనుమానం వచ్చిన సిబ్బంది వేరే తాళంతో తలుపు తెరిచి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ సురేష్‌ మృతదేహం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు మృతదేహాన్ని స్థాని ప్రభుత్వాస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. మృతుడికి భార్య, ఓ కుమార్తె ఉన్నట్టు తెలిసింది. ఆత్మహత్యకు గల కారణాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.

భర్త వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు

రొంపిచెర్ల: అనుమానంలో తన భర్త వేధిస్తున్నాడంటూ భార్య శుక్రవారం రొంపిచెర్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు.. స్థానిక పాళ్యెంవీధికి చెందిన ఎస్‌.సబీహాకు 15 ఏళ్ల క్రితం చిత్తూరు రామనగర్‌కాలనీకి ఎస్‌.బషీర్‌తో వివాహమైంది. వీరి కాపురం కొన్నేళ్లపాటు సజావుగా సాగింది. ఇద్దరు కుమారులు జన్మించారు. అయితే నాలుగేళ్ల క్రితం భార్యపై అనుమానంతో బషీర్‌ ఆమైపె చేయి చేసుకున్నాడు. దీంతో ఆమె తన పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లింది. తర్వాత ఈ ఏడాది జనవరిలో పెద్ద మనుషులు ఇరువురికీ రాజీ కుదిర్చారు. అయితే బషీర్‌లో ఎలాంటి మార్పు రాలేదు. భార్యను నిత్యం అనుమానిస్తూ వేధించడం ప్రారంభించాడు. దీంతో ఆమె 15 రోజుల క్రితం పుట్టింటికి వచ్చేసింది. ఈ క్రమంలో శుక్రవారం సబీహ భర్త బషీర్‌, ఆడపడుచులు షాహీనా, షబీనా, భర్త స్నేహితుడు కానిస్టేబుల్‌ నాగరాజా వచ్చి ఆమైపె దాడి చేసి గాయపరిచారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ సుకుమార్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement