సమాచారం | Sakshi
Sakshi News home page

సమాచారం

Published Sat, May 4 2024 5:25 AM

సమాచా

చిత్తూరు జిల్లాలో

నిర్మాణం చేపట్టిన ఇళ్లు : 69,921

పూర్తయినవి : 44,445

వెచ్చించిన మొత్తం : రూ.948.77 కోట్లు

తిరుపతి జిల్లాలో నిర్మాణం

చేపట్టిన గృహాలు : 68,956

పూర్తయినవి : 21,596

ఖర్చుపెట్టిన మొత్తం : రూ.696.92 కోట్లు

ప్రభుత్వ ప్రోత్సాహంతోనే..

ప్రస్తుత ప్రభుత్వ ప్రోత్సాహంతోనే ఇల్లు పూర్తి చేసుకోగలిగా. అధికారులే దగ్గరుండి ఇసుక, ఇతర సామగ్రిని తక్కువ ధరలకు ఇప్పించారు. ఇంటి పట్టా ఇచ్చినప్పటి నుంచి ఇంటి నిర్మాణం పూర్తయ్యే వరకు మాకు అండగా నిలిచారు. ఈ ప్రభుత్వంలో సొంతింటి కల నెరవేరినందుకు ఎంతో సంతోషంగా ఉంది. గతంలో ఎలాంటి స్థిరాస్తి లేని నాకు ప్రస్తుతం రూ.10 లక్షల ఆస్తి ఉందంటే కారణం ఈ ప్రభుత్వమే.

– చంద్రలేఖ, వడమాలపేట మండలం

వీళ్లకు కళ్లు కనబడలేదా

గతంలో ఏ నాయకుడు మా సమస్యలను పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం వచ్చాకే మాకు మేలు జరిగింది. నా భర్త మేసీ్త్ర. అందరికీ ఇళ్లు కట్టిస్తావు మనకంటూ సొంతిల్లు ఎప్పుడు కట్టుకునేది అని ఇబ్బంది పెట్టేదాన్ని. స్థలం కొందామంటే అంత స్తోమత మాకు లేదు. ఈ ప్రభుత్వమే సొంత స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సహాయం చేసింది. గత ప్రభుత్వంలో చాలా ఏళ్లు ఇంటి స్థలం కోసమే కాళ్లు అరిగేలా తిరగాం. ప్రస్తుత ప్రభుత్వంలో పట్టా చేతికందింది. ఇల్లు కంటి ముందు కనిపిస్తోంది. తప్పులు చెప్పే వారికి కళ్లు కనబడలేదా.

– ఈశ్వరి, పుత్తూరు మండలం

సమాచారం
1/1

సమాచారం

Advertisement
 

తప్పక చదవండి

Advertisement