పార్లమెంట్‌లో గళం వినిపిస్తా.. | Sakshi
Sakshi News home page

పార్లమెంట్‌లో గళం వినిపిస్తా..

Published Sat, May 4 2024 3:10 AM

పార్లమెంట్‌లో గళం వినిపిస్తా..

● కాంగ్రెస్‌వి మోసపూరిత వాగ్దానాలు ● బీఆర్‌ఎస్‌తోనే అన్ని విధాలా అభివృద్ధి ● ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామ

పాల్వంచ/దమ్మపేట/అశ్వారావుపేటరూరల్‌: వచ్చే ఎన్నికల్లో తనను గెలిపిస్తే పార్లమెంట్‌లో ప్రజల తరఫున గళం వినిపిస్తానని బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నామ నాగేశ్వరరావు అన్నారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్రతో కలిసి శుక్రవారం ఆయన పాల్వంచ, దమ్మపేట, అశ్వారావుపేటలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మోసపూరిత వాగ్దానాలతోనే అధికారంలోకి వచ్చిందని, ఆరు గ్యారంటీల పేరుతో ప్రకటించిన మహాలక్ష్మి, రుణమాఫీ, రైతుబంధు పెంపు, తులం బంగారం తదితర పథకాల అమలులో విఫలమైందని విమర్శించారు. కేసీఆర్‌ పదేళ్లలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమం దిశగా పరిపాలన కొనసాగించారని చెప్పారు. ధాన్యం కొనుగోలుపై పార్లమెంట్‌లో కేంద్రాన్ని తాను నిలదీస్తుంటే బీజేపీ, కాంగ్రెస్‌ ఎంపీలు మాట కూడా మాట్లాడకుండా ఉండిపోయారని ఆరోపించారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. రైతులకు సాగునీరు అందించడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పటికే విఫలమైందని విమర్శించారు. సీఎంతో పాటు మంత్రులు అమలు చేయలేని హామీలు గుప్పిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. రైతు భరోసా, పెన్షన్‌, మహిళలకు నెలకు రూ.2,500, తులం బంగారం ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో ఓటడిగే హక్కు లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి నామ నాగేశ్వరరావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడగా అశ్వారావుపేట ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, నాయకులు ఉప్పల వెంకటరమణ, కిలారు నాగేశ్వరరావు, మంతపురి రాజుగౌడ్‌, మల్లెల శ్రీరాంమూర్తి, మల్లెల రవిచంద్ర, పర్వతనేని రామకృష్ణ, వగ్గెల పూజ, సున్నం నాగమణి, భూక్యా ప్రసాద్‌, రావు జోగేశ్వరరావు, దారా యుగఽంధర్‌, దొడ్డాకుల రాజేశ్వరరావు, దొడ్డా రమేష్‌, అబ్దుల్‌ జిన్నా, బత్తుల మధుచంద్‌, దాసరి నాగేశ్వరరావు, కాల్వ ప్రకాశ్‌, చందు నాయక్‌, సింధు తపస్వీ, మంజుల, కొత్వాల సత్యనారాయణ, ముత్యాల ప్రవీణ్‌, ముత్యాల రమణమూర్తి, పరిటాల సుబ్బారావు, వీరన్న, మందపాటి మోహన్‌రెడ్డి, బిర్రం వెంకటేశ్వరరావు, జేకేవీ రమణారావు, సంపూర్ణ పాల్గొన్నారు. ఆనంద్‌, నామా నవీన్‌ పాల్గొన్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement