స్వర్ణకవచాలంకరణలో రామయ్య | Sakshi
Sakshi News home page

స్వర్ణకవచాలంకరణలో రామయ్య

Published Sat, May 4 2024 3:10 AM

స్వర్

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి మూలమూర్తులు శుక్రవారం స్వర్ణ కవచాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, శుక్రవారాన్ని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు.

పెద్దమ్మతల్లికి వైభవంగా పంచామృతాభిషేకం

పాల్వంచరూరల్‌: మండల పరిధిలోని కేశవాపు రం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి శుక్రవారం పంచామృతాలతో వైభవంగా అభిషేకం నిర్వహించారు. మొదట అమ్మవారి జన్మస్థలం వద్ద పసుపు, కుంకుమ, గాజులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆ తర్వాత పంచామృతాభిషేకం గావించి హారతి ఇచ్చారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్‌కు పంచామృతాలతో అభిషేకం, పంచహారతులు, నివేదన, నీరా జన మంత్రపుష్పం నిర్వహించారు. ఆ తర్వాత కుంకుమపూజ, గణపతి హోమం చేశారు. ఆయా కార్యక్రమాల్లో అర్చకులు, వేద పండితులతో పాటు ఈఓ సుదర్శన్‌ పాల్గొన్నారు.

ఫిజియోథెరపీ సేవలు వినియోగించుకోండి

కొత్తగూడెంఅర్బన్‌: వేసవి సెలవుల్లో ఫిజియోథెరపీ సేవలు సద్వినియోగం చేసుకోవాలని డీఈ ఓ ఎం.వెంకటేశ్వరాచారి తెలిపారు. శుక్రవారం తన కార్యాలయంలో ఫిజియోథెరపిస్ట్‌లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. 18 ఏళ్ల లోపు దివ్యాంగులకు ప్రత్యేక సేవలు అందించేందుకు ఫిజియోథెరపీ డాక్టర్లు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అన్ని మండల కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలలో ప్రతీ వారం ఈ సేవలు అందుతాయని, పిల్లల తల్లిదండ్రులు గమనించాల ని కోరారు. సమావేశంలో సమ్మిళిత విద్య కో ఆర్డినేటర్‌ ఎస్‌కే సైదులు, ఫిజియోథెరపిస్ట్‌లు కనక నాగు, కిషోర్‌బాబు, వసీమ్‌, ప్రభాకర్‌రావు, శ్రీనివాసరావు, జ్యోతి, శ్రీదేవి పాల్గొన్నారు.

5,044 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): జిల్లాలో యాసంగి సీజన్‌ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు 775 మంది రైతుల వద్ద రూ.11.02 కోట్ల విలువైన 5,044.640 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు పౌరసరఫరాల శాఖ మేనేజర్‌ త్రినాథ్‌బాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో 99, జీసీసీ ద్వారా 27, డీఆర్‌డీఏ నుంచి 10.. మొత్తం 136 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు వివరించారు. ఆయా కేంద్రాలలో మౌలిక సౌకర్యాలు కల్పించామని, రైతులు దళారుల ప్రలోభాలకు గురికాకుండా ప్రభుత్వ మద్ధతు ధరకు కొనుకోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించారు. 17 శాతం కంటే ఎక్కువ తేమ ఉండకుండా చూడాలని కోరారు.

స్వర్ణకవచాలంకరణలో రామయ్య
1/2

స్వర్ణకవచాలంకరణలో రామయ్య

స్వర్ణకవచాలంకరణలో రామయ్య
2/2

స్వర్ణకవచాలంకరణలో రామయ్య

Advertisement
 

తప్పక చదవండి

Advertisement