Today Telugu Horoscope On May 1st, 2024: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి నూతన ఉద్యోగాలు దక్కుతాయి

Published Wed, May 1 2024 6:49 AM

Daily Horoscope: Rasi Phalalu On April 01-05-2024 Telugu

శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: బ.అష్టమి రా.12.58 వరకు, తదుపరి నవమి, నక్షత్రం: శ్రవణం రా.12.31 వరకు, తదుపరి ధనిష్ఠ, వర్జ్యం: తె.4.18 నుండి 5.46 వరకు (తెల్లవారితే గురువారం), దుర్ముహూర్తం: ఉ.11.32 నుండి 12.20 వరకు, అమృత ఘడియలు: ప.2.03 నుండి 4.12 వరకు; రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు, యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు, సూర్యోదయం: 5.39, సూర్యాస్తమయం: 6.14. 

మేషం: పనులు విజయవంతంగా సాగుతాయి. ఆర్థిక ప్రగతి ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

వృషభం: దూరప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. అనుకోని ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో చికాకులు.

మిథునం: పనులలో ఆటంకాలు.  వ్యయప్రయాసలు. బం«ధువులతో అకారణంగా తగాదాలు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు ఉంటాయి.

కర్కాటకం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

సింహం: నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖుల సలహాలు స్వీకరిస్తారు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు అందుతాయి. పనుల్లో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.

కన్య: పనులు ముందుకు సాగవు. ఆర్ధిక ఇబ్బందులు. శ్రమాధిక్యం. బంధువులు, మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో చిక్కులు ఎదురవుతాయి.

తుల: బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనుల్లో అవాంతరాలు. అనారోగ్యం. శ్రమ తప్పదు. వ్యాపారాలు అంతగా లాభించవు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు. విద్యార్థుల యత్నాలు ముందుకు సాగవు.

వృశ్చికం: పనులు అనుకున్న విధంగా సాగుతాయి. ప్రముఖుల పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

ధనుస్సు: వ్యవహారాలలో ప్రతిబంధకాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. మిత్రులతో కలహాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. అనారోగ్య సూచనలు.

మకరం: మిత్రుల నుంచి ముఖ్య సమాచారం. విందువినోదాలు. పనులు సజావుగా సాగుతాయి. బంధువుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు.

కుంభం: రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో సమస్యలు. అనారోగ్యం. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు సంభవం.

మీనం: వ్యవహారాలలో పురోగతి. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు. ముఖ్య విషయాలు తెలుసుకుంటారు. భూలాభాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు రావచ్చు.

Advertisement
Advertisement