7న ఊటీకి సమ్మర్‌ స్పెషల్‌ బస్సు | Sakshi
Sakshi News home page

7న ఊటీకి సమ్మర్‌ స్పెషల్‌ బస్సు

Published Sat, May 4 2024 9:35 AM

7న ఊటీకి  సమ్మర్‌ స్పెషల్‌ బస్సు

మదనపల్లె సిటీ: వేసవి సెలవులను పురస్కరించుకుని ఈనెల 7న ప్రముఖ పర్యాటక కేంద్రమైన ఊటీకి సూపర్‌ లగ్జరి ప్రత్యేక బస్సు సర్వీసు నడపనున్నట్లు ఆర్టీసీ–1 డిపో మేనేజర్‌ మూరే వెంకటరమణారెడ్డి తెలిపారు. 7న రాత్రి మదనపల్లె డిపో నుంచి బయలుదేరి 8న ఉదయం ఊటీకి చేరుకుంటుందన్నారు. ఊటీ, కున్నూరు హిల్‌స్టేషన్‌, మైసూర్‌ చూసుకుని 10న ఉదయం మదనపల్లెకు చేరుకుంటుందన్నారు. రాను,ఫోను చార్జీ రూ.2800 చెల్లించాలన్నారు. ఫోన్‌ నంబర్లు 9346772487, 9441152934ను సంప్రదించాలని సూచించారు.

మద్యం షాపుల ఆకస్మిక తనిఖీ

కురబలకోట: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అన్నమయ్య జిల్లా ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ ఎం. వినయ్‌బాబు శుక్రవారం కడప క్రాస్‌, అంగళ్లు, ములకలచెరువు మండలంలోని పెద్దపాళ్యంలోని ప్రభుత్వ మద్యం దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మద్యం స్టాకును, రికార్డులను పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఈ మద్యం దుకాణాలు సెన్సిటివ్‌ షాపుల కింద ఉండడంతో ఎన్నికల నేపధ్యంలో అవకతవకలకు పాల్పడకుండా ఆకస్మిక సూపర్‌వైజర్లు, సేల్స్‌మెన్లు నిబంధనలకు లోబడి మద్యం దుకాణాలు నిర్వహించాలన్నారు. అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మదనపల్లె ఎకై ్సజ్‌ ఎస్‌ఐ జయనరసింహ పాల్గొన్నారు.

స్మార్ట్‌బైక్‌ రూపొందించిన విద్యార్థులు

మదనపల్లె సిటీ: అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని ఆదిత్య ఇంజినీరింగ్‌ కాలేజీ విద్యార్థుఽలు స్మార్ట్‌ బైక్‌ తయారుచేశారు. బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న బి.లేపాక్షి, పి.నాగేశ్వరరెడ్డి, సాయికుమార్‌రెడ్డి, ఎం.శ్రీకాంత్‌, రాఘవేంద్ర కలిసి ఈ బైక్‌ తయారు చేశారు. ప్రాజెక్టు గైడ్‌ ప్రవీణ సహాయ,సహకారాలు అందించారు.ఈ బైక్‌ తయారీలో గేరింగ్‌ సిస్టం, బ్లూటూత్‌ డిజిటల్‌ డిస్‌ప్లే, జీపీఎస్‌ ట్రాకర్‌, సోలార్‌ సిస్టంను ఉపయోగించారు. ఈ స్మార్ట్‌ బైక్‌ను ఒకసారి చార్జ్‌ చేస్తే 60 కిలోమీటర్ల నుంచి 80 కిలో మీటర్ల వరకు మైలేజీ వస్తుందని, చార్జింగ్‌కి 4 గంటల సమయం పడుతుందని విద్యార్థులు వివరించారు. కాలేజీ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌.రామలింగారెడ్డి, ప్రిన్సిపాల్‌ సతీష్‌బాబు, ఈఈఈ హెడ్‌ వేణుగోపాల్‌రెడ్డి, అధ్యాపకులు తదితరులు శుక్రవారం ఈ బైక్‌ను ప్రదర్శించారు.

Advertisement
Advertisement