మాకవరపాలెంలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ | Sakshi
Sakshi News home page

మాకవరపాలెంలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ

Published Sat, May 4 2024 10:05 AM

మాకవరపాలెంలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ

నర్సీపట్నం: తెలుగుదేశం పార్టీకి మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికలకు కొద్ది రోజులే ఉన్నప్పటికీ వైఎస్సార్‌సీపీలోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. మాకవరపాలెం మండలం రాచపల్లి శివారు కొత్తపాలెం, పాపయ్యపాలెం గ్రామాల నుంచి వంద కుటుంబాల వారు వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరంతా శుక్రవారం పార్టీ సీనియర్‌ నేత రుత్తల యర్రాపాత్రుడుతో కలసి వైఎస్సార్‌పీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్‌గణేష్‌ తన క్యాంపు కార్యాలయంలో పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల ముందు టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరడం శుభ సూచికమన్నారు. పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఎంపీపీ రుత్తల సత్యనారాయణ, పార్టీ మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌, నర్సీపట్నం మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ సన్యాసిపాత్రుడు, డీసీసీబీ మాజీ డైరెక్టర్‌ భద్రాచలం, యూత్‌ అధ్యక్షుడు పిల్లా శ్రీను, సేవాదళ్‌ అధ్యక్షుడు ఇటంశెట్టి శ్రీను, రాచపల్లి, పాపయ్యపాలెం పార్టీల నేతలు పెట్ల దొరబాబు, యర్రా లోవ, పైల సత్తిబాబు, రుత్తల నాయుడు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీలోకి 100 కుటుంబాలు చేరిక

Advertisement
Advertisement