ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రత్యేక చర్యలు | Sakshi
Sakshi News home page

ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రత్యేక చర్యలు

Published Sat, May 4 2024 9:50 AM

ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రత్యేక చర్యలు

చింతూరు: ఈనెల 13న జరగనున్న ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా జరిగేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు చింతూరు సీఐ గజేంద్రకుమార్‌ చెప్పారు. మండల కేంద్రంలో శుక్రవారం పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు సంయుక్తంగా కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ గజేంద్రకుమార్‌ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఎటువంటి ప్రలోభాలకు తలొగ్గకుండా ఓటు వేయాలని సూచించారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రశాతంగా ఎన్నికలు జరిగేలా అన్ని రాజకీయ పార్టీలు కృషి చేయాలన్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టినా, ఘర్షణలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. సీఆర్పీఎఫ్‌ బెటాలియన్‌–1 డీఎస్పీ హంసరాజ్‌, 42–బెటాలియన్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ దివాకర్‌, చింతూరు ఎస్‌ఐ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement