అదనంగా పెంచిన ఫీజు అమలుకు చరమ‘గీతం’ | Sakshi
Sakshi News home page

అదనంగా పెంచిన ఫీజు అమలుకు చరమ‘గీతం’

Published Sat, May 4 2024 9:50 AM

అదనంగా పెంచిన ఫీజు అమలుకు చరమ‘గీతం’

కొమ్మాది : రుషికొండలో ఉన్న గీతం డీమ్డ్‌ వర్సిటీలో బీటెక్‌, డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న విద్యార్థులు 40% అదనంగా ఫీజు చెల్లించాలని యాజమాన్యం తెలపడంతో గురువారం విద్యార్థులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఇక్కడ బీటెక్‌, డిగ్రీలలో నిర్వహించే సెమ్‌లలో 40 శాతం మార్కులు వస్తే ఉత్తీర్ణత సాధించినట్లు నిర్థారిస్తారు. అయితే ఉత్తీర్ణత సాధించిన వారకి ఫైనల్‌గా మరో 40 శాతం అదనంగా ఫీజు కట్టాలని, కొత్తగా ఓ వెబ్‌సైట్‌ తీసుకుని వచ్చామని, దాని నిమిత్తం ఈ అధిక మొత్తాన్ని చెల్లించాలని యాజమాన్యం తెలిపినట్లు విద్యార్థులు తెలిపారు. ఇది ఎన్నికల ఫండ్స్‌ కోసం ఇలా చేస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. దీనిపై శుక్రవారం ‘సాక్షి’లో గీతం విద్యార్థుల ఆందోళన అనే శీర్షికతో వార్త ప్రచురణ కావడం, విషయం బయటకు తెలియడంతో చేసేదేమి లేక 40 శాతం అదనపు ఫీజు చెల్లించాలనే విషయాన్ని ఉపసంహరించుకున్నట్లు విద్యార్థులు తెలిపారు. కాగా, వాస్తవానికి ఒక సెమ్‌ ఫీజు రూ.6 వేలు ఉండగా, రూ.10 వేలు చెల్లించాలని గురువారం గీతం యాజమాన్యం విద్యార్థులపై ఒత్తిడి తెచ్చింది. అయితే విద్యార్థులు ఆందోళనతో ప్రస్తుతానికి 40 శాతం సెమ్‌ ఫీజు ఆలోచన విరమించుకున్నప్పటికీ ఎన్నికల తరువాత తిరిగి పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

Advertisement
Advertisement