వైఎస్సార్‌సీపీతో ముస్లింల బంధం విడదీయరానిది | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీతో ముస్లింల బంధం విడదీయరానిది

Published Sat, May 4 2024 9:50 AM

వైఎస్

ఎంవీపీకాలనీ: ౖవెఎస్సార్‌సీపీతో ముస్లింలది విడదీయరాని బంధమని రాజ్యసభ సభ్యుడు, పార్టీ రీజినల్‌ కో ఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. వెంకోజిపాలెం సీఎంఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో శుక్రవారం రాత్రి ముస్లింల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్లు తీసుకొచ్చిన ఘనత దివంగత వైఎస్సార్‌కు దక్కుతుందన్నారు. ఆయన అడుగుజాడల్లోనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముస్లింల సంక్షేమానికివిశేష కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ముస్లింల రాజకీయ ప్రాధాన్యం పెంచేందుకు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే గత ఎన్నికల కంటే ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ముస్లింలకు ఎక్కువ అసెంబ్లీ సీట్లు కేటాయించినట్లు చెప్పారు. 2019లో 5 కేటాయిస్తే, 2024లో ఆ సంఖ్యను 7కు పెంచారన్నారు. ముస్లింలకు అన్ని రకాల సంక్షేమ పథకాలను జగన్‌ ప్రభుత్వం అందిస్తోందన్నారు. ఈ మేలును గుర్తుంచుకుని ఎన్నికల్లో ముస్లింలంతా వైఎస్సార్‌సీపీకి అండగా నిలవాలని కోరారు.

వైఎస్సార్‌సీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి సీఎం వైఎస్‌ జగన్‌ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారన్నారు. మానవీయత, నిజాయితీ, నిస్వార్థానికి ప్రతీకగా నిలిచే ముస్లింలు రాష్ట్రానికి, ప్రజలకు మంచి చేస్తున్న జగన్‌ ప్రభుత్వానికి అండగా నిలిచి, ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి అఖండ విజయాన్నందించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ సెల్‌ అధ్యక్షుడు ఫరూఖీ, వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ సనపల చంద్రమౌళి, బోణి శివరామకృష్ణ, 53వ వార్డు కార్పొరేటర్‌ బర్కత్‌ అలీ, ఎ.షరీఫ్‌, అటవీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ గుజ్జు వెంకటరెడ్డి, పలువురు ముస్లిం నాయకులు, వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.

వారి ఆకాంక్షలు నెరవేరుస్తాం

ఆత్మీయ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి

వైఎస్సార్‌సీపీతో ముస్లింల బంధం విడదీయరానిది
1/1

వైఎస్సార్‌సీపీతో ముస్లింల బంధం విడదీయరానిది

Advertisement
Advertisement