న్యూస్‌రీల్‌ | Sakshi
Sakshi News home page

న్యూస్‌రీల్‌

Published Sat, May 4 2024 10:10 AM

-

డిగ్రీ పరీక్షలు వాయిదా వేయాలి

ఆదిలాబాద్‌రూరల్‌: ఈనెల 6 నుంచి నిర్వహించనున్న డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా వేయాలని తెలంగాణ మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు మల్లెల మనోజ్‌ ప్రకటనలో కోరారు. జిల్లాలో ప్రస్తుతం గరిష్ట ఉష్ణోగ్రతలు సుమారు 46 డిగ్రీలకు చేరువైనట్లు పేర్కొన్నారు. ఈ మేరకు విద్యార్థులు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ పరీక్షలను వాయిదా వేసి జూన్‌లో నిర్వహించాలని కోరారు.

పోలింగ్‌ సమయం గంట పెంపు

కై లాస్‌నగర్‌: ఈనెల 13న నిర్వహించనున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో పొలింగ్‌ సమయాన్ని ఒక గంట పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జా రీ చేసినట్లు ఎన్నికల అధికారి రాజర్షి షా తెలిపారు. ప్రతి సాధారణ ఎన్నికల్లో పోలింగ్‌ సమయం ఉదయం 7నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉండగా, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున పోలింగ్‌ సమయాన్ని ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. పోలింగ్‌ సమయం పెంపుతో పోలింగ్‌ శాతం పెరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. ఆదిలాబాద్‌, బోథ్‌, నిర్మల్‌, ముధోల్‌, ఖానాపూర్‌లో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు, ఆసిఫాబాద్‌, సిర్పూర్‌లో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుందని వివరించారు. ఈ అవకాశాన్ని ఆయా ప్రాంతాల ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

బాల్య వివాహాలు నేరం

నార్నూర్‌: బాల్య వివాహాలు చట్ట ప్రకారం నేరమని డీసీపీవో టి రాజేంద్ర ప్రసాద్‌ అన్నా రు. గాదిగూడ మండలంలోని లోకారి కే గ్రా మ రైతు వేదికలో బాల్య వివాహాలపై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. చిన్నతనంలో వివాహాలు చేయడం ద్వారా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. బాల్య విహహాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఇందులో ఎంపీడీవో రమేశ్‌, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ ప్రదీపిక, ఉమ, అంగన్‌వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement