-
Kalaiyarasi: తను ఒక ‘రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్’..
బాధ పడి ఆ బాధను కాలగమనంలో మరచిపోయేవారు కొందరు. బాధ పడి ఆ బాధలో నుంచి కొత్త అడుగు వేసేవారు కొందరు. కలైయారసి రెండో కోవకు చెందిన మహిళ. నేతకార్మికుల బంగారు కాలాన్ని కళ్లతో చూసిన కలైయారసి అవే కళ్లతో వారి కష్టాలను చూసింది. ఆ బాధలో నుంచి ‘రాటై’ స్టార్టప్‌కు స్వీకారం చుట్టింది. సంప్రదాయ నేతకళకు డిఐవై(డూ ఇట్ యువర్ సెల్ఫ్) కిట్స్ ద్వారా కొత్త వెలుగు తెస్తోంది తమిళనాడుకు చెందిన కలైయారసి రామచంద్రన్. పిల్లలు, పెద్దలు ఉపయోగించేలా ఈ కిట్‌ను డిజైన్ చేశారు. సంప్రదాయ కళకు విస్తృతప్రాచుర్యం కల్పిస్తున్న కలైయారసి గురించి...కొన్ని సంవత్సరాల క్రితం..‘చదువుకోవాలని ఉంది’ అని తన మనసులోని మాటను భర్తకు చెప్పింది కలైయారసి. పెళ్లికి ముందు పై చదువులు చదువుకోడానికి ఆర్థిక ఇబ్బందులు అడ్డుగోడలుగా నిలిచాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల పై చదువులకు తల్లిదండ్రులు ససేమిరా అన్నారు. కలైయారసి మనసులో మాట విన్న భర్త ‘తప్పకుండా’ అని ప్రోత్సహించాడు. అలా కలైయారసి ఎంసీఎ పూర్తి చేసింది. ఆ తరువాత ఒక ఐటీ కంపెనీలో డెవలపర్‌గా పని చేసింది.ఈరోడ్(తమిళనాడు) జిల్లాలోని సాలంగపాలయం గ్రామానికి చెందిన కలైయారసి నేతకార్మికుల కుటుంబం నుంచి వచ్చింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేసినా నేతకళపై ఆమెకు ఉన్న ప్రత్యేకాభిమానం మాత్రం దూరం కాలేదు. సెలవుల్లో సొంత ఊరుకు వచ్చిన కలైయారసి అక్కడ నేతకార్మికుల కష్టాలను ప్రత్యక్షంగా చూసింది. ఊళ్లో చేనేత మగ్గాల సంఖ్య 7,500 నుంచి 2,500కు పడిపోయింది.కష్టాలలో ఉన్న నేతకార్మికులకు ఆసరాగా నిలవడానికి తన వంతుగా ఏదైనా చేయాలనుకుంది కలైయారసి. నేతకళ గురించి మరిన్ని వివరాలు తెలుసుకొని ‘రాటై హ్యాండ్లూమ్’ పేరుతో స్వగ్రామంలో ఎకో–ఫ్రెండ్లీ హ్యాండ్లూమ్ స్టార్టప్‌కు శ్రీకారం చుట్టింది. పర్యావరణహిత కోణంలో ఆలోచించి ఆర్గానిక్ క్లాత్ వీవింగ్పై ప్రత్యేక దృష్టి పెట్టింది.‘నేతపని ద్వారా ఉపాధి పొంది సంతోషంగా ఉన్న కార్మికుల ఆర్థికపరిస్థితి ఆ తరువాత దిగజారిపోయింది. చాలామంది ఉపాధి వెదుక్కుంటూ పట్టణాల బాట పడ్టారు. డబుల్ షిఫ్ట్‌లలో పనిచేసేవాళ్లు. కొందరు వాచ్‌మెన్‌గా పని చేశారు. తల్లిదండ్రులు ఊళ్లో లేకపోవడంతో పిల్లల చదువు గాడి తప్పింది. తమిళనాడులో ఎన్నో గ్రామాలకు వెళ్లి నేతకార్మికులతో మాట్లాడి వారి కష్టాలు తెలుసుకున్నాను. ఈ పరిస్థితి నాకు బాధాకరంగా అనిపించింది’ అంటున్న కలైయారసి తాను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి నేతకళను స్వయంగా నేర్చుకుంది. సహజరంగులతో పాటు అరటి పీచు, జనపనార, ఇతర పదార్థాలతో తయారుచేసిన సేంద్రియ నూలును ‘రాటై’ ఉపయోగిస్తోంది. ప్రస్తుతం 28 కుటుంబాల వరకు ‘రాటై హ్యాండ్లూమ్’ కోసం పనిచేస్తున్నాయి.సంప్రదాయ చేనేత వస్త్రాలకు ఊతం ఇచ్చేందుకు పోర్టబుల్ డిఐౖవై హ్యాండ్లూమ్ కిట్ల ఆలోచనకు శ్రీకారం చుట్టింది కలైయారసి. ఎక్కడికంటే అక్కడికి చేతితో తీసుకెళ్లగలిగే ఈ మగ్గాలకు యూజర్ మాన్యువల్, క్యూ ఆర్ కోడ్ ఉంటుంది. దీని ద్వారా యూట్యూబ్ వీడియోల సహాయంతో పరికరాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవచ్చు. తమిళనాడులోని ఎన్నో స్కూల్స్‌లో పిల్లల దగ్గర పోర్టబుల్ లూమ్స్ కనిపిస్తున్నాయి. స్కూల్స్‌లో వీవింగ్ క్లబ్స్ ఏర్పాటు కావడం మరో విశేషం. మూడు ఆప్షన్లలో, మూడు స్థాయుల్లో అందుబాటులో ఉన్న వీటిని పెద్దలు, పిల్లలు ఉపయోగించవచ్చు.‘రాటై’ స్టార్టప్ ‘రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్’ అవార్డ్ గెలుచుకుంది. టాన్సీడ్ (తమిళనాడు స్టార్టప్ అండ్ ఇనోవేషన్ మిషన్) ద్వారా పది లక్షల గ్రాంట్ వచ్చింది.‘నేతకార్మికులకు ఉపాధి కల్పించడమే కాదు ఈ తరానికి ఆ కళపై ఆసక్తి కలిగేలా, నేర్చుకునేలా చేయాలనేది నా లక్ష్యం’ అంటుంది కలైయారసి.పిల్లల కోసం వర్క్‌షాప్..‘రాటై’ ద్వారా నేత కార్మికులకు అండగా నిలిస్తూనే మరో వైపు నేతకళపై పిల్లలకు అవగాహన, ఆసక్తి కలిగించడానికి వర్క్‌షాప్‌లు నిర్వహిస్తోంది కలైయారసి. పెద్దలకు ‘నేతపని’ని స్ట్రెస్–బస్టింగ్ ఎక్సర్సైజ్గా పరిచయం చేస్తోంది. ‘వీలైనన్ని ఎక్కువ స్కూల్స్‌కు వెళ్లి పిల్లలకు నేతకళ గురించి చె΄్పాలనుకుంటున్నాను. ఒక ఆర్ట్‌గా మన విద్యావిధానంలో నేతకళ భాగం కావాలని ఆశిస్తున్నాను’ అంటుంది కలైయారసి.ఇవి చదవండి: Naima Khatoon: వందేళ్లకు ఆమె వచ్చింది.. -
Vaazhai In OTT: ఆ హిట్ డైరెక్టర్ మూవీ.. నేరుగా ఓటీటీకేనా!
మామన్నన్ మూవీతో హిట్ అందుకు డైరెక్టర్ మారి సెల్వరాజ్. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో వాజై చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో కలైయరాసన్, నిఖిలా విమల్, ప్రియాంక, దివ్య, ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం థియేటర్లలో కాకుండా ఓటీటీ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. మూడు సూపర్ హిట్ చిత్రాల తర్వాత మారి సెల్వరాజ్ తెరకెక్కించిన నాలుగో చిత్రం వాజై ఓటీటీలో రిలీజ్ చేయడంపై ఫ్యాన్స్‌కు ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మామన్నన్ కంటే ముందే వచ్చిన పెరియారుమ్ పెరుమాల్, కర్ణన్ చిత్రాలు సక్సెస్ అయ్యాయి. సమాజంలో అణగారిన వర్గాలు ఎదుర్కొంటున్న వివక్షలను తనదైన శైలిలో తెరకెక్కిస్తూ సక్సెస్ అందుకున్నారు మారి సెల్వరాజ్. దీంతో వాజై మూవీని కూడా థియేటర్లలోనే రిలీజ్ చేస్తారని కోలీవుడ్ ఫ్యాన్స్ భావించారు. అదే తరహాలోనే వాజై చిత్రాన్ని కూడా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అసలు కారణమిదేనా? అయితే ఈ చిత్రాన్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, నవ్వి స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. అందువల్లే ఈ మూవీని థియేటర్లలో కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. రిలీజ్ డేట్‌ను కూడా త్వరలోనే అనౌన్స్ చేస్తామని ఇటీవలే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్రకటించింది. కాగా.. ఈ సినిమాకు దసరా ఫేమ్ సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు. நீளும் நீச்சலில் என் நா கேட்கும் ஒரு சொட்டுத் தேன் . —வாழை 🌴 This year belongs to #Vaazhai Team Vaazhai welcomes 2024 with warm hands!! Hitting theatres soon!! 🌴@disneyplusHSTam @navvistudios @mari_selvaraj @Music_Santhosh @thenieswar @KalaiActor @Nikhilavimal1… pic.twitter.com/CKrQNimnt7 — Mari Selvaraj (@mari_selvaraj) January 1, 2024 -
పట్టినపాక్కం చిత్రీకరణ పూర్తి
పట్టినపాక్కం చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుందని ఆ చిత్ర దర్శకుడు జయదేవ్ వె ల్లడించారు. ముల్లై మూ ట్టిల్ ప్రొడక్షన్స పతాకంపై రోహిత్ ముల్లై మూట్టిల్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మెడ్రాస్ చి త్రం ఫేమ్ కలైయరసన్ హీరోగా నటిస్తున్నారు.ఆ యనకు జంటగా ఈగో, యామిరుక్క భయమే చి త్రాల ఫేమ్ అణవ్వరకుమార్ నటిస్తున్నారు.ము ఖ్య పాత్రల్లో నటి చాయాసింగ్, జాన్‌విజయ్, ఆర్.సుందరరాజన్, చార్లీ,ఎంఎస్.భాస్కర్ నటిస్తున్నారు. ఇషాన్దేవ్ సంగీతాన్ని,రాణా ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్ర వివరాలను దర్శకుడు లె లుపుతూ పట్టభద్రుడైన హీరో కుటుంబం పేదరికంలో మగ్గుతుందన్నారు. దీంతో ఎలాగైనా త్వరగా ధనవంతుడిగా మారాలని నిర్ణరుుంచుకున్న హీరో కొందర్ని గురిగా పెట్టుకుని అడ్డదారిలో డబ్బు సంపాదించడానికి సిద్ధం అవుతాడన్నారు. అరుుతే అతని పథకం దిశ మారి తననే చిక్కుల్లో పడేస్తుందన్నారు.అరుుతే హీరోను సమస్యల్లో నెట్టిన వారు ఏ ఉద్దేశంతో కుట్ర పన్నారు? వారి కుట్ర నుంచి హీరో ఎలా బయట పడ్డాడు? ఇత్యాధి అంశాలతో కథ వేగంగా నడుస్తుందని తెలిపారు.ఈ చిత్ర విడుదల హక్కుల్సి ఎస్పీ.సినిమాస్ సంస్థ పొందిందని దర్శకుడు చెప్పారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్‌పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
తప్పక చదవండి
- నేటి నుంచి టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
- Arvind Kejriwal: మోదీజీ.. దేవుడు మిమ్మల్ని క్షమించడు
- మహిళా పోలీస్‌కే రక్షణ లేదు..
- Malaysia Masters 2024 badminton: శ్రమించి గెలిచిన సింధు
- పిన్నెల్లి ఫిర్యాదు పట్టదా?
- ‘ఈజీ’ ఐపాస్.. టీజీ ఐపాస్‌కు భారీగా మార్పులు!
- తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన
- రైసీ మరణం రేపుతున్న ప్రశ్నలు
- బంగ్లా ఎంపీ హత్యకు రూ.5 కోట్ల సుపారీ
- ఆస్కార్ లైబ్రరీలో పార్కింగ్
Advertisement