Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

YSRCP MP Vijaya Sai Reddy Satirical Comments On Chandrababu
బాబూ.. ప్చ్‌.. నాలుగు సీట్లేనా!: విజయసాయిరెడ్డి

సాక్షి, తాడేపల్లి: ఏపీలో ఎన్నికలకు పోలింగ్‌కు ముగిసింది. ఇక, జూన్‌ నాలుగో తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. కాగా, సర్వేలన్నీ ఏపీలో మళ్లీ వైఎస్సార్‌సీపీనే ఘన విజయం సాధిస్తుందని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు.కాగా, విజయసాయిరెడ్డి ట్విట్టర్‌ వేదికగా..‘చంద్రబాబు..!!పోయినసారి 23 మంది మా పార్టీ ఎమ్మెల్యేలను కొన్నావు2019 ఎన్నికలలో వచ్చింది 23 స్థానాలేఈసారి మా వాళ్ళను నలుగురిను (కోటంరెడ్డి, ఆనం, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి) కొన్నావుజూన్‌ 4న కౌంటింగ్ జరగబోతున్నదిఈసారి ఎన్ని సీట్లకు పరిమితం కాబోతున్నావో ఈపాటికి నీకు అర్థమై ఉంటుంది కదా చంద్రబాబూ?ఈ లెక్కన నువ్వు నాలుగు స్థానాలకే పరిమితం కాబోతున్నావని తెలిసి.. నీ మీద జాలేస్తోంది’ అంటూ కామెంట్స్‌ చేశారు. చంద్రబాబూ...!పోయినసారి 23 మంది మా పార్టీ ఎమ్మెల్యేలను కొన్నావు. 2019 ఎన్నికలలో (మే 23న జరిగిన కౌంటింగ్‌లో) నీకు వచ్చింది 23 స్థానాలే.ఈసారి మా వాళ్ళను నలుగురిను ( కోటంరెడ్డి, ఆనం, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి) కొన్నావు. జూన్‌ 4న కౌంటింగ్ జరగబోతున్నది. ఈసారి…— Vijayasai Reddy V (@VSReddy_MP) May 24, 2024

1000 Times More Politics: KL Rahul Truth Bomb To Justin Langer On India Coach Role
BCCI: రాహుల్‌ నా కళ్లు తెరిపించాడు: జస్టిన్‌ లాంగర్‌ కీలక వ్యాఖ్యలు

టీమిండియా హెడ్‌ కోచ్‌ రేసులో వినిపిస్తున్న పేర్లలో జస్టిన్‌ లాంగర్‌ పేరు ఒకటి. గతంలో ఆస్ట్రేలియా ప్రధాన కోచ్‌గా పనిచేసిన లాంగర్‌.. ఆటగాళ్లతో విభేదాల నేపథ్యంలో ఆ బాధ్యతల నుంచి వైదొలిగాడు.ఈ క్రమంలో కొన్నాళ్ల పాటు విరామం తీసుకున్న జస్టిన్‌ లాంగర్‌ 2024లో ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జట్టుకట్టాడు. పదిహేడో సీజన్‌లో లక్నోకు కోచ్‌గా నియమితుడయ్యాడు ఈ ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్.లాంగర్‌ మార్గదర్శనంలో కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్సీలో లక్నో అద్భుతాలు సాధిస్తుందనుకుంటే కనీసం ప్లే ఆఫ్స్‌ కూడా చేరకుండానే నిష్క్రమించింది. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచి సీజన్‌ను ముగించింది.ద్రవిడ్‌ వారసుడు ఎవరు?ఇదిలా ఉంటే.. బీసీసీఐ రాహుల్‌ ద్రవిడ్‌ స్థానంలో కొత్త కోచ్‌ వేట మొదలుపెట్టిన నేపథ్యంలో జస్టిన్‌ లాంగర్‌, రిక్కీ పాంటింగ్‌, స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ తదితర విదేశీ కోచ్‌ల పేర్లు తెరమీదకు వచ్చాయి.ఈ విషయంపై స్పందించిన జస్టిన్‌ లాంగర్‌ బీబీసీతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా కోచ్‌గా బాధ్యతలు చేపడితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందో కేఎల్‌ రాహుల్‌ తనకు వివరించాడంటూ బాంబు పేల్చాడు.అంతకు మించి.. వెయ్యి రెట్లు అధికంగా‘‘కోచ్‌ పాత్ర ఎలాంటిదో నాలుగేళ్ల పాటు ఆస్ట్రేలియా జట్టుతో గడిపినపుడే నాకు అర్థమైంది. అప్పుడు నేనైతే పూర్తిగా అలసిపోయాను. ఇక భారత జట్టు హెడ్‌ కోచ్‌ బాధ్యత ఎలా ఉంటుందన్న విషయం గురించి నేను కేఎల్‌ రాహుల్‌తో మాట్లాడినపుడు ఆసక్తికర సమాధానం విన్నాను.‘ఐపీఎల్‌ జట్టు విషయంలో ఒత్తిడి, రాజకీయాలు ఎలా ఉంటాయో మీకు తెలుసు. అందుకు వెయ్యి రెట్ల ఒత్తిడి, పాలిటిక్స్‌ టీమిండియా కోచ్‌గా ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని చెప్పాడు.అంతకంటే గొప్ప సలహా మరొకటి ఉంటుందని నేను అనుకోను’’ అని జస్టిన్‌ లాంగర్ పేర్కొన్నాడు. భారత జట్టు ప్రధాన కోచ్‌ పదవి విషయంలో తనకు ఇప్పుడు పూర్తి స్పష్టత వచ్చిందని తెలిపాడు. ఒక విధంగా కేఎల్‌ రాహుల్‌ తన కళ్లు తెరిపించాడని పేర్కొన్నాడు.రిక్కీ పాంటింగ్‌ సైతంఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్‌ రిక్కీ పాంటింగ్‌ సైతం టీమిండియా హెడ్‌కోచ్‌ పదవి చేపట్టేందుకు సిద్ధంగా లేనని పేర్కొన్న విషయం తెలిసిందే. తన కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించాలనుకుంటున్నానని.. అందుకే బీసీసీఐ ఆఫర్‌ ఇచ్చినా తాను తిరస్కరించానని తెలిపాడు.చదవండి: IPL 2024: టైమ్‌కి చెక్‌ వస్తుంది.. రూ. 11 కోట్లు.. ఇంకెందుకు ఆడటం?

Sunflowers Were the First Ones to Know Get First Prize In Cannes
కేన్స్‌లో ఇండియన్‌ సినిమాకు మొదటి బహుమతి

ఫ్రాన్స్‌లో 76వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ అట్టహాసంగా కొనసాగుతున్నాయి. యావత్తు సినీ పరిశ్రమ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ చిత్రోత్సవాలు మే 25న ముగియనున్నాయి. ప్రతిష్ఠాత్మక కేన్స్‌ చిత్రోత్సవాల్లో భారత్‌కు చెందిన 'సన్‌ఫ్లవర్స్‌ వర్‌ ద ఫస్ట్ వన్‌ టు నో' షార్ట్‌ఫిలిం సత్తా చాటింది. 2024కు గాను ఉత్తమ షార్ట్‌ఫిలిం బహుమతిని సొంతం చేసుకుంది.చిదానంద S నాయక్ తెరకెక్కించిన 'సన్‌ఫ్లవర్స్‌ వర్‌ ద ఫస్ట్ వన్‌ టు నో' అనే చిత్రం వివిధ భాషలకు చెందిన 17 చిత్రాలతో పోటీ పడి మొదటి బహుమతి అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా 555 ఫిల్మ్ స్కూల్స్ నుంచి 2,263 మంది దరఖాస్తుదారులు ఇందులో పోటీ పడ్డారు. 16 నిమిషాల పాటు నిడివితో ఉన్న ఈ షార్ట్‌ ఫిలింను కన్నడ జానపద కథ ఆధారంగా తెరకెక్కించారు.ఇదే విభాగంలో బన్నీహుడ్' అనే UK చిత్రానికి మూడో బహుమతి లభించింది. ఈ చిత్రాన్ని మీరట్‌లో జన్మించిన భారతీయ చిత్రనిర్మాత మహేశ్వరి రూపొందించడం విశేషం. మే 23న ఈ అవార్డుల కార్యక్రమం జరిగింది. ఉత్తమ షార్ట్‌ ఫిలిం అవార్డును గెలుచుకున్న టీమ్‌కు 15,00 యూరోలు, మూడో స్థానానికి 7,500 యూరోలు అందించారు. ఈ రెండు షార్ట్‌ ఫిలిం టీమ్‌కు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. View this post on Instagram A post shared by Festival de Cannes (@festivaldecannes)

Ap Elections 2024 May 24 Political Updates Telugu
May 24th: ఏపీ పొలిటికల్‌ అప్‌డేట్స్‌

May 24th AP Elections 2024 News Political Update11:00 AM, May 24th, 2024టీడీపీ నేతల అరాచకం.. కొనసాగుతున్న అరెస్ట్‌లుపల్నాడు జిల్లాలో పోలింగ్‌ రోజున టీడీపీ నేతల విధ్వంసం కేసులో కొనసాగుతున్న అరెస్టులురోజు భారీ స్థాయిలో కొనసాగుతున్న అరెస్టులు146 కేసుల్లో 1500 మందిని పైగా నిందితుల్ని గుర్తించిన పోలీసులుఇప్పటికే వెయ్యి మందికి పైగా నిందితుల అరెస్ట్ చేసిన పోలీసులుఇప్పటికే భారీ స్థాయిలో నిందితుల అరెస్టులుపరారీలో ఉన్న వారి కోసం స్పెషల్ టీం ఏర్పాటు చేసిన ఎస్పీ మల్లికా గార్గ్కౌంటింగ్ నేపథ్యంలో 400 మంది అనుమానితులను బైండోవర్ చేసిన పోలీసులునరసరావుపేట సబ్ డివిజన్‌లో కొత్తగా ఐదుగురిపై రౌడీషీట్లు ఓపెన్ చేసిన పోలీసులు9:58 AM, May 24th, 2024చంద్రబాబుపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్చంద్రబాబు పోయినసారి 23 మంది మా పార్టీ ఎమ్మెల్యేలను కొన్నావు2019 ఎన్నికలలో వచ్చింది 23 స్థానాలేఈసారి మా వాళ్ళను నలుగురిను ( కోటంరెడ్డి, ఆనం, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి) కొన్నావుజూన్‌ 4న కౌంటింగ్ జరగబోతున్నదిఈసారి ఎన్ని సీట్లకు పరిమితం కాబోతున్నావో ఈపాటికి నీకు అర్థమై ఉంటుంది కదా చంద్రబాబూ?ఈ లెక్కన నువ్వు నాలుగు స్థానాలకే పరిమితం కాబోతున్నావని తెలిసి.. నీ మీద జాలేస్తోంది చంద్రబాబూ...!పోయినసారి 23 మంది మా పార్టీ ఎమ్మెల్యేలను కొన్నావు. 2019 ఎన్నికలలో (మే 23న జరిగిన కౌంటింగ్‌లో) నీకు వచ్చింది 23 స్థానాలే.ఈసారి మా వాళ్ళను నలుగురిను ( కోటంరెడ్డి, ఆనం, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి) కొన్నావు. జూన్‌ 4న కౌంటింగ్ జరగబోతున్నది. ఈసారి…— Vijayasai Reddy V (@VSReddy_MP) May 24, 2024 8:28 AM, May 24th, 2024ఆ అభ్యర్థులకు హైకోర్టు రక్షణజూన్‌ 6 వరకు పిన్నెల్లి, గోపిరెడ్డి, పెద్దారెడ్డి తదితరులను అరెస్టు చెయ్యొద్దని పోలీసులకు ఆదేశంకౌంటింగ్‌ ముగిసే వరకు తాడిపత్రిలో ఉండొద్దని అస్మిత్‌రెడ్డికి ఆదేశంనలుగురి కంటే ఎక్కువ మందితో తిరగరాదుఎలాంటి నేరపూరిత చర్యలకు పాల్పడరాదుసాక్షులను ప్రభావితం చేయరాదు.. దర్యాప్తులో జోక్యం చేసుకోరాదుహైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులకు స్పష్టీకరణవీరిపై నిఘా పెట్టాలని పోలీసులకు హైకోర్టు ఆదేశం8:23 AM, May 24th, 2024టీడీపీ రిగ్గింగ్‌లపై ఈసీకి మరోసారి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదుపోలింగ్ రోజు 16 నియోజకవర్గాలలో టీడీపీ రిగ్గింగ్‌కి పాల్పడినట్లు ఆధారాలతో సహా ఫిర్యాదు60కి పైగా పోలింగ్ కేంద్రాలలో రీపోలింగ్ నిర్వహించాలని ఈసీని కోరిన వైఎస్సార్‌సీపీపోలింగ్ రోజు పలుచోట్ల యథేచ్ఛగా టీడీపీ రిగ్గింగ్పచ్చమూక రిగ్గింగ్ చేసుకోవడానికి సహకరించిన కొందరు పోలీస్ అధికారులురిగ్గింగ్ జరిగిన ప్రాంతాలలో వెబ్ కాస్టింగ్ పరిశీలించాలంటున్న వైఎస్సార్‌సీపీఆయా పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ పర్సంటేజ్‌ని గమనించినా రిగ్గింగ్ జరిగిందో లేదో అర్ధమవుతోందంటున్న వైఎస్సార్‌సీపీచేసిన రిగ్గింగ్ బయటపడుతుందనే రీపోలింగ్ కోరని టీడీపీపల్నాడు జిల్లాలో టీడీపీ రిగ్గింగ్‌పై పోలింగ్ రోజే ఈసికి ఫిర్యాదు చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిరిగ్గింగ్‌కి సహకరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుపిన్నెల్లి ఫిర్యాదుపై ఇప్పటివరకు చర్యలు తీసుకోని ఈసీ8:05 AM, May 24th, 2024నగరి టీడీపీ అభ్యర్థి ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనఫలితాలు రాకముందే గాలి భానుప్రకాష్‌ను నగరి ఎమ్మెల్యేగా పేర్కొంటూ ఫ్లెక్సీల ఏర్పాటు బీఎస్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ను ప్రారంభించిన భానుప్రకాష్‌ఎన్నికల అధికారికి మున్సిపల్‌ చైర్మన్‌ హరి ఫిర్యాదు 7:19 AM, May 24th, 2024టీడీపీ దాడులపై చర్యలెందుకు తీసుకోలేదు?: సజ్జల రామకృష్ణారెడ్డిఒక్క పాల్వాయి గేట్‌ వీడియోనే ఎలా లీక్‌ అయ్యింది?అది కూడా చిన్న క్లిప్పింగే ఎలా బయటకు వచ్చింది?7 చోట్ల ఈవీఎంలు ధ్వంసమయ్యాయని ఎన్నికల కమిషనే చెబుతోందిఆ వీడియోలను ఎందుకు రిలీజ్‌ చేయట్లేదు?అమాయక ఓటర్లపై దాడులు చేసిన టీడీపీ గూండాలపై చర్యలకెందుకు వెనుకాడుతున్నారు?ఎన్నికల కమిషన్‌కు ప్రశ్నలు సంధించిన సజ్జల 7:10 AM, May 24th, 2024మహిళా పోలీస్‌కే రక్షణ లేదు..టీడీపీ నేతల దాడిపోలింగ్‌ రోజున మహిళా పోలీస్‌ అనూషపై టీడీపీ నేతల దాడిప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం ఉమామహేశ్వరపురంలో ఘటనఎస్పీని కలవకుండా మధ్యలోనే అడ్డుకున్న పోలీసులుచివరికి కలెక్టర్‌ ఆదేశాలతో టీడీపీ నేతలపై అట్రాసిటీ కేసురాజీకి ఒప్పుకోలేదని కౌంటర్‌ కేసూ నమోదు చేశారని బాధితురాలి ఆవేదన7:07 AM, May 24th, 2024ఆ వీడియో లీక్‌ అయింది.. మేము విడుదల చేయలేదు: సీఈవోఅది మేము విడుదల చేయలేదుఈసీకి సంబంధం లేదుదర్యాప్తు సమయంలో బయటకు వెళ్లి ఉండవచ్చుదానిపైనా విచారణ చేస్తున్నాంఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లుమీడియాతో సీఈవో ముఖేష్‌ కుమార్‌ మీనా7:03 AM, May 24th, 2024టీడీపీ రీపోలింగ్‌ ఎందుకు కోరలేదు?మాచర్లలో విచ్చలవిడిగా రిగ్గింగ్‌ చేసిన టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డిఅడ్డొచ్చిన వైఎస్సార్‌సీపీ పోలింగ్‌ ఏజెంట్లు, కార్యకర్తలపై దాడిరిగ్గింగ్‌ అడ్డుకోవడంతో తుమృకోటలో నాలుగు ఈవీఎంలను ధ్వంసం చేసిన టీడీపీ నేతలుఅయినా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఆరోపణలుపోలింగ్‌ సక్రమంగా జరగలేదంటూ గగ్గోలుఅయినా రీపోలింగ్‌ కోరని టీడీపీఅంటే తమకు అనుకూలంగా ఎన్నికలు జరిగినట్లేగా..మరోవైపు.. మాచర్లలోని పలు ప్రాంతాల్లో రీపోలింగ్‌ కోరిన ఎమ్మెల్యే పిన్నెల్లి రీపోలింగ్‌ జరగకుండా ఎన్నికల అధికారులపై టీడీపీ నేతల ఒత్తిడి6:56 AM, May 24th, 2024పచ్చమూక అరాచకం.. ఆనవాళ్లివిగో..పల్నాట గ్రామాలు వదిలి బయట తలదాచుకుంటున్న బడుగులుఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై దాడులు.. ఆపై రిగ్గింగ్‌కు పాల్పడిన టీడీపీ నేతలుఓటింగ్‌ తరువాత కూడా బడుగు, బలహీన వర్గాలపై దాడులు కొనసాగింపువైఎస్సార్‌సీపీకి ఓటు వేశారని కారంపూడి మండలం పేటసన్నెగండ్లలో బేడ బుడగ జంగాలపై దాడి.. రెంటచింతల మండల పరిధిలోని గోలిలో ఎస్టీలపై దాడితొండేపి గ్రామాన్ని వదలి ప్రాణభయంతో బయట తలదాచుకుంటున్న మైనార్టీలుచిలకలూరిపేట మండలం కావూరులో ఎస్సీలకు తాగునీరు నిలిపివేతకొత్త గణేషునిపాడు నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీలను వెళ్లగొట్టిన టీడీపీ నేతలుచివరకు బాధితులపైనే కేసులు నమోదు పరామర్శకు వెళ్లిన ఎమ్మెల్యేలు కాసు, అనిల్‌ కుమార్‌పైనా దాడిపట్టించుకోని పోలీసు యంత్రాంగం 6:40 AM, May 24th, 2024కూటమి సేవలో 'ఘనాపాఠి'చంద్రబాబు విధ్వంస కుట్రలో ప్రధాన పాత్రధారి.. పల్నాడులో హింసాకాండకు ఐజీ త్రిపాఠి వత్తాసుకీలక అధికారుల ఆకస్మిక బదిలీల వెనుక సూత్రధారిపోలీసులను కట్టడి చేసి టీడీపీ గూండాగిరికి అండదండలుకౌంటింగ్‌ రోజు మరోసారి అలజడికి కొమ్ము కాస్తున్న వైనంపచ్చ ముఠాలను ఇంతవరకు అరెస్ట్‌ చేయకపోవడమే నిదర్శనంటీడీపీ అధినేత ఒత్తిడితోనే త్రిపాఠికి పోస్టింగ్‌పల్నాడులో ప్రశాంతత కోసం ఆయన్ను తక్షణం బదిలీ చేయాలంటున్న పోలీస్‌ యంత్రాంగం

Delhi Liquor Scam Case: BRS MLC Kavitha Bail Plea Hearings May 24 Updates
కవిత కేసులో నేడు ఏం జరగనుందో?

ఢిల్లీ, సాక్షి: లిక్కర్‌ స్కాం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌ పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది. ఈడీ కేసులో ట్రయల్‌ కోర్టు(రౌస్‌ అవెన్యూ కోర్టు) తనకు బెయిల్‌ తిర​స్కరించడాన్ని ఢిల్లీ హైకోర్టులో సవాల్‌ చేశారామె. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన జస్టిస్‌ స్వర్ణకాంత శర్మ బెంచ్‌ ఇవాళ విచారణ జరపనుంది. లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. అప్రూవర్ల స్టేట్మెంట్లను ఆధారం చేసుకుని తనని ఈ కేసులో ఇరికించారని, స్టేట్మెంట్లు మినహా తనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని కవిత తన బెయిల్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాదు.. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తనపై కేసు పెట్టారని ఆమె మొదటి నుంచి వాదిస్తున్నారు. తనకు పలు అనారోగ్య సమస్యలు ఉన్నాయని, అన్నింటికి మించి ఒక మహిళ అయినందున బెయిల్‌తో ఊరట ఇవ్వాలని పిటీషన్‌ ద్వారా కవిత విజ్ఞప్తి చేశారు. ఈడీ ఇప్పటికే చార్జిషీటు దాఖలు చేసింది కాబట్టి ఆమెకు జ్యుడీషియల్‌ కస్టడీ అవసరం లేదన్నారు.అయితే.. లిక్కర్ కేసులో కవితే సూత్రధారి , పాత్రధారి అని ఈడీ తొలి నుంచి వాదిస్తోంది. లిక్కర్ పాలసీని అనుకూలంగా తయారు చేయించేందుకు 100 కోట్ల రూపాయలు సౌత్ గ్రూప్ ద్వారా ఆప్ కు చెల్లింపులు చేయడంలో కవితే ముఖ్య భూమిక పోషించారని, పైసా పెట్టుబడి లేకుండా ఇండో స్పిరిట్ లో కవిత 33శాతం వాటా సంపాదించారని ఈడీ ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. అంతేకాదు.. కవితకు బెయిల్ ఇస్తే సాక్షాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని, రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తిగా సాక్షులనూ ప్రభావితం చేయొచ్చని బెయిల్‌ పిటిషన్‌పై గతంలో ఈడీ వాదనలు వినిపించింది కూడా. ఈ నేపథ్యంలో నేటి విచారణ ద్వారా బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు ఓ కొలిక్కి వస్తాయా? లేకుంటే విచారణ మళ్లీ వాయిదా పడుతుందా? అనేది చూడాలి.ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఈడీ.. మార్చి 15న ఆమెను హైదరాబాద్‌లోని నివాసంలో అరెస్టు చేసింది. మార్చి 26 నుంచి తీహార్‌ జైలులోనే ఉన్నారు. జూన్‌ 3 వరకు కవిత జ్యూడీషియల్‌ రిమాండ్‌ను పొడిగించారు. మరోవైపు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే ఈడీ ఏడు చార్జిషీట్లు దాఖలు చేసింది.

Kerala Kidney racket busted Lionked With Hyderabad
కేరళ కిడ్నీ రాకెట్‌.. హైదరాబాద్‌ డాక్టరే సూత్రధారి!

హైదరాబాద్‌, సాక్షి: కేరళలో వెలుగు చూసిన కిడ్నీ రాకెట్‌ ఉదంతం వెనుక నగర మూలాలు ఉండడం కలకలం రేపుతోంది. కీలక సూత్రధారులు ఇక్కడివాళ్లే అని.. ఓ ప్రముఖ డాక్టర్‌ సూత్రధారిగా కేరళ పోలీసులు నిర్ధారించుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి వయా కొచ్చి టూ ఇరాన్‌ కేంద్రంగా నడిచిన ఈ కిడ్నీ రాకెట్‌ వివరాల్లోకి వెళ్తే.. కేరళలో తాజాగా ఓ యువకుడు మృతి చెందాడు. అయితే కిడ్నీ దానం పేరిట మోసం జరిగిందని, ఒక ముఠా తమ కొడుకును బలిగొందని అతని కుటుంబ సభ్యులకు కొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన కొచ్చి పోలీసులు సబిత్‌ అనే యువకుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. సబిత్‌ ఇచ్చిన సమాచారం ఆధారంగా కిడ్నీ రాకెట్‌ ముఠా గుట్టును చేధించారు. పేద యువకులను ఈ ముఠా లక్ష్యంగా చేసుకుని ఈ కిడ్నీ రాకెట్‌ నడిపిస్తోంది. ఒక్కో కిడ్నీకి రూ.20 లక్షలు ఇస్తామని ఆశజూపి.. ఇరాన్‌కు తీసుకెళ్తోంది. అక్కడ కిడ్నీలు తీసుకుని.. తిరిగి ఇండియాకు తీసుకొస్తోంది. తీరా ఇక్కడికి వచ్చాక కేవలం రూ. 6 లక్షలే ఇవ్వడంతో బాధితులు కంగుతింటున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే.. చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఈ క్రమంలోనే కిడ్నీ ఇచ్చిన ఓ యువకుడు చనిపోవడంతో ఈ ముఠా అరాచకాలు వెలుగు చూశాయి. హైదరాబాద్‌ నుంచే.. ఈ కిడ్నీ రాకెట్‌ కీలక సూత్రధారులు హైదరాబాద్‌కు చెందిన వ్యక్తులుగా కేరళ పోలీసులు గుర్తించారు. ఇప్పటికే 40 మందికిపైగా యువకుల నుంచి కిడ్నీలు ఈ ముఠా సేకరించినట్లు నిర్ధారించుకున్నారు. అంతేకాదు నగరానికి చెందిన ఓ ప్రముఖ డాక్టర్‌ ఈ రాకెట్‌కు ప్రధాన సూత్రధారిగా గుర్తించిన కేరళ పోలీసులు.. ఆ వైద్యుడితో పాటు అతనికి సహకరించిన మరో ఇద్దరు వ్యక్తుల కోసం వెతుకుతున్నారు.

Supriya Sule Attacked Maharashtra Government Over Car Accident
పూణే కారు ప్రమాదంలో ఊహించని ట్విస్ట్‌

పూణే: పుణేలో విలాసవంతమైన పోర్షే కారు ప్రమాదం కేసులో ఇప్పటికే పలు ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మరో ఊహించని ట్విస్ట్‌ బయటకు వచ్చింది. కారు ప్రమాదానికి గురైన సమయంలో కారు నడిపింది తన కొడుకు కాదని.. కారును నడిపింది తమ డ్రైవర్‌ అని మైనర్‌ బాలుడి తండ్రి విశాల్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. దీంతో, ఈ కేసు మరో మలుపు తిరిగింది.కాగా, పూణేలో ఓ మైనర్‌ మద్యం మత్తులో ఫుల్‌ స్పీడ్‌లో పోర్షే కారును నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి ఓ బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. కాగా, పోర్శే కారును మైనర్‌(17) నడిపాడని ఇప్పటివరకు పోలీసులు భావించారు. అతడిపైనే కేసు నమోదైంది. ప్రస్తుతం జువైనైల్‌ సెంటర్‌కు మైనర్‌ను తరలించారు. కాగా, ఈ ప్రమాదం జరిగినప్పుడు కారును నడిపింది తమ డ్రైవర్‌ అని మైనర్‌ బాలుడి తండ్రి విశాల్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. #Pune Porsche Car accident case: Accused Vishal patil, pub owner and driver shifted to jail after interrogation #porsche #porschecaraccidentinpune #pune #punecity #punenews #agrwal #kalyaninagar #accidentcase #accused #news #theupdatejuntionhttps://t.co/jGhBOiql24 pic.twitter.com/ep6fpeE5I2— The Update Junction (@TUJunction) May 23, 2024 ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఉన్న మైనర్‌ బాలుడి స్నేహితులు ఇద్దరు కూడా కారును డ్రైవరే నడిపాడని తెలిపారు. ప్రమాద సమయంలో తానే కారును నడిపానని డ్రైవర్‌ కూడా పోలీసుల ముందు అంగీకరించాడు. దీంతో కేసు కొత్త మలుపు తీసుకుంది. అయితే, కేసు నుంచి మైనర్‌ను తప్పించేందుకే డ్రైవర్‌ను ఇరికిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు.. నిందితుడు వేదాంత్‌ అగర్వాల్‌ కన్నీరు పెడుతున్న వీడియో కూడా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోపై నిందితుడి తల్లి శివానీ అగర్వాల్‌ స్పందించారు. ఈ సందర్భంగా తన కుమారుడిని రక్షించాలని కన్నీరుపెట్టుకున్నారు. కాగా, ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ ఇది ఫేక్‌ వీడియో అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడికి కఠిన విధించాలని డిమాండ్‌ చేస్తున్నారు. PUNE PORSCHE CAR ACCIDENT A FAKE RAP VIDEO has been circulating online, claiming to be accused minor Vedant AggarwalNow, his mother, Shivani Aggarwal, has put out a clarification video seeking protection for her son(Use headphones - very strong language) pic.twitter.com/8iLh2Cq0Ku— Arnaz Hathiram (@ArnazHathiram) May 24, 2024 ఇక, ఈ ఘటనపై ఎన్‌సీపీ ఎంపీ సుప్రియా సూలే స్పందించారు. ఈ సందర్భంగా సుప్రియా సూలే మాట్లాడుతూ.. మైన‌ర్‌కు మ‌ద్యం స‌ర‌ఫ‌రా చేయ‌డంతో పుణేలో డ్రంకెన్ డ్రైవ్ కార‌ణంగా ఘోర ప్ర‌మాదం జరిగింది. డ్ర‌గ్స్ స్వాధీనం, మైన‌ర్ల‌కు మ‌ద్యం స‌ర‌ఫ‌రాలు, డ్రంకెన్ డ్రైవ్ జ‌రుగుతుంటే మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం ఏం చేస్తోంది. పోలీసులపై ఒత్తిడి తెస్తున్నది ఎవరు?. మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం రాజ‌కీయ పార్టీల‌ను, కుటుంబాల‌ను చీల్చ‌డంలో నిమ‌గ్న‌మైంద‌ని విమ‌ర్శించారు. పుణే ఘ‌ట‌న‌కు బాధ్యులు ఎవ‌ర‌ని ఏక్‌నాథ్ షిండే స‌ర్కార్‌ను ఆమె ప్ర‌శ్నించారు. దీంతో, ఆ ఘటన రాజకీయంగా కూడా హాట్‌ టాపిక్‌గా మారింది.

7,000 IIT students still jobless
తగ్గిన ప్లేస్‌మెంట్‌లు.. ఐఐటియన్లకు ఉద్యోగాలు కరువు

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) టెక్నాలజీ ఐఐటీ విద్యార్ధుల కొంప ముంచుతోంది. విద్యా సంవత్సరం (అకడమిక్‌ ఇయర్‌) 2023-2024లో ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ) పూర్తిచేసిన 7 వేల మంది విద్యార్ధులకు ఉద్యోగ అవకాశాలు రాలేదని సమాచారం. పెరిగిపోతున్న చాట్‌జీపీటీతో పాటు ఇతర లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్‌ (ఎల్‌ఎల్‌ఎం) వల్ల ప్లేస్‌మెంట్‌ శాతం తగ్గుతోంది. ఐఐటీ కాన్పూర్‌, ఐఐఎం కోల్‌కతా పూర్వ విద్యార్ధి ధీరజ్‌ సింగ్‌ సమాచారహక్కు చట్టం కింద దాఖలు చేసిన దరఖాస్తుకు లభించిన సమాచారం ద్వారా ఈ వివరాలు తెలిశాయి. ఆ వివరాల మేరకు.. దేశంలో మొత్తం 23 ఐఐటీ క్యాంపస్‌లలో ఉద్యోగాలు పొందే విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తేలింది.ఏకమైన ఐఐటీ ఢిల్లీ పూర‍్వ విద్యార్ధులు..దీంతో ఐఐటీ ఢిల్లీ పూర‍్వ విద్యార్ధులు.. ఇటీవల ఐఐటీ ఢిల్లీలో గ్రాడ్యుయేట్‌ పూర్తి చేసిన సుమారు 400 మంది విద్యార్ధులకు ఉద్యోగాలు ఇస్తామంటూ ముందుకు వచ్చారు. ఒక వేళ తమ సంస్థలో ఉద్యోగాలు లేకపోతే ఇతర సంస్థల్లో జాబ్ వచ్చేలా రిఫరెన్స్‌ ఇవ్వడం, ఇంటర్నషిప్‌ను సమయానికి మరింత పొడిగిస్తామని హామీ ఇచ్చారు.విద్యార్ధులకు సహకరించాలనిఈ సందర్భంగా ఐఐటీ ఢిల్లీ క్యాంపస్‌లో విద్యార్ధులకు ట్రైనింగ్‌, ప్లేస్‌మెంట్‌కు సంబంధించిన సమాచారం అందించే ఆఫీస్‌ ఆఫ్‌ కెరియర్‌ సర్వీసెస్‌ (ఓసీఎస్‌) విభాగం విద్యార్ధులకు ఉద్యోగాలు వచ్చేందుకు సహకరించాలని దేశంలో అన్నీ రాష్ట్రాలను విజ్ఞప్తి చేసింది. నిరుద్యోగులుగా 250మంది విద్యార్ధులుమరోవైపు బిర్లా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ (బీఐటీఎస్‌), ఐఐటీ బాంబే సైతం రెండు నెలల క్రితమే తమ పూర్వ విద్యార్ధుల మద్దతు కోరాయి. ఐఐటీ బాంబేలో గ్రాడ్యుయేట్‌ పూర్తి చేసిన సుమారు 250 మంది అభ్యర్థులు జూన్ చివరి నుంచి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఉద్యోగాలు పొందలేకపోవడం గమనార్హం.చాట్‌జీపీటీ ఎఫెక్ట్‌ బిట్స్ గ్రూప్ వైస్-ఛాన్సలర్ వి రాంగోపాల్ రావు మాట్లాడుతూ.. ఆర్ధిక, సాంకేతిక కారణాల వల్ల ప్లేస్‌మెంట్‌ తగ్గుముఖం పట్టాయని అన్నారు. ప్రతిచోటా ప్లేస్‌మెంట్‌లు 20శాతం నుంచి 30 శాతం వరకు తక్కువగా ఉన్నాయి. జాబ్ మార్కెట్‌పై చాట్‌జీపీటీతో పాటు లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్‌(ఎల్‌ఎల్‌ఎం)లు ప్రభావం చూపుతున్నాయన్న ఆయన.. వీటివల్ల ఇద్దరు లేదా ముగ్గురు చేసే పనిని ఒక్కరే చేయడం సాధ‍్యమవుతుంది. కాబట్టే 30 శాతం క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ తగ్గిందన్నారు.

High Tech Hotels In Hyderabad Have Rampant Adulteration Of Food Items
తళుకుల మాటున కల్తీమాయ!

ఎవరైనా ఆహారం ఎందుకు తింటారు? బతకడానికి. ఆరోగ్యంగా జీవించడానికి. కానీ.. గ్రేటర్‌ నగరంలోని హోటళ్లలో తింటే ‘ఆహారంతోనే రోగం’ అన్నట్లుగా ఉంది పరిస్థితి. హోటళ్లతో పాటు బేకరీలు, రెస్టారెంట్లు, బార్లు, ఐస్‌పార్లర్లు అన్నింటా ఇదే దుస్థితి. ముడిసరుకుల నుంచి తినుబండారాల దాకా, ఫుట్‌ఫాత్‌ బండ్ల నుంచి స్టార్‌హోటళ్ల దాకా ఆహార పదార్థాల్లో విచ్చలవిడిగా కల్తీ జరుగుతోంది. దాదాపు గత 40 రోజులుగా అధికారుల తనిఖీల్లో కల్తీ.. శుభ్రత, నాణ్యతల లేమి బట్టబయలవుతున్నాయి. ఇప్పటి దాకా భారీ పెనాలీ్టలు, మూసివేతలు, తగిన శిక్షలు అమలు కాకపోవడం అందుకు ఓ కారణం కాగా, లంచాలకు మరిగిన అధికారులపై చర్యలు లేకపోవడం మరో కారణంగా కనిపిస్తోంది. నగరంలోని హోటళ్లలో లభించే ఆహార పదార్థాల్లో కల్తీకేదీ కాదు అనర్హం అన్న చందంగా మారింది. ఏ హోటల్‌ చూసినా ఏమున్నది గర్వకారణం.. అడుగడుగునా ఆహారం నకిలీమయం అన్నట్లు.. గ్రేటర్‌లోని హోటళ్లలో కల్తీ పదార్థాలపై ‘సాక్షి’ స్పెషల్‌ స్టోరీ. వీటిలో కల్తీ ఎక్కువ.. కల్తీ ఎక్కువగా జరిగేందుకు ఆస్కారమున్న వాటిలో టీ పొడి నుంచి నూనెల దాకా ఎన్నో ఉన్నాయి. పాలు, తేనె, మసాలా దినుసులు, ఐస్‌క్రీమ్స్, తృణధాన్యాలు, పిండి, కాఫీ, టొమాటో సాస్, వెజిటబుల్‌ ఆయిల్స్, నెయ్యి తదితరమైనవి. వీటిలోని కల్తీ వల్ల జీర్ణకోశ సమస్యలు తలెత్తుతాయని డాక్టర్లు చెబుతున్నారు. మసాలా దినుసుల్లోని గసగసాలు, దాలి్చనచెక్క, లవంగాలు, యాలకులు వంటి వాటిలో 20 శాతం అసలువి కాగా 80 శాతం కల్తీవి కలుపుతారని సమాచారం. వీటితో పాటు జంతు కళేబరాలు, కొవ్వు, ఎముకల నుంచి తయారు చేస్తున్న కల్తీనూనె నగరంలో వినియోగంలో ఉంది.కల్తీ ఇలా.. మచ్చుకు..– తేనె పేరిట గ్లూకోజ్‌వాటర్‌లో పంచదార పాకం, వార్నిష్‌, డ్రైఫ్రూట్స్‌ మిశ్రమం కలిపి విక్రయిస్తున్నారు. రంగుల తయారీలో వాడే యాసిడ్లు, హానికర రసాయనాలతో సోంపు తయారు చేస్తున్నారు. రంగుల పరిశ్రమల్లో వాడే సల్ఫ్యూరిక్‌ యాసిడ్, వార్నిష్‌, కుళ్లిన ఆలుగడ్డలతో వెల్లుల్లి పేస్ట్‌.– ఓల్డ్‌సిటీలోని చావ్‌నీబస్తీలోని గోదాముల్లో జంతు కళేబరాల నుంచి నూనె తయారీని గతంలో గుర్తించారు. ఉప్పుగూడ, బహదూర్‌పురా, ఘాన్సీబజార్, బాలానగర్, మియాపూర్‌ ,మైలార్‌దేవ్‌పల్లి, టాటానగర్‌ , మల్లాపూర్, జల్‌పల్లి, శంకర్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో కల్తీ జరుగుతుండటాన్ని గుర్తించినా పూర్తిగా నిలువరించలేకపోయారు.నిబంధనలకు నీళ్లు.. – ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ యాక్ట్‌ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏ)మేరకు, అన్ని ఆహార విక్రయ కేంద్రాలు, ఉత్పత్తి కేంద్రాలు, వాటి లైసెన్సుల వివరాలు జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండాల్సి ఉండగా అమలు కావడం లేదు. తనిఖీలు జరిపి కల్తీని బట్టి చర్యలు తీసుకోవాలి. ఆహార పదార్థాల ఉత్పత్తి స్థానం నుంచి ప్యాకింగ్, రవాణా, విక్రయం, వినియోగం వరకు ఎక్కడా కల్తీ జరగకుండా ఉండాలంటే తగిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వ్యవస్థ ఉండాలి.కల్తీని వెంటనే నిర్ధారించేందుకు తగినన్ని పరీక్షల కేంద్రాలుండాలి కానీ ఏదీ లేదు.కాగితాల్లోనే యాప్‌.. – హోటళ్లలో పరిశుభ్రత నుంచి అన్నీ సవ్యంగా ఉండాలని, లేని పక్షంలో ఆటోమేటిక్‌గానే వేటికి ఎంత జరిమానానో పేర్కొంటూ ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెస్తామన్న మాటలు కార్యరూపం దాల్చలేదు. స్విగ్గీ, జొమాటో వంటి సంస్థల నుంచి ఆన్‌లైన్‌ ఆర్డర్లపై, క్లౌడ్‌ కిచెన్‌లు, హోటళ్ల టేక్‌అవే విండోల ద్వారా తీసుకుంటున్న ఆహారాల్లోనూ కల్తీపై పలు ఫిర్యాదులందుతున్నాయి. – ప్రతి హోటల్‌లోనూ ట్రేడ్‌ లైసెన్సు ఫుడ్‌ లైసెన్సు సర్టిఫికెట్‌లు కనిపించేలా ఉంచడంతో పాటు స్వచ్ఛమైన తాగునీరు ఉచితంగా సరఫరా చేయాలి. దాంతోపాటు వివిధ నిబంధనలున్నాయి. వాటిని పాటించకపోతే జీహెచ్‌ఎంసీ యాక్ట్‌ మేరకు జరిమానాలు విధించాలి.పకడ్బందీగా అమలు కాని పెనాల్టీలు.. తయారీకి సిద్ధం చేసిన, తయారైన ఆహార పదార్థాలపై దుమ్మూ ధూళి ఉన్నా, కిచెన్‌లో ఎగ్జాస్ట్‌ ఫ్యాన్లు లేకపోయినా, కిచెన్‌ శుభ్రంగా లేకున్నా, సిబ్బంది చేతులకు గ్లౌజులు, తలకు టోపీ ధరించకున్నా, ఉద్యోగులకు నిరీ్ణత వ్యవధుల్లో హెల్త్‌ చెకప్‌లు చేయించకున్నా, అపరిశుభ్రత, పగిలిన పాత్రలు వినియోగించినా రూ. 500 నుంచి పెనాలీ్టలున్నాయి. కానీ పకడ్బందీగా అమలు కావడం లేదు.పేరు గొప్ప.. తీరు దయనీయం..దాదాపుగా 40 రోజులుగా జరుగుతున్న తనిఖీల్లో ఉల్లంఘనలు గుర్తించిన వాటిల్లో చిన్న వాటి నుంచి పెద్ద సంస్థల వరకున్నాయి. సీట్ల కోసం ప్రజలు వెయిట్‌ చేసే ప్రముఖ సంస్థలు కూడా వీటిల్లో ఉండటం ఆందోళన కలిగించే అంశం. క్రీమ్‌స్టోన్, నేచురల్స్‌ ఐస్‌క్రీమ్, కరాచీ బేకరీ, కేఎఫ్‌సీ, రోస్టరీ కాఫీ, హౌస్‌ రాయలసీమ, రుచుల షా, గౌస్‌ కామత్‌ హోటల్, 36 డౌన్‌టౌన్‌ బ్య్రూ పబ్, మకావ్‌ కిచెన్‌ అండ్‌ బార్, ఏయిర్‌ లైవ్, టాకో బెల్, ఆహా దక్షిణ్, సిజ్లింగ్‌ జోయ్, ఖాన్‌సాబ్, సుఖ్‌సాగర్‌ రెస్టారెంట్, జంబోకింగ్‌ బర్గర్స్, రత్నదీప్‌ రిటైల్‌ స్టోర్, అట్లూరి ఫుడ్స్‌ ప్రై వేట్‌ లిమిటెడ్‌(చట్నీస్‌ కాఫీహౌస్‌ అండ్‌ వెజ్‌ రెస్టారెంట్‌),షాన్‌బాగ్‌ హోటల్‌ డీలక్స్, గౌరంగ్‌ డిజైన్స్‌ ఇండియా ప్రై వేట్‌ లిమిటెడ్, కృతుంగ పాలేగార్స్‌ క్విజి, హెడ్‌క్వార్టర్స్‌ రెస్టో బార్, తదితరమైనవి వీటిల్లో ఉన్నట్లు అధికారులు ప్రకటించారు.Task force team has conducted inspections in the Madhapur area on 23.05.2024. The Rameshwaram Cafe* Urad Dal (100Kg) stock found expired in Mar'24 worth Rs. 16K* Nandini Curd (10kg), Milk (8L) worth Rs. 700 found expired Above items discarded on the spot.(1/4) pic.twitter.com/mVblmOuqZk— Commissioner of Food Safety, Telangana (@cfs_telangana) May 23, 2024 ఆరోగ్యం ఖతం.. కల్తీ వల్ల జీర్ణకోశ సమస్యలు తలెత్తుతాయి. శరీరానికి అవసరమైన పదార్థాలు అందక శరీరం బలహీనమవుతుంది. తాము పోషకాహారం తీసుకుంటున్నామని ప్రజలు భావిస్తున్నప్పటికీ, కల్తీవల్ల జీవక్రియలు నిలిచిపోయి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని డాక్టర్లు పేర్కొంటున్నారు. కల్తీ ఆహారంతో అక్యూట్‌ డయోరియల్‌ డిసీజెన్‌ వస్తాయని ఫీవర్‌ హాస్పిటల్‌ డాక్టర్లు తెలిపారు.రంగంలోకి టాస్‌్కఫోర్స్‌..వివిధ వర్గాల నుంచి ఫిర్యాదులందుతుండటంతో స్టేట్‌ ఫుడ్‌ సేఫ్టీ కమిషనర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సంయుక్తంగా ఏర్పాటు చేసిన టాస్‌్కఫోర్స్‌ టీమ్స్‌ దాదాపు 40 రోజులుగా తనిఖీలు జరుపుతున్నాయి. దాదాపు వంద హోటళ్లు, ఇతరత్రా సంస్థల్లో జరిపిన తనిఖీల్లో 90 శాతం నిబంధనల కనుగుణంగా లేవు. కిచెన్, స్టోర్‌రూమ్స్‌ శుభ్రంగా లేవు, బొద్దింకలు, ఇతరత్రా క్రిమికీటకాలు సంచరిస్తున్నాయి.ఎక్స్‌పైర్డ్‌ ఐటంలు అమ్ముతున్నారు. బ్రాండ్‌ పేరు ఒకటైతే వేరే సరుకు అమ్ముతున్నారు. తనిఖీల్లో భాగంగా నిబంధనలు, చట్టాల మేరకు 24 కేసులు నమోదు చేశారు. – చెరుపల్లి వెంకటేశ్‌జరిమానాలు ఇలా (రూపాయలో)..ట్రేడ్‌ లైసెన్సు ఉన్న ఫొటో కనపడకుంటే - 520 తాగునీరు ఉచితంగా ఇవ్వకుంటే - 1000 వ్యర్థాలను తడి,పొడిగా వేరు చేయకుంటే - 1000 టాయ్‌లెట్లు శుభ్రంగా లేకుంటే - 5000 టాయ్‌లెట్లు లేకుంటే - 2000 మురుగునీటి వ్యవస్థ లేకుంటే - 5000 భూగర్భ డ్రై నేజీ లేకుంటే - 10,000 ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లు లేకుంటే - 10.000 భవనం అక్రమ నిర్మాణమైతే - 10,000 పై అంతస్తుల్లో బట్టీలు ఏర్పాటు చేస్తే - 10,000 50 మైక్రాన్ల కంటే తక్కువ ప్లాస్టిక్‌ క్యారీబ్యాగ్స్‌ వాడితే - 10,000 కోల్డ్‌ చాంబర్‌లో నిర్ణీత ఉష్ణోగ్రత లేకుంటే - 500 వండిన ఆహారపదార్థాలు నిల్వ ఉంచితే - 5002023లో.. అందిన ఫిర్యాదులు : 2885 తనిఖీలు చేసినవి : 1685 జీహెచ్‌ఎంసీ పరిధిలో లేనివి : 1047 ఇతర కేటగిరీవి : 165 పెండింగ్‌ : 15 జీహెచ్‌ఎంసీలో ఉండాల్సిన ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు : 31 పనిచేస్తున్న ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు : 23గత మూడేళ్లలో..లైసెన్సుల జారీ : 33251 వసూలైన ఫీజు : రూ.9,71,02,700 స్ట్రీట్‌ వెండర్స్‌ ‘రిజిస్ట్రేషన్లు : 36334 వచ్చిన ఫీజు : రూ.59,48,270 ఫేడ్‌సేఫ్టీపై శిక్షణలిచ్చి జారీ చేసిన సర్టిఫికెట్లు : 1570 ఫిర్యాదు చేసేందుకు..జీహెచ్‌ఎంసీ పరిధిలో - foodsafetywing.ghmc@gmail.com - Phone no - 04021 11 11 11 దెబ్బతింటున్న కిడ్నీలు..పెచ్చుమీరుతున్న కల్తీ ఆహారంతో క్యాన్సర్‌ సమస్యలు పెరిగిపోతున్నాయి. ఇటీవలి కాలంలో కిడ్నీలు దెబ్బతింటున్నాయి. మనకు దొరికే ఉప్పు, పాలతో సహా రా మెటీరియల్‌ అంతా కల్తీనే. వీటిని రెస్టారెంట్లు, హోటళ్లలో మరింత కల్తీ చేస్తున్నారు. ఫుడ్‌ కలర్స్, కెమికల్స్‌ అన్నీ అనారోగ్యానికి దారి తీసేవే. ముఖ్యంగా బాయిల్డ్‌ అయిన ఆయిల్‌తో తయారు చేస్తున్న వంటకాలతో అనారోగ్యసమస్యలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. – హితశ్రీ రెడ్డి, డైటీషియన్, నిమ్స్‌కఠిన చర్యలుండాలి!తక్కువ మొత్తంలో పెనాల్టీలతో పరిస్థితి మారదు. కల్తీ నిర్ధారణ అయినప్పుడు చట్టం మేరకు కఠినచర్యలు తీసుకోవాలి. మొక్కుబడి తంతుగా ఏటా పదిరోజులో, నెల రోజులో కాకుండా తనిఖీలు నిరంతరం జరగాలి. వండిన ఆహారపదార్థాల్లోనే కాకుండా మసాలా దినుసుల్లోనూ కల్తీ జరుగుతోంది. విదేశాలకు పంపిస్తే వాటిని స్వీకరించకుండా వెనక్కు పంపిస్తున్నారు. ఫిర్యాదులకు ప్రత్యేక సెల్‌ ఉండాలి.– పద్మనాభరెడ్డి, ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌నిబంధనలు పాటించాలి..హోటళ్లు, తినుబండారాల దుకాణాల నిర్వాహకులు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏ, జీహెచ్‌ఎంసీ నిబంధనలు పాటించాలి. ఆరోగ్యానికి హాని కలిగించే రంగులు వాడొద్దు. పరిశుభ్రత పాటించాలి. ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు. కల్తీని గుర్తించినప్పుడు ప్రజలు ఫిర్యాదు చేయాలి.– కె. బాలాజీరాజు, అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌శిక్షణ ఉండాలి..ఇటీవలి కాలంలో హోటళ్ల గురించి తెలియని వారు సైతం పెట్టుబడి వనరుగా ఈ రంగంలోకి వస్తున్నారు. ఇంటీరియర్ల కోసం ఎంతో ఖర్చు చేస్తున్న వారు సిబ్బంది శిక్షణ గురించి పట్టించుకోవడం లేదు. రెస్టారెంట్ల ఓనర్లు, సిబ్బందికి అవగాహన ఉండాలి. ప్రతి ఇరవై మంది సిబ్బందికి ఒక ట్రైనర్‌ ఉండాలి. ఇటీవలి కాలంలో జీహెచ్‌ఎంసీ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఒక రోజు శిక్షణతో ఆన్‌లైన్‌పరీక్షతో సర్టిఫికెట్లు కూడా ఇస్తున్నారు. శిక్షణలు వినియోగించుకోవాలి.– తుమ్మల సంపత్‌ శ్రీనివాస్, ప్రెసిడెంట్, నేషనల్‌ రెస్టారెంట్స్‌ అసోసియేషన్‌

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement