భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు) | Sakshi
Sakshi News home page

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

Published Sat, May 4 2024 5:49 PM | Updated 30 Min Ago

1/12

ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టులో కీలక సభ్యుడు మిచెల్‌ స్టార్క్‌

2/12

పేస్‌ దళంలో ముఖ్యుడిగా ఉన్న స్టార్క్‌ ఆసీస్‌ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

3/12

ఆస్ట్రేలియా తరఫున నాలుగు సార్లు ప్రపంచకప్‌ టైటిల్‌ గెలిచిన ఘనత స్టార్క్‌ సొంతం.

4/12

ప్రపంచస్థాయి పేసర్లలో స్టార్క్‌ ముందు వరుసలో ఉంటాడనంలో సందేహం లేదు.

5/12

స్టార్క్‌ భార్య అలీసా హేలీ కూడా క్రికెటరే. ఆమె కూడా అంతర్జాతీయ క్రికెట్‌లో ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహిస్తోంది.

6/12

ప్రస్తుతం స్టార్క్‌ ఐపీఎల్‌-2024తో బిజీగా ఉన్నాడు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత స్టార్క్‌ ఐపీఎల్‌ వేలంలోకి రాగా.. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ రికార్డు ధరకు కొనుగోలు చేసింది.

7/12

ఇతర ఫ్రాంఛైజీలతో పోటీ పడి మరీ రూ. 24.75 కోట్లు ఖర్చు పెట్టి స్టార్క్‌ను సొంతం చేసుకుంది. తద్వారా క్యాష్‌ రిచ్‌ లీగ్‌ చరిత్రలో అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా ఈ ఆసీస్‌ పేసర్‌ రికార్డు సాధించాడు.

8/12

మరోవైపు.. స్టార్క్‌ సతీమణి అలిసా హేలీ వుమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో యూపీ వారియర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తోంది. రూ. 70 లక్షలకు ఆమెను కొనుగోలు చేసిన యూపీ వారియర్స్‌ కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించింది. విధ్వంసకర బ్యాటర్‌గా.. బౌలర్‌గానూ హేలీకి పేరుంది.

9/12

హేలీ యూపీకి ఆడేటపుడు స్టార్క్‌ ఆ జట్టు ధరించి ఆమెను ఉత్సాహపరిచాడు. తాజాగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా హైలీ కేకేఆర్‌ జెర్సీ ధరించి స్టార్క్‌ను చీర్‌ చేసింది.

10/12

ఇక ఇప్పటిదాకా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయిన స్టార్క్‌.. భార్య హాజరైన మ్యాచ్‌లో నాలుగు వికెట్లతో చెలరేగి కేకేఆర్‌ను గెలిపించడం విశేషం.

11/12

ఇక ఐసీసీ టీ20-2020, వన్డే- 2022 వరల్డ్‌కప్‌లో ఆసీస్‌ తరఫున హేలీ అదరగొట్టింది.

12/12

Advertisement
Advertisement