రంగారెడ్డి జిల్లా: హైదరాబాద్ కమిషనరేట్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బడంగ్పేట్లో గుర్తుతెలియని పదార్థం పేలడంతో అనూప్(43) అనే కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ఇటీవలే కోల్కతా నుంచి ఉపాధి కోసం వచ్చినట్లు సమాచారం. పేలుడు తీవ్రతకు అతడి శరీర భాగాలు దూరంగా ఎగిరిపడ్డాయని స్థానికులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, పేలుడుకు కారణమైన పదార్థంపై దర్యాప్తు చేస్తున్నారు.
ADVERTISEMENT
ADVERTISEMENT