న్యూఢిల్లీ: 12వ తరగతి బోర్డు పరీక్షల జవాబు పత్రాల వెరిఫికేషన్, రీ–వాల్యుయేషన్ ఫలితాలను సీబీఎస్ఈ ఆదివారం విడుదల చేసింది. మొదటి విడతలో భాగంగా మొత్తం దరఖాస్తుల్లో 87 శాతానికి పైగా ఫలితాలను ప్రకటించినట్లు తెలిపింది. విడతల వారీగా మిగతా దరఖాస్తుల ఫలితాలను కూడా వెల్లడిస్తామని, మొత్తం ప్రక్రియ కూడా తొందరలోనే ముగియనుందని ఎక్స్‌లో ప్రకటించింది. విద్యార్థులు తమ ఫలితాలను సీబీఎస్ఈ అధికారిక వెబ్సైట్లో చూసుకోవచ్చని తెలిపింది. రీ వాల్యుయేషన్‌ను పక్కాగా చేపట్టామని, ఈ విషయంలో వచ్చే వదంతులను నమ్మవద్దని కోరింది.
ADVERTISEMENT
ADVERTISEMENT