వియత్నాంలోని ఫు క్వాక్ దీవి సమీపంలో పలువురు భారతీయ పర్యాటకులతో ప్రయాణిస్తున్న ఓ పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మందికి పైగా మృతి చెందారు. ప్రమాద సమయంలో బోటులో 32 మంది పర్యాటకులు ఉన్నారు. మృతుల్లో తెలుగు రాష్ట్రాల టూరిస్టులు కూడా ఉన్నారు. మచిలీపట్నానికి చెందిన జయశ్రీ మృతి చెందారు. ఆమె భర్త కిశోర్ పరిస్థితి విషమంగా ఉంది.
ఈ ఘటనపై స్థానిక అధికారులతో సంప్రదింపులు కొనసాగిస్తున్నామని, పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. “కొన్ని గంటల క్రితం వియత్నాంలోని ఫు క్వాక్ దీవి సమీపంలో పలువురు భారతీయ పర్యాటకులతో ప్రయాణిస్తున్న ఓ పడవ బోల్తా పడింది. స్థానిక అధికారులు గాలింపు, సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నాం” అని వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం ఎక్స్‌లో పోస్టు చేసింది.