ఏపీ డీఎస్సీలో జరిగిన అక్రమాలపై విచారణ జరపాలంటూ వైఎస్సార్సీపీ యూత్ వింగ్ నిరసనలు చేపట్టింది రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కాగా, డీఎస్సీ పేపర్ లీక్, స్పోర్ట్స్ కోటాలో పోస్టులు అమ్ముకోవడంపై అభ్యర్థులు, యూత్ వింగ్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ, మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
విజయవాడ:
కూటమి సర్కారు తీరుపై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్
విద్యాశాఖలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన నోటిఫికేషన్లో మరిన్ని పోస్టులు కలిపి మెగా డీఎస్సీ ఇచ్చారు.
మెగా డీఎస్సీలో తప్పులే కనిపిస్తున్నాయి.
ప్రభుత్వంలో అన్ని పారదర్శకం అని చెబుతారు.. కానీ అన్ని గుట్టుగానే జరుగుతుంది.
కలెక్టర్ కార్యాలయంలో పేర్లు, ర్యాంకులతో లిస్టులు పెట్టాలి.
కలెక్టర్ కార్యాలయంలో మెరిట్ లిస్ట్ లు పెట్టాలి.
ఆన్ లైన్ లో చూసిన ప్రతిసారి లిస్టులు మారిపోతున్నాయి.
చదువు రానివాడు చూసినా అర్థమయ్యే రితీలో ఆన్ లైన్లో ఉండాలి.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా:
డీఎస్సీలో అక్రమాలను నిరసిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో అమలాపురంలో భారీ ర్యాలీ
విద్యాశాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన నేతలు
జరిగిన ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలన్న వైఎస్సార్సీపీ నేతలు
కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీ అనురాధ , కో-ఆర్డినేటర్లు పి.రాజేశ్వరి, సూర్యప్రకాశ్ గన్నవరపు శ్రీనివాస్, ఇతర వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు
నెల్లూరు:
మెగా డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలంటూ నెల్లూరు నగరంలో వైఎస్సార్సీపీ నిరసన ర్యాలీ .
500 మంది యువత , నిరుద్యోగులతో వీఆర్సీ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించిన యువత .
యువత, నిరుద్యోగుల నిరసనలతో అట్టుడికిన కలెక్టరేట్

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి , వైస్సార్సీపీ నెల్లూరు సిటీ ఇన్ చార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఇన్ చార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి
మెగా డీఎస్సీ అక్రమాలతో అభ్యర్థులు తీవ్రంగా దగాపడ్డారు:ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
బాబు వస్తే జాబ్ వస్తుందని ఓట్లు దండుకున్నారు: జక్కంపూడి రాజా
మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ
లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకున్నారు
లక్షలు ఖర్చుచేసి రోజు 20 గంటలు చదువుకున్న నిరుద్యోగులకు అన్యాయం చేశారు.
రాష్ట్రంలో లోకేష్ చేయని దోపిడి అవినీతి అంటూ ఏది లేదు..
హెరిటేజ్ లో పాలు అమ్ముకునట్లు డీఎస్సీ ఉద్యోగాలు అమ్ముకున్నారు
నిరుద్యోగుల కన్నీళ్లు మీకు కనిపించడం లేదా?
లోకేష్‌ను వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలి
పవన్ కళ్యాణ్ కు నిజాయితీ ఉంటే వెంటనే స్పందించాలి
డీఎస్సీ ఉద్యోగాల భర్తీ.. ఎన్టీఆర్ ట్రస్టు భవన్ నుంచి జరిగింది: కేకే రాజు
ఒక్కొక్క పోస్ట్ ను రూ. 15 లక్షల నుంచి 20 లక్షల వరకు అమ్ముకున్నారు.
డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలి
లోకేష్ మంత్రి పదవికి రాజీనామా చేయాలి.
డీఎస్సీపై చంద్రబాబు సిగ్గు లేకుండా అబద్ధాలు మాట్లాడుతున్నారు
ప.గో జిల్లా:
కూటమి ప్రభుత్వం నిర్వహించిన దగా డీఎస్సీ మెగా కాదు.. దగా డీఎస్సీ
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను వెంటనే బర్త్ రఫ్ చేయాలి
వైఎస్సార్సీపీ మహాధర్నా చలో కలెక్టరేట్ ర్యాలీలో పాల్గొన్న వైఎస్సార్సీపీ శ్రేణులు
మహాధర్నా చలో కలెక్టరేట్ ర్యాలీలో పాల్గొన్న ఆచంట నియోజకవర్గ పరిశీలకులు శ్రీమతి మేడపాటి షర్మిళ రెడ్డి తదితర పార్టీ శ్రేణులు
అనంతరం జిల్లా కలెక్టర్ ఆఫీసులో వినతి పత్రం అందజేసిన నేతలు
రాజమండ్రి:
స్థానిక రాజమండ్రి రూరల్ వైఎస్సార్సీపీ ఆఫీసు నుండి చలో కలెక్టరేట్ ఆఫీస్ వరకు మెగా కాదు-దగా డీఎస్సీ మహాధర్నా కార్యక్రమం
మాజీ మంత్రివర్యులు తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం నిర్వహించిన దగా డీఎస్సీ మెగా కాదు-దగా డీఎస్సీపై నిరసన
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను వెంటనే బర్త్ రఫ్ చేయాలి
మహాధర్నా చలో కలెక్టరేట్ ర్యాలీలో జక్కంపూడి విజయలక్ష్మి మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు,, మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి , రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ తదితర నేతలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు.
తూర్పుగోదావరి జిల్లా...
- రాజమండ్రిలో భారీ ర్యాలీ
- బొమ్మూరులో పార్టీ ఆఫీసు నుండి జిల్లా కలెక్టరేట్ వరకు కొనసాగిన నిరసన ర్యాలీ
- వేణు గోపాలకృష్ణ కామెంట్స్..
- ఇది మెగా డీఎస్సీ కాదు దగా డీఎస్సీ.
- పోస్టులను అమ్ముకున్నారు
- డీఎస్సీ నిర్వహణలో అనేక అవకతవకలు జరిగాయి. వాటిపై పూర్తిస్థాయిలో విచారణ జరగాలి
- స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇస్తామని అభ్యర్థులను దారుణంగా మోసం చేశారు
- డీఎస్సీ నిర్వహణపై పూర్తిస్థాయిలో సీబీఐతో విచారణ జరిపించాలి
గుంటూరు..
- వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు చైతన్య కామెంట్స్
- మెగా డీఎస్సీ.. దగా డీఎస్సీ అయింది
- అనేక అవకతవకలు జరిగాయి.
- డీఎస్సీలో భారీ అవినీతి జరిగింది
- నిరుద్యోగులకు న్యాయం చేయాలి
- డీఎస్సీలో జరిగిన అవకతవకలు, అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలి
మాజీ మంత్రి అంబటి రాంబాబు కామెంట్స్
- డీఎస్సీపై లోకేష్ ఎందుకు సమాధానం చెప్పడం లేదు?
- ముఖ్యమంత్రి, లోకేష్ సమాధానం చెప్పాలి.
- లోకేష్‌కు సిగ్గుంటే సమాధానం చెప్పి రాజీనామా చెప్పాలి
- దగా డీఎస్సీ నిర్వహించిందుకు సీఎంగా ప్రమోషన్ ఇస్తారేమో చూడాలి.
- లోకేష్ రాజీనామా చేయాలి
- మిస్టర్ లోకేష్ నోరు విప్పి మాట్లాడాలి
- అక్రమాలు జరిగాయని చెబితే మాట్లాడితే దాడులు చేసే పరిస్థితి ఉంది.
- డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి.
కృష్ణా జిల్లా..
- డీఎస్సీ అక్రమాలపై విచారణ జరిపించాలని కోరుతూ మచిలీపట్నంలో ఛలో కలెక్టరేట్
- లక్ష్మీ టాకీస్ సెంటర్ నుంచి జిల్లా కలెక్టరేట్ వరకూ ర్యాలీ..
- ర్యాలీలో పాల్గొన్న కృష్ణాజిల్లా యువజన విభాగం అధ్యక్షుడు మెరుగుమాల కాళీ, మచిలీపట్నం వైఎస్సార్సీపీ ఇంఛార్జి పేర్ని కిట్టు
- జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చిన యువజన విభాగం నాయకులు
- పేర్ని కిట్టు కామెంట్స్..
- సకల శాఖా మంత్రి లోకేష్ తన చేతవాటం ప్రదర్శిస్తున్నాడు
- డబ్బులిస్తే ఏ ఉద్యోగమైనా అమ్ముకోవచ్చని లోకేష్ ను చూస్తే తెలుస్తోంది
- డీఎస్సీలో ఉద్యోగాలు కొనుక్కోవచ్చని లోకేష్ నిరూపించారు
- ముందు మీ శాఖలో అవినీతి తగ్గించు లోకేష్
- తర్వాత ఎదుటి వారి గురించి వెటకారంగా మాట్లాడొచ్చు
- స్పోర్ట్స్ కోటాలో డబ్బులిచ్చిన వారికి ఉద్యోగాలిచ్చారు
- రాత్రికి రాత్రి సర్టిఫికెట్లు పుట్టించడం ఉద్యోగాలు తీసుకోవడం
- నీపేరు లోకేష్ కాదు లో క్యాష్
- డీఎస్సీ అక్రమాల పై మా పోరాటం ఆగదు
- నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకూ పోరాడుతాం
విశాఖ..
- జక్కంపూడి రాజా కామెంట్స్..
- డీఎస్సీ మోసాలపై పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు?.
- పవన్ కాపులకు ఎందుకు వ్యతిరేకమో చెప్పాలి.
- చంద్రబాబు, లోకేష్ దగ్గర మార్కులు కోసమే పవన్ వ్యాఖ్యలు.
- డీఎస్సీ మోసాల గురించి మాట్లాడి పవన్ రియల్ హీరో అనిపించుకోవాలి.
- విద్యా శాఖ మంత్రి లోకేష్ కాబట్టి పవన్ కళ్యాణ్ నోరు మెదపడం లేదు..
- డీఎస్సీ అవకతవకలపై నోరు మెదపకపోతే చరిత్రహీనుడిగా మిగిలిపోతావు.
- వైఎస్ జగన్ డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే పబ్లిసిటీ కోసం దాన్ని రద్దు చేశారు.
- కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దగా డీఎస్సీ తీశారు.
- లక్షలాది రూపాయలు ఖర్చు చేసి నిరుద్యోగులు ప్రిపేర్ అయ్యారు.
- నిరుద్యోగుల ఆకలి కేకలు లోకేష్‌కు వినిపించలేదా?.
- డీఎస్సీ పేరుతో లోకేష్ కొట్లాది రూపాయలు సంపాదించారు ..
- స్పోర్ట్స్ కోట పేరుతో లక్షల రూపాయలకు ఉద్యోగాలు అమ్ముకున్నారు.
- హెరిటేజ్‌లో పాలు పెరుగు అమ్ముకున్నట్లు డీఎస్సీ ఉద్యోగాలు అమ్ముకున్నారు
- లోకేష్ సీబీఐకు విచారణకు ఒప్పుకోవాలి.
- లోకేష్ మంత్రి పదవికి రాజీనామా చేయాలి..
- టీచర్ పోస్టులు అమ్ముకున్నట్లు ఆడియో వీడియోలు బయటికి వచ్చాయి..
- నిరుద్యోగ భృతి పేరుతో మోసం చేశారు..
- వాలంటీర్లకు జీతాలు పెంచుతామని చెప్పి ఉద్యోగాల నుంచి తీసేశారు.
- ఎన్నికల ముందు కాపులు సంఖ్య బలం గురించి మాట్లాడిన పవన్ ఇప్పుడూ కాపులతో నాకేం పనిలేదు అంటున్నాడు.
- కోట్లు ఖర్చు పెట్టడానికి కాపులు కావాలి కానీ ఎన్నికల తర్వాత వాళ్ళు అవసరమే లేదా?.
- అధికారంలోకి వచ్చిన తర్వాత నీ విధానం చూసి కాపులు ఆవేదనలో ఉన్నారు.
అనంతపురం..
- డీఎస్సీ అక్రమాలపై కొనసాగుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట
- వైఎస్సార్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి
- భారీగా తరలి వచ్చిన విద్యార్థులు, యువజన విభాగం నేతలు
- డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్
- డీఎస్సీ అక్రమాలకు కారణమైన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను భర్తరఫ్ చేయాలని డిమాండ్
- టీడీపీ కూటమి సర్కార్ వ్యతిరేకంగా నినాదాలు
- ఉపాధ్యాయ పోస్టులు అమ్ముకున్నారని ఆగ్రహం
తిరుపతి..
- తిరుపతి కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన
- తిరుపతి కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో ముట్టడి
- పార్టీ విద్యార్థి విభాగం, యువజన విభాగం ఆధ్వర్యంలో నిరసన
- పద్మావతిపురం నుంచి కలెక్టరేట్ వరకు భూమన అభినయ్ రెడ్డి నేతృత్వంలో బైక్ ర్యాలీ, నిరసన
- డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్
- ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ పదవికి రాజీనామా చేయాలని నినాదాలు.
- టీచర్ పోస్టులను అమ్ముకుని మెరిట్లో ఉన్న నిరుద్యోగులకు అన్యాయం చేశారు అంటూ ఆగ్రహం
- సీఎం చంద్రబాబు రాజీనామా చేయాలి.. డౌన్ డౌన్ అంటూ నినాదాలు,
