పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ‘అర్నబ్’ అతి తీవ్ర తుపానుగా బలపడింది. వేగంగా కదులుతూ.. దూసుకొస్తుంది. గడిచిన 6 గంటల్లో గంటకు 20 కి.మీ వేగంతో కదులుతున్న తుపాను.. ప్రస్తుతానికి విశాఖకు 170 కి.మీ, కాకినాడకు 140 కి.మీ, బాపట్లకు 300 కి.మీ దూరంలో తుపాన్ కేంద్రీకృతమై ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
Cyclone Arnab Updates:
విజయవాడ
- కొనసాగుతున్న అర్నబ్ ల్యాండ్ ఫాల్ ప్రక్రియ
- మరో మూడు గంటల్లో పూర్తిగా తీరం దాటనున్న అర్నబ్
- అర్నబ్ ప్రభావంతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో గాలులతో కూడిన భారీ వర్షం
- పలు గ్రామాలకు నిలిచిపోయిన విద్యుత్ సరఫరా
- అంధకారంలో గ్రామాలు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
- జిల్లాను అతలాకుతలం చేస్తున్న ఆర్నాబ్ తుఫాన్
- జిల్లా కేంద్రం అమలాపురం ముమ్మిడివరం కాట్రేనికోన ఉప్పలగుప్తం సఖినేటిపల్లి మండలాల్లో తుఫాన్ బీభత్సం
- పెద్ద సంఖ్యలో రోడ్లపై కూలిపోయిన చెట్లు, నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు
- ముందస్తు ఏర్పాట్లతో ఎప్పటికప్పుడు కూలిన చెట్లు తొలగిస్తున్న సిబ్బంది
- బిక్కుబిక్కుమంటున్న తీర ప్రాంత వాసులు
- కోనసీమ ,తూర్పుగోదావరి జిల్లాల్లో పూర్తిగా నిలిచిపోయిన విద్యుత్ సరఫరా
- యానాం - ఎదుర్లంక బ్రిడ్జిపై నిలిచిపోయిన రాకపోకలు
- అర్నబ్ తుఫాను తీరాన్ని తాకే ప్రక్రియ మొదలైంది
- బుధవారం ఉదయం 4గం.ల వరకూ ఈ ప్రక్రియ కొనసాగుతుంది
- తుఫాను తీరాన్ని తాకే సమయంలో బలమైన ఈదురు గాలులు, భారీ వర్షం కురిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది
- అర్నాబ్ తుఫాన్ ప్రభావంతో కాకినాడలో లోతట్టు ప్రాంతాలు జలమయం
- ముత్తానగర్,మహలక్ష్మీ నగర్ లో చేరిన వరద నీరు
- ఈదురు గాలులకు విద్యుత్ సరఫరా నిలిపివేయ్యడంతో అవస్ధలు పడుతున్న ప్రజలు
- పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అర్నబ్ తుపాన్
- గడిచిన 6 గంటల్లో గంటకు 17కిమీ వేగంతో కదులుతున్న తుపాన్
- కాకినాడకు 70కిమీ, నర్సాపూర్ కు 60కిమీ, తునికు 120కిమీ
- మచిలీపట్నంకు 120కిమీ, విశాఖకు 190కిమీ దూరంలో కేంద్రీకృతం
- ప్రభావంతో తూగో, పగో, కాకినాడ, కోనసీమ, అనకాపల్లి జిల్లాల్లో రాత్రికి భారీ నుండి అతిభారీ వర్షాలు
- గంటకు 145- 155 కిమీ గరిష్టంగా 170కిమీ వేగంతో తీవ్రమైన ఈదురుగాలులు
- తెల్లవారుజామున 2-4 గంటల మధ్య యానాం సమీపంలో తీరం దాటే అవకాశం
- సురక్షితంగా ఇంట్లోనే ఉండండి : ప్రఖర్ జైన్, ఎండీ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ
ఏపీలో అర్నబ్ తుపాన్ బీభత్సం
- యానాం సమీపంలో తీరాన్ని తాకిన అర్నబ్ తుపాన్
- తీరాన్ని దాటేందుకు మరో ఆరు గంటలు సమయం పట్టే అవకాశం
- తెల్లవారుజామున 4 గంటల సమయంలో తీరందాటే చాన్స్
విశాఖ
తుపాను కారణంగా విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు
రాత్రి 9 గంటల తర్వాత అనవసర ప్రయాణాలపై నిషేధం
గాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో నిర్ణయం తీసుకున్న జిల్లా కలెక్టర్
దువ్వాడ సమీపంలోని మంగళపాలెంలో విషాదం
బీకర గాలలకు వర్షపు నీటిలో తెగి పడిన విద్యుత్ వైర్లు
నీటిలోకి వెళ్లడంతో విద్యుత్ షాక్ కి గురై అమరపిని దేముడు (65) మృతి
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
జిల్లా కలెక్టర్ ఆర్.మహేశ్ కుమార్ సూచనలు
- ఈరోజు రాత్రి 9 గంటల నుంచి రేపు ఉదయం 9 గంటల వరకు ప్రజలు ఇంటి నుంచి బయటకు రావద్దు
- తుపాను తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం
- చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయే ప్రమాదం
- కోనసీమ జిల్లాలో ఐ.పోలవరం నుంచి రాజోలు మధ్యలో తుపాను తీరం దాటే అవకాశం
తూ.గో జిల్లాలో అర్నబ్ తుపాన్ ఎఫెక్ట్
- కోనసీమ ప్రాంతంలో కుండపోత
- తీర ప్రాంతంలో ఎగసిపడుతున్న అలలు
- అంతర్వేది తీర ప్రాంతంలో బారికేడ్లు ఏర్పాటు
- సందర్శకులను నిలిపివేసిన అధికారులు
- పునరావాస కేంద్రాలకు లంక గ్రామస్తులు తరలింపు
ఏపీలో అర్నబ్ తుపాన్ బీభత్సం
- అర్నబ్.. పెను తుపాను మారే ప్రమాదం
- గంటకు 200 కి.మీ వేగంతో భీకర గాలులు
- భారీ ఈదురుగాలులకు విరిగిపడ్డ చెట్లు, హోర్డింగ్‌లు
- ప్రస్తుతం కాకినాడకు 140 కి.మీ, విశాఖకు 170 కి.మీ, బాపట్లకు 300 కి.మీ దూరంలో తుపాన్ కేంద్రీకృతం
- విశాఖలో భారీ వర్షం, ఈదురుగాలులు
- పలు ప్రాంతాల్లో నేలకొరిగిన భారీ వృక్షాలు
తీర ప్రాంతాలకు హై అలర్ట్
- రేపు యానాం దగ్గర అర్నాబ్ తుపాన్ తీరం దాటే అవకాశం
- తీరం దాటే సంయంలో ఉవ్వెత్తున ఎగిసి పడనున్న అలలు
- యానాం నుంచి కాకినాడ వరకూ ఉప్పెన హెచ్చరికలు
- ఉప్పాడ, సుబ్బంపేట, మాయాపట్నం, కోనపాప పేట, అమీనాబాద్‌లో భారీగా అలలు
- ఉప్పాడ రోడ్డులో రాకపోకల నిలిపివేత
- ఉప్పాడలో ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు
విశాఖ
విశాఖలో భారీ ఈదురు గాలులు..
పలు ప్రాంతాల్లో నేలకొరిగిన భారీ వృక్షాలు..
ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం..
ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్
-
విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటన
-
పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అర్నబ్ తుపాన్
-
గడిచిన 6 గంటల్లో గంటకు 20 కిమీ వేగంతో కదిలిన అతి తీవ్ర తుపాన్
-
ప్రస్తుతానికి విశాఖపట్నంకు 170కి.మీ., కాకినాడకు 180 కి.మీ., మచిలీపట్నంకు 270 కి.మీ., బాపట్లకు 350 కి.మీ దూరంలో కేంద్రీకృతం
-
విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, కోనసీమ, అనకాపల్లి జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు
-
సాయంత్రం నుంచి పోలవరం, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో భారీ వర్షాలు
-
తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు
-
రేపు ఉదయానికి బాపట్ల- విశాఖ మధ్య యానాంకు సమీపంలో తీరం దాటే అవకాశం
-
తీరం దాటే సమయంలో 125-135 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం
-
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ప్రఖర్ జైన్, ఎండీ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ
విమాన రాకపోకలకు అంతరాయం
-
విశాఖపట్నం: అర్నబ్ తుపాను కారణంగా విమాన రాకపోకలకు అంతరాయం
-
భోగాపురం ఎయిర్ పోర్ట్‌కు నిలిచిన విమాన రాకపోకలు
-
28 విమాన సర్వీసులను రద్దు చేసిన విమానయాన శాఖ
-
ఉదయం టేకాఫ్ అయిన 5 ఫ్లైట్స్ మినహా అన్ని విమాన సర్వీసులు రద్దు
-
రేపు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని అంచనా
గన్నవరంలో 4 విమాన సర్వీసులు రద్దు
-
కృష్ణా జిల్లా: గన్నవరం ఎయిర్ పోర్టుపై అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్
-
తుపాను హెచ్చరికలతో గన్నవరం రావాల్సిన నాలుగు విమాన సర్వీసులు రద్దు
-
బెంగుళూరు, చెన్నై, కడప, విశాఖపట్నం ఇండిగో విమాన సర్వీసులు రద్దు
ఇళ్ల నుంచి బయటకు రావొద్దు
-
తుపాను సమయంలో పెనుగాలులు వీచే సూచనలున్నాయి
-
ఆ సమయంలో ప్రజలెవ్వరూ ఇళ్ల నుంచి బయటకు రాకుండా జాగ్రత్తలు పాటించాలి
-
అధికారులు కోరితే వారు చెప్పినట్లు మీకు దగ్గరలోని తుపాను షెల్టర్లలోకి వెళ్లాలి
-
తుపాన్ సమయంలో సముద్రం చెంతకు వెళ్ల రాదు
-
నదుల, కుంటల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలి
-
వదంతులు, పుకార్లను నమ్మొద్దు
-
కేవలం అధికారుల నుంచి వచ్చే హెచ్చరికలు సూచనలు మాత్రమే పాటించండి
-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ), ఆర్టీజీఎస్ ఇచ్చే హెచ్చరికలనే అనుసరించండి
-
సామాజిక మాధ్యమాల్లో వచ్చే అనధికారిక సమాచారాన్ని నమ్మకండి
-
ప్రజలకు ఆర్టీజీఎస్, ఏపీఎస్‌డీఎంఏ అధికారుల సూచన
అర్నాబ్ ఎఫెక్ట్.. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కీలక నిర్ణయం
-
తుపాను ప్రభావంతో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కీలక నిర్ణయం..
-
నేడు 11 రైళ్లు రద్దు..
-
నిన్న 53 రైళ్లను రద్దు చేసిన రైల్వే శాఖ..
ఉప్పెన వచ్చే అవకాశం!
-
విశాఖ : తీరం వైపుకు దూసుకొస్తున్న అర్నాబ్ తుపాను
-
కాకినాడ పోర్టుకు గ్రేట్ డేంజర్ సిగ్నల్ 10 జారీ
-
విశాఖ, గంగవరం 9, మచిలీపట్నం, నిజాంపట్నం 8వ నెంబరు గ్రేట్ డేంజర్ సిగ్నల్ ఇచ్చిన ఐఎండీ
-
తీరం దాటే ప్రాంతానికి ఇరువైపులా 100 కిలోమీటర్ల పరిధిలో ఉప్పెన వచ్చే అవకాశం
అల్లకల్లోలంగా మారిన ఉప్పాడ- కాకినాడ తీరం
-
ఉవ్వెత్తున ఎగసిపడుతున్న రాకాసి అలలు
-
20 మీటర్ల వరకు సముద్రం చొచ్చుకు రావడంతో బీచ్ రోడ్డుపై ఎగసిపడుతున్న అలలు
-
అలల దాటికి బీచ్ కొట్టుకుపోయిన రోడ్డులో పార్క్ చేసిన వాహనాలు
-
ఉప్పాడ-కాకినాడ బీచ్ రోడ్డు పై రాకపోకలను నిషేధించిన పోలీసులు
అర్నబ్ ఎఫెక్ట్.. విశాఖలో ఈదురు గాలులు..
-
ఉదయం నుంచి కురుస్తున్న వర్షం
-
ఈదురు గాలులకు కులుతున్న చెట్లు
-
అంగడి దిబ్బలో ఇంటిపై కూలిన చెట్లు
-
ఆంధ్రా యూనివర్సిటీలో రోడ్డుకు అడ్డంగా పడిన చెట్టు
-
భారీ గాలులకు చిరిగిపోతున్న హోర్డింగ్స్
-
విశాఖ నగరంలో ఉన్న పర్యాటక ప్రాంతాలన్నీ మూసివేత..
-
ఆంధ్రా యూనివర్సిటీకి పది రోజులు సెలవులు
-
విద్యా సంస్థలకు రెండు రోజులపాటు సెలవు
-
అవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావొద్దు: అధికారులు
-
కొండవాలు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశం
-
మూడు రోజులపాటు మత్స్యకారులు వేటకు వద్దని ఆదేశం.
-
ఆర్కే బీచ్ లో ముందుకు చొచ్చుకొచ్చిన సముద్రం
-
ఎగసిపడుతున్న అలలు
గంటకు 22 కి.మీ వేగంతో..
-
పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అర్నబ్ తుపాను
-
గడిచిన 6 గంటల్లో గంటకు 22 కి.మీ వేగంతో కదిలిన అతి తీవ్ర తుపాను
-
ప్రస్తుతానికి విశాఖపట్నంకు 260 కి.మీ, కాకినాడకు 300 కి.మీ, మచిలీపట్నంకు 390 కి.మీ, బాపట్లకు 460 కి.మీ దూరంలో కేంద్రీకృతం
-
దీని ప్రభావంతో నేడు, రేపు కొన్నిప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు
-
తుపాను దగ్గరకు వచ్చే కొద్ది పెరగనున్న తీవ్రత
-
ప్రజలు సురక్షితంగా ఇంట్లోనే ఉండాలి: విపత్తుల నిర్వహణ సంస్థ
అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. 53 రైళ్లు రద్దు
-
విశాఖపట్నం–కాకినాడ పోర్టు, పార్వతీపురం రైళ్లు కూడా రద్దు
-
అక్టోబర్ 27, 28 తేదీల్లో వివిధ మార్గాల్లో నడవాల్సిన మొత్తం 53 రైలు సర్వీసులు రద్దు
👉అక్టోబర్ 27, 28 తేదీల్లో రద్దయిన రైళ్లు:
67261 – రాజమండ్రి నుంచి విజయవాడ
67263 – విజయవాడ నుంచి మచిలీపట్నం
67264 – మచిలీపట్నం నుంచి విజయవాడ
67265 – విజయవాడ నుంచి మచిలీపట్నం
67271 – మచిలీపట్నం నుంచి గుడివాడ
67272 – గుడివాడ నుంచి మచిలీపట్నం
67252 – మచిలీపట్నం నుంచి గుడివాడ
67253 – గుడివాడ నుంచి మచిలీపట్నం
67254 – మచిలీపట్నం నుంచి గుడివాడ
67255 – గుడివాడ నుంచి మచిలీపట్నం
67256 – మచిలీపట్నం నుంచి విజయవాడ
17267 – కాకినాడ పోర్టు నుంచి విశాఖపట్నం
17268 – విశాఖపట్నం నుంచి కాకినాడ పోర్టు
07267 – పార్వతీపురం నుంచి విశాఖపట్నం
07268 – విశాఖపట్నం నుంచి పార్వతీపురం
👉అక్టోబర్ 27న రద్దయిన రైళ్లు:
67258 – విజయవాడ నుంచి నరసాపురం
67246 – నరసాపురం నుంచి రాజమండ్రి
17269 – విజయవాడ నుంచి నరసాపురం
17264 – నరసాపురం నుంచి భీమవరం జంక్షన్
67257 – విజయవాడ నుంచి నరసాపురం
17257 – విజయవాడ నుంచి కాకినాడ పోర్టు
67202 – విజయవాడ నుంచి రాజమండ్రి
67267 – విజయవాడ నుంచి మచిలీపట్నం
67247 – నరసాపురం నుంచి గుంటూరు జంక్షన్
67276 – నరసాపురం నుంచి విజయవాడ
67301 – రాజమండ్రి నుంచి కాకినాడ పోర్టు
67285 – రాజమండ్రి నుంచి విశాఖపట్నం
67286 – విశాఖపట్నం నుంచి రాజమండ్రి
👉అక్టోబర్ 28న రద్దయిన రైళ్లు:
67266 – మచిలీపట్నం నుంచి విజయవాడ
67275 – విజయవాడ నుంచి భీమవరం జంక్షన్
67277 – భీమవరం జంక్షన్ నుంచి నిడదవోలు జంక్షన్
67278 – నిడదవోలు జంక్షన్ నుంచి భీమవరం జంక్షన్
67244 – నరసాపురం నుంచి నిడదవోలు జంక్షన్
67245 – నిడదవోలు జంక్షన్ నుంచి నరసాపురం
17270 – నరసాపురం నుంచి విజయవాడ
67268 – మచిలీపట్నం నుంచి విజయవాడ
67249 – గుంటూరు జంక్షన్ నుంచి రేపల్లె
67250 – రేపల్లె నుంచి గుంటూరు జంక్షన్
67248 – గుంటూరు జంక్షన్ నుంచి విజయవాడ
67269 – విజయవాడ నుంచి మచిలీపట్నం
67270 – మచిలీపట్నం నుంచి విజయవాడ
67281 – విజయవాడ నుంచి భీమవరం జంక్షన్
67283 – భీమవరం జంక్షన్ నుంచి నిడదవోలు జంక్షన్
67284 – నిడదవోలు జంక్షన్ నుంచి భీమవరం జంక్షన్
67282 – భీమవరం జంక్షన్ నుంచి విజయవాడ
67262 – విజయవాడ నుంచి రాజమండ్రి
67302 – కాకినాడ పోర్టు నుంచి రాజమండ్రి
17258 – కాకినాడ పోర్టు నుంచి విజయవాడ
67229 – విజయవాడ నుంచి గుంటూరు జంక్షన్
67223 – గుంటూరు జంక్షన్ నుంచి రేపల్లె
67224 – రేపల్లె నుంచి తెనాలి జంక్షన్
67222 – తెనాలి జంక్షన్ నుంచి విజయవాడ
67251 – భీమవరం జంక్షన్ నుంచి మచిలీపట్నం
👉ప్రయాణికులు తమ ప్రయాణానికి సంబంధించిన రైలు నంబర్, తేదీని పరిశీలించి, బయలుదేరే ముందు అధికారిక రైల్వే విచారణ కేంద్రాల ద్వారా తాజా సమాచారాన్ని నిర్ధారించుకోవాలని సూచించారు. రైళ్ల రద్దు కారణంగా కలిగే అసౌకర్యానికి రైల్వే శాఖ విచారం వ్యక్తం చేసింది.
అల్లకల్లోలంగా సముద్రం.. రుషికొండ బీచ్ మూసివేత
-
విశాఖ తీరంలో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలు..
-
10 మీటర్ల ముందుకు చొచ్చుకు వచ్చిన సముద్రం..
-
భారీగా కోతకు గురవుతున్న తీరం..
-
ప్రమాదకరంగా మారడంతో బీచ్‌ల్లో పర్యాటకుల ప్రవేశంపై ఆంక్షలు
-
రుషికొండ బీచ్ మూసివేత
కోనసీమ జిల్లాపై ‘అర్నబ్’ ఎఫెక్ట్
-
తుపాను తీవ్రత కోనసీమపై పడే అవకాశం
-
ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తున్న అధికారులు
-
తీర ప్రాంత గ్రామాలపై విస్తృతమైన ప్రభావం
-
సముద్రంలో నీటిమట్టం ఒకటిన్నర మీటరు వరకు పెరిగే అవకాశం ఉందంటున్న అధికారులు
-
తీర ప్రాంత గ్రామాల ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలింపు
-
రెండు రోజులపాటు పాఠశాలలకు సెలవులు
-
కాట్రేనికోన, ఐ.పోలవరం తీర ప్రాంత మత్యకార గ్రామంలో ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికారులు.
-
తుపాను తీవ్రతపై ఎప్పటికి తీరప్రాంత గ్రామాల్లో అధికారుల ప్రచారం
తుపాను ఎఫెక్ట్.. నేడు, రేపు విద్యా సంస్థలకు సెలవు
-
కాకినాడ జిల్లా: ఉప్పాడ-కాకినాడ బీచ్ రోడ్డులో రాకపోకల బంద్
-
తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు
-
జిల్లా వ్యాప్తంగా 101 పునరావాస కేంద్రాలు ఏర్పాటు
-
సముద్రంలో వేటకు వెళ్లొద్దని మత్స్యకారులను హెచ్చరించిన అధికారులు
-
తీరానికి చేరుకున్న బోట్లు
-
హోప్ ఐలాండ్ నుండి 130 మంది మత్స్యకారులను తూరంగి వద్ద ఐలాండ్ కాలనీకి తరలింపు
-
తుపాను సహయక చర్యలు అందించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రాక
-
తుఫాన్ సహయక చర్యలపై కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు
-
ల్యాండ్ లైన్: 0884-2356801
-
మొబైల్ : 9849903879
-
కాకినాడ ఆర్ డి ఓ కార్యాలయం కంట్రోల్ రూమ్ 8008803208
-
పెద్దాపురం ఆర్డీవో కార్యాలయం కంట్రోల్ రూం నెంబర్ 7993668485
ప్రారంభమైన తుపాను ప్రభావం
-
ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు
-
శ్రీకాకుళం జిల్లాల్లో ఈదురుగాలులతో భారీ వర్షాలు
-
కోస్తా జిల్లాల్లో ప్రారంభమైన ఈదురుగాలులు
-
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: విపత్తుల నిర్వహణ సంస్థ
-
మరికాసేపట్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు
-
శ్రీకాకుళం జిల్లాల్లో ఈదురుగాలులతో భారీ వర్షాలు
-
కోస్తా జిల్లాల్లో ప్రారంభమైన ఈదురుగాలులు
-
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: విపత్తుల నిర్వహణ సంస్థ
నేడు, రేపు భారీ వర్షాలు
-
సాయంత్రం వరకు పశ్చిమ-వాయువ్య దిశగా కొనసాగి.. ఆ తర్వాత వాయువ్య దిశగా పయనం
-
రేపు ఉదయానికి బాపట్ల -విశాఖపట్నం మధ్య, యానాంకు సమీపంలో తీరాన్ని దాటే అవకాశం
-
దీని ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు
-
అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు
-
కోస్తా తీరం వెంబడి గంటకు 90–100 కి.మీ వేగంతోఈదురుగాలులు
ఈ జిల్లాలకూ రెడ్‌అలెర్ట్
-
బుధవారం తీరాన్ని దాటే సమయంలో తీవ్రంగా తుపాను ప్రభావం
-
ఆ రోజు విశాఖ, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాలకు సైతం రెడ్ అలెర్ట్
-
రేపు(బుధవారం విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాలు, యానాంలో అతి భారీ వర్షాలు
-
శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, బాపట్ల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం
-
తీరం దాటిన మరుసటి రోజు గురువారం కూడా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖ, అల్లూరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు
-
ఈ నాలుగు రోజులు రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.











