సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవడంలో చంద్రబాబు పాలనలోని ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు దేశంలో ఎంతో ముందుకెళ్లిపోయిందనే చర్చ దేశ రాజధాని ఢిల్లీలో విస్తృతంగా వినిపిస్తోంది. నిష్పాక్షికంగా జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికల పోరులో యథేచ్ఛగా రిగ్గింగ్, బూత్ క్యాప్చరింగ్‌తో పాటు పోలీసులు, అధికారుల కనుసన్నల్లోనే అత్యంత తీవ్రస్థాయిలో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకోవడంతో ఆంధ్రప్రదేశ్ పరువు కాస్తదేశ రాజధానిలో గంగపాలైంది. ఒకవైపు ఎన్నికల వ్యవస్థలో లోపాలు, ఎస్ఐఆర్ అక్రమాలపై దేశ రాజధానిలో విపక్షాలు గళమెత్తుతున్న వేళ, మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ తీరు తీవ్ర వివాదాస్పదమవుతోంది.
నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన పోలీసులు, ఎన్నికల అధికారులే పక్షపాతంగా వ్యవహరించడం లేదా ఉదాసీనంగా వ్యవహరించడంపై మేధావి వర్గాలు నివ్వెరపోతున్నాయి. దీనిపై ప్రముఖ జాతీయ మీడియా చానళ్లలోనూ, సోషల్ మీడియాలోనూ విస్తృత చర్చలు సాగుతున్నాయి. కొందరు పోలీసు అధికారులు, ఉన్నతాధికారుల పక్షపాత వైఖరిపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నామినేషన్ల దాఖలు సమయంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఇటీవల సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందిస్తూ... పలు ఆదేశాలిచి్చన నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వ తీరుపై దేశం ఒక్కసారిగా దృష్టి సారించింది.
పోలింగ్ కేంద్రాల వద్ద చోటుచేసుకున్న అక్రమాలు, వైఎస్సార్సీపీ అభ్యర్థులపై దారుణమైన హింసాత్మక సంఘటనలు జాతీయ స్థాయిలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత మాయమైందని, ప్రజాస్వామ్య సూత్రాలను యథేచ్ఛగా కాలరాశారంటూ జాతీయ నేతలు, సీనియర్ జర్నలిస్టులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేనివిధంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల స్థాయిని పాతాళానికి దిగజార్చడంపైనా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఏపీ ఎన్నికల తీరుపై ఆందోళన
అధికార పార్టీకి పచ్చ మూకల దాడులలో గాయపడిన ఇండియా టుడే విలేకరులతోపాటు పులివెందుల తదితర ప్రాంతాల్లో దాడులకు గురైన బాధితులను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వయంగా పరామర్శించడం, అలాగే అధికార యంత్రాంగం, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్న తీరుపై ఆయన నిరసన వ్యక్తం చేయడం జాతీయ మీడియాలో చర్చకు దారితీసింది. నామినేషన్ల వేళ నుంచే వైఎస్సార్సీపీ అభ్యర్థులను అడ్డుకోవడం, వారిపై హింసకు దిగడం, పోలింగ్ కేంద్రాల నుంచి ఆ పార్టీ ఎన్నికల ఏజెంట్లను భయభ్రాంతులకు గురిచేసి బయటకు పంపేయడం వంటి ఘటనలపై ‘ది న్యూస్ మినిట్’ ఎడిటర్ పూజా ప్రసన్న వంటి ప్రముఖ జర్నలిస్టులు ప్రత్యేక కథనాలు ప్రసారం చేశారు.
సుప్రీంకోర్టు జోక్యంతో దేశం దృష్టి
స్థానిక ఎన్నికల వేళ 19 చోట్ల చైర్మన్ అభ్యర్థులతో పాటు ప్రతి వార్డులో వైఎస్సార్సీపీ అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకుంటూ టీడీపీ మూక అడ్డంకులు సృష్టించడం, నానా వీరంగం చేయడంపై ఫోటోలు, వీడియోలతో వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేయడం, అక్కడా ఫలితం లేకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించడంపై జాతీయ స్థాయిలో చర్చ జరిగింది. ఆ తర్వాత పులివెందుల వంటి ప్రాంతాల్లో రీపోలింగ్ డిమాండ్లతో పిటిషన్లు దాఖలు కావడం, న్యాయస్థానాలు సైతం సీరియస్‌గా స్పందించి ఎస్ఈసీకి ఆదేశాలు ఇవ్వడం.. ఈ ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి, ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జరగలేదని, చంద్రబాబు ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడిచారనే భావన జాతీయ స్థాయిలో బలపడుతోంది.
ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరం కాదు: రాజ్‌దీప్ సర్దేశాయ్
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇంతటి హింస ఎందుకు చోటుచేసుకుంటోందని ప్రభుత్వాన్ని, ఎన్నికల వ్యవస్థను సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ ప్రశ్నించారు. ఎన్నికల నిర్వహణలో అక్రమాలు, ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులపై హింసాత్మక ఘటనలు, బెదిరింపులు ప్రజాస్వామ్యానికి ఎంతమాత్రం శ్రేయస్క రం కాదని హితవు పలికారు. వైఎస్సార్ కడప జిల్లా పులివెందులతో పాటు పలు ప్రాంతాల్లో ఎన్నికల కవరేజ్ కోసం వెళ్లిన ‘ఇండియా టుడే’ వార్తా బృందంపై జరిగిన భౌతిక దాడులు, కెమెరాలను ధ్వంసం చేయడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇండియా టుడే చానల్లో తన ప్రత్యేక ప్రసారాల్లో, అలాగే సోషల్ మీడియాలో ఈ అంశాన్ని ఆయన లేవనెత్తారు.
There is no free and fair election in Andhra Pradesh argues @KarthikYells of YSRCP. Listen in:
— Rajdeep Sardesai (@sardesairajdeep) November 2, 2026
‘ఎలక్టోరల్ ఆటోక్రసీ’లో కొత్త రికార్డులు: అశుతోష్ రంకా
ఏపీ స్థానిక పోరులో చోటుచేసుకున్న రిగ్గింగ్, బూత్ క్యాప్చరింగ్ విజువల్స్‌ను కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) జాతీయ అధికార ప్రతినిధి అశుతోష్ రంకా ‘ఎక్స్’లో పంచుకుంటూ తీవ్ర విమర్శలు చేశారు. ‘‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి (లోక్తంత్ర బచావో) అంటూ ఒకవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పొరుగునే ఉన్న హైదరాబాద్‌లో పిలుపునిస్తుంటే, మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రభుత్వం ‘ఎలక్టోరల్ ఆటోక్రసీ’ (ఎన్నికల నియంతృత్వం)లో కొత్త రికార్డులు సృష్టిస్తోంది’’ అని మండిపడ్డారు.
While Amit Shah is busy holding "Loktantra Bachao" rally in Hyderabad, here are the visuals of booth capturing and electoral rigging in the neighbouring Andhra. @ncbn and Co are setting new benchmarsks of electoral autocracy. @VijayMallangi https://t.co/R4hRsOehXE
— Ashutosh Ranka (@AshutoshRanka) November 3, 2026