ఏపీలో అర్నబ్ తుపాను విధ్వంసం సృష్టించింది. యానాం- నరసాపురం మధ్య తుపాను తీరం దాటింది. కోనసీమలో 19 మండలాల పరిధిలో వందలాది చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఏకధాటిగా కురిసిన ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈదురు గాలుల తీవ్రతకు తీరప్రాంతవాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నిన్న సాయంత్రం నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కోనసీమలో రాత్రి అంతా అంధకారం నెలకొంది.
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు
- కృష్ణా జిల్లాపై అర్నబ్ తుపాను తీవ్ర ప్రభావం
రేపు (గురువారం) జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, కళాశాలలకు సెలవు
ప్రకటించిన కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
రాజమండ్రిలో ఈదురు గాలులతో భారీ వర్షం
- తూర్పుగోదావరి జిల్లాపై అర్నబ్ తుపాను తీవ్ర ప్రభావం
- రాజమండ్రిలో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం
- హోరున శబ్దంతో వీస్తున్న ఈదురు గాలులకు తీవ్ర భయాందోళనకు గురవుతున్న రాజమండ్రి వాసులు
- జాతీయ రహదారిపై ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం
- జిల్లా వాసులు అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు
అంధకారంలో మచిలీపట్నం
- అర్నబ్ తుఫాన్ కారణంగా గత రాత్రి విరుచుకుపడిన భీకర గాలులు
- గాలుల తీవ్రతకు నేలకొరిగిన భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు , తెగిపడిన విద్యుత్ వైర్లు
- పూర్తిస్థాయిలో వైర్లు , స్తంభాలను సరిచేస్తే కానీ విద్యుత్ పునఃరుద్ధరణకు అవకాశం లేని పరిస్థితి
- కొనసాగుతున్న విద్యుత్ సిబ్బంది సహాయక చర్యలు
రాగల మూడు గంటలు 9 జిల్లాలకు వర్ష సూచన
- శ్రీకాకుళం, ఏలూరు, కోనసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం
- ఏలూరు, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిగోదావరి, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు
- గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం
- ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలి : ప్రఖర్ జైన్, ఎండీ, APSDMA
విజయనగరం జిల్లాలో భారీగా నష్టం
- అర్నద్ తుపానుతో విజయనగరం జిల్లాలో భారీగా నష్టం వాటిల్లింది
- 800 ఎకరాలలో వరి పంట నీట మునిగింది
- భీకర గాలులతో అరటి బొప్పాయి తోటలకు తీవ్ర నష్టం
- పూసపాటిరేగా చీపురుపల్లి మండలాలలో ఉద్యానవన పంటలకు నష్టం
- పార్వతీపురం మన్యం జిల్లాలో 1000 ఎకరాలకు పైగా జీడి తోటలు దెబ్బతిన్నాయి
- విజయనగరం పట్టణంలో స్తంభించిన జనజీవనం.. రాకపోకలకు అంతరాయం
ఓడలరేవు తీరంలో విధ్వంసం
- డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓడలరేవు తీరంలో అర్నబ్ తుపాను విధ్వంసం
- మినీ హార్బర్లో లంగర్ వేసిన సుమారు 200 బోట్లు ధ్వంసం
- ఉప్పాడ, నక్కపల్లి గ్రామాలకు చెందిన మత్స్యకారుల ఫిషింగ్ బోట్లతో పాటు స్థానిక బోట్లు ధ్వంసం
- రాత్రి వీచిన తుపాను గాలికి ఒక దానికి ఒకటి ఢీకొని ధ్వంసమైన ఫిషింగ్ బోట్లు
- తుపానుకు దెబ్బతిన్న బోట్లు పరిశీలించిన వైఎస్సార్సీపీ అమలాపురం నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీకాంత్
అంతర్వేది తీరానికి కొట్టుకొచ్చిన ఓడ
- డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది తీరానికి కొట్టుకొచ్చిన కాకినాడ నుంచి సింగపూర్ వెళుతున్న షిప్
- తుఫాను తీరం దాటే సమయంలో సముద్రంలో ఉన్న షిప్ తుపాను తాకిడికి అంతర్వేది తీరానికి చేరిక
కోనసీమకు అపారనష్టం
- అర్నబ్ తుఫాన్ కోనసీమపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది
- 8000 వరకు విద్యుత్ స్తంభాలు ధ్వంసం అయ్యాయి
- ప్రాథమిక అంచనా ప్రకారం 90% వరి పంట దెబ్బతింది
- రహదారులపై కూలిన వృక్షాలను చాలా వరకు క్లియర్ చేసాం
- తీరప్రాంతాలు , లోతట్టు ప్రాంతాల్లో ఉన్న 13వేల మందికి పునరావాసం కల్పించాం
- విద్యుత్ సౌకర్యాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నాం
- తుపాను ప్రభావంతో సఖినేటిపల్లికి చెందిన ఒక వృద్ధురాలు మృతి చెందారు
- మహేష్ కుమార్ కలెక్టర్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా
మంగినపూడి బీచ్ రోడ్డులో రాకపోకలు బంద్
- తీరం దాటినా కొనసాగుతున్న అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్
- కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మళ్లీ పెరిగిన గాలుల తీవ్రత
- భారీ ఈదురు గాలుల దెబ్బకు బీచ్‌కి వెళ్లే మార్గం మూసివేత
- బీచ్ రోడ్డు పొడవునా అడుగడుగునా నేలకొరిగిన భారీ వృక్షాలు
- మచిలీపట్నం - మంగినపూడి బీచ్ రోడ్డు రాకపోకలు బంద్
- నేలకొరిగిన చెట్లను తొలగిస్తున్న పోలీసులు
అర్నబ్ ఎఫెక్ట్.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్
- ఉభయ గోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు
- తూర్పు, పశ్చిమ, కాకినాడ, కోనసీమ జిల్లాలకు రెడ్ అలర్ట్
- ఏలూరు, ఎన్టీఆర్, బాపట్ల, కృష్ణా జిల్లాలకు రెడ్ అలర్ట్
- అల్లూరి, అనకాపల్లి, విశాఖ జిల్లాలకు రెడ్ అలర్ట్
- విజయనగరం, గుంటూరు, పల్నాడుకు ఆరెంజ్ అలర్ట్
- శ్రీకాకుళం, మన్యం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
యానాం-నరసాపురం మధ్య తీరం దాటిన అర్నాబ్ తుపాను
- బలహీనపడి తీవ్ర తుపాన్‌గా మారిన అర్నబ్
- తీరం దాటిన సమయంలో 125-130 కి.మీ వేగంతో గాలులు
కృష్ణా జిల్లాలో భారీ వర్షపాతం నమోదు
- గడిచిన ఆరు గంటల్లో కృష్ణా జిల్లాలో భారీ వర్షపాతం నమోదు
- అత్యధికంగా కోడూరు మండలంలో 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు
- మచిలీపట్నం నార్త్, సౌత్ మండలాల్లో 11, నాగాయలంక,పెడన ,గూడూరు 10, అవనిగడ్డ 9, చల్లపల్లి 8, పామర్రు, ఘంటసాల, కృత్తివెన్ను, తోట్లవల్లూరు 6, బంటుమిల్లి, మొవ్వ, మోపిదేవి,పెనమలూరు, పమిడిముక్కల 5, గుడ్లవల్లేరు, గుడివాడ, కంకిపాడు, నందివాడ, ఉయ్యూరు 4, పెదపారుపూడి, ఉంగుటూరు 3, గన్నవరం, బాపులపాడు 2 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదు
తెలంగాణలోనూ అర్నబ్ ప్రభావం
- అర్నబ్ తుపాన్ ప్రభావంతో సూర్యాపేట నియోజకవర్గ వ్యాప్తంగా మోస్తారు వర్షాలు
- సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో భారీగా ధాన్యం
- వర్ష ప్రభావంతో తీవ్ర ఇబ్బందులు పడుతోన్న రైతులు
- కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షం
విజయనగరం జిల్లా..
- దత్తిరాజేరు మండలంలో వర్షాలకు పొంగి ప్రవహిన్న పోతులుగెడ్డ
- పలుగ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు..
- మరోప్రక్కన దత్తి, వెంకటాపురం గ్రామాలమధ్య రోడ్డుపైన భారీఎత్తున ప్రవహిస్తున్న వరదనీరు
- తీవ్ర ఇబ్బందులుపడుతున్న గ్రామస్థులు
- మెంటాడ మండలం, ఆండ్ర నుండి లోతుగెడ్డ నుంచి అనంతగిరి వైపు వెళ్లే దారిలో రోడ్డుపై విరిగిపడ్డ భారీ వృక్షం
- రాకపోకలకు అంతరాయం.. అధికారులు వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్న ప్రజలు
- ప్రమాదపుటంచున విజయనగరం పెద్ద చెరువు.. చెరువు గట్టు పై నుండి ప్రవహిస్తున్న వరద నీరు
- లోయర్ ట్యాంక్ బండ్ రోడ్డుపై నుండి ప్రవహిస్తున్న నీరు
అనకాపల్లి: యలమంచిలిలో విషాదం
- అర్నబ్ తుపాన్ కారణంగా తెగిపడిన విద్యుత్ వైర్లు
- ఈదురు గాలులకు రోడ్డుపై పడిన విద్యుత్ తీగలు
- విద్యుత్ తీగల తగలడం వలన మహిళ మృతి
- మృతురాలు నున్న భాగ్యలక్ష్మి 55 గా గుర్తింపు
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న యలమంచిలి పట్టణ పోలీసులు
కోనసీమ అతలాకుతలం
- అమలాపురం పట్టణంలో తుపాను బీభత్సం...
- నేలకూలిన విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్లు, వేళ్ళతో కూలిన వృక్షాలు
- అమలాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో కూలిన చెట్లు
- అమలాపురం పట్టణంలో కూలిన చెట్లను తొలగిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది
ఏలూరు జిల్లాలోఅర్నబ్ తుపాన్ బీభత్సం..
-
ఏలూరు మినీ బైపాస్ లో బస్సుపై కూలిన భారీ వృక్షం
-
పలాస నుంచి విజయవాడ వెళ్తున్న ప్రతాప్ ట్రావెల్స్ బస్సుపై విరిగిపడిన మహావృక్షం
-
బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసం.. తప్పిన పెను ప్రమాదం
-
డ్రైవర్ చాకచక్యంతో అదుపు తప్పకుండా ఆగిన బస్సు.. తప్పిన భారీ ప్రమాదం
-
ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు
-
ప్రయాణికులను సురక్షితంగా మరో బస్సులోకి తరలించిన సిబ్బంది
-
డ్రైవర్‌కు స్వల్ప గాయాలు.. ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలింపు
-
భారీ వర్షంలోనూ రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది.. వృక్షాన్ని తొలగించిన సిబ్బంది
-
ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టిన పోలీస్ సిబ్బంది
కోనసీమకు పొంచి ఉన్న ముప్పు..
- నెమ్మదిగా అర్నబ్ ల్యాండ్ ఫాల్ ప్రక్రియ
- నరసాపురం - యానాం మధ్య తీరం దాటనున్న అతి తీవ్ర తుపాన్
- మధ్యాహ్నానికి తీరం దాటే అవకాశం
- యానాం తీరానికి సమీపంగా వచ్చిన తర్వాత తీరం దాటే సమయంలో స్థిరంగా కొనసాగడంతో కోనసీమకు పొంచి ఉన్న ముప్పు
- విశాఖలో 24 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదు
- పలు ప్రాంతాల్లో నిలిచిన వర్షపు నీరు
- అల్లకల్లోలంగా సముద్ర వాతావరణం
- మరో 24 గంటలపాటు కొనసాగనున్న ప్రభావం..
ఉమ్మడి విశాఖ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షం
- హరిజన జగ్గయ్యపాలెంలో ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు..
- నీట మునిగిన జగ్గయ్యపాలెం..
- రాకపోకలకు అంతరాయం..
రెండు గంటలుగా నిలకడగా ఉన్న తీరం దాటే ప్రక్రియ
- నరసాపురానికి 30 కిమీ దూరంలోనే కేంద్రీకృతం
- మధ్యాహ్ననికి పూర్తిగా తీరం దాటే అవకాశం
- తీరం వెంబడి కొనసాగనున్న బలమైన ఈదురుగాలులు, వర్షాలు
- ఇవాళ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: విపత్తుల సంస్థ
అర్నబ్ ఎఫెక్ట్.. పలు విమానాలు, రైళ్లు రద్దు
- భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు నిలిచిన విమాన రాకపోకలు
- తుపాను కారణంగా 28 విమాన సర్వీసులు రద్దు
- నేడు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో అన్ని విమానాలు రద్దు
- గన్నవరం ఎయిర్‌పోర్టులో 20 విమాన సర్వీసులు రద్దు
కోనసీమలో అల్లకల్లోలం:
- కోనసీమలో పలుచోట్ల కూలిన చెట్లు
- రావులపాలెం నుండి అమలాపురం వెళ్లే దారిలో పెద్ద సంఖ్యలో రోడ్లపై చెట్లు కూలిపోవడంతో నిలిచిపోయిన రాకపోకలు
- ఈతకోట నుంచి పి. గన్నవరం వెళ్లే దారిలో భారీగా కూలిన చెట్లు
- భారీ సంఖ్యలో చెట్లు నేలకొరగడంతో కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురానికి వెళ్లే దారుల బంద్
- భారీగా నిలిచిపోయిన దూర ప్రాంతాల బస్సులు
- పలుచోట్ల దెబ్బతిన్న వరి పనలు
- వేలాది ఎకరాల్లో నేలనంటిన వరిపనలు
తుపాన్ ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: వైఎస్ జగన్
-
ప్రజల ప్రాణాలు కాపాడడమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యత కావాలి
-
పునరావాస కేంద్రాలు, ఆహారం, తాగునీరు, మందులు,
-
మౌలిక వసతులపై దృష్టి పెట్టాలి
-
గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లలు, వృద్ధులు, వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి
-
రైతులకు ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు వెంటనే అందజేయాలి
-
సహాయక చర్యల్లో వైఎస్సార్సీపీ శ్రేణులు చురుగ్గా పాల్గొనాలి
అనకాపల్లి జిల్లా:
- తుపాను ప్రభావంతో ఈదురు గాలులతో కూడిన వర్షం
- పలు గ్రామాల్లో విద్యుత్‌కు అంతరాయం
- యలమంచిలి జాతీయ రహదారి రేగిపాల వద్ద కూలిన భారీ వృక్షం.. ట్రాఫిక్‌కి అంతరాయం
- లంకెలపాలెం వద్ద జాతీయ రహదారి కూలిని చెట్లు రాకపోకలకు అంతరాయం
- ఏజెన్సీలో కురుస్తున్న భారీ వర్షాలు
- ప్రమాద స్థాయికి చేరుకున్న పెద్దేరు రిజర్వాయర్ నీటి మట్టం
- లోతట్టు ప్రాంత ప్రజలను ప్రభుత్వం చేసి 500 క్యూసెక్కుల నీటిని వీడియోలు చేసిన జలవనరుల శాఖ అధికారులు
- అనకాపల్లి జిల్లాలో అత్యధికంగా కసింకోట మండలంలో 131.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు
అర్నబ్ తుపాను ఎఫెక్ట్:
- విశాఖ ఫిషింగ్ హార్బర్లో మునిగిపోయిన ఐదు మత్స్యకార బోట్లు
- మరికొన్ని బోట్లు ధ్వంసం అయినట్టు సమాచారం
కొనసాగుతున్న అర్నబ్ ల్యాండ్ ఫాల్ ప్రక్రియ
-
మరో మూడు గంటల్లో పూర్తిగా తీరం దాటనున్న అర్నబ్
-
అర్నబ్ ప్రభావంతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో గాలులతో కూడిన భారీ వర్షం
-
పలు గ్రామాలకు నిలిచిపోయిన విద్యుత్ సరఫరా
-
అంధకారంలో గ్రామాలు
కాకినాడ జిల్లా:
- జిల్లాపై అర్నబ్ తుఫాన్ భీభత్సం
- రాత్రి నుండి పెను గాలులు, భారీ వర్షాలు
- విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రాత్రి నుంచి అంధకారంలో ప్రజలు
- తీరంలో ఎగసిపడిన రాకాసి అలలు
- కాకినాడ మహలక్ష్మీ నగర్, ముత్తానగర్, ఉప్పాడలో సుబ్బంపేట, సూరాడ పేటలో ముందుకు చొచ్చుకొచ్చిన సముద్రం
- నీట మునిగిన పలు ఇళ్లు
- నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
విశాఖపట్నం:
పలు ప్రాంతాల్లో నిలిచిన విద్యుత్ సరఫరా
భీకర గాలులకు నేలకొరిగిన భారీ వృక్షాలు
అనకాపల్లి జిల్లా కన్నూరు పాలెంలో 25 సెం.మి వర్షపాతం నమోదు
విశాఖ నగరంలో 24,సింహాచలం లో 22 సెంమి వర్షపాతం నమోదు
గడచిన 24 గంటలగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం..











