Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV
  • Tollywood
  • దక్షిణ భారత
  • OTT
  • Reviews
  • Gossips
  • Hollywood
  • Bollywood

Breadcrumb

  1. Home
  2. Movies
  3. Cinema Home
ADVERTISEMENT

ప్రియదర్శి 'సారంగపాణి జాతకం'.. ప్రేక్షకుడిని కడుపుబ్బా నవ్వించాడా?

Movies Sakshi User Sakshi Sakshi Time Apr 25, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Sarangapani-Jathakam_0.jpg

టైటిల్:‍ సారంగపాణి జాతకం

నటీనటులు: ప్రియదర్శి, రూప కొడువాయూర్, వీకే నరేశ్, తనికెళ్ల భరణి, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిశోర్, హర్ష చెముడు తదితరులు
దర్శకత్వం:  మోహనకృష్ణ ఇంద్రగంటి

నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్‌

నిర్మాణ సంస్థ: శ్రీదేవి మూవీస్

సినిమాటోగ్రఫీ: పీజీ విందా

సంగీత దర్శకుడు: వివేక్ సాగర్

ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్

విడుదల తేదీ: ఏప్రిల్ 25, 2025


ఇటీవలే కోర్ట్ మూవీతో సూపర్ హిట్‌ అందుకున్న ప్రియదర్శి మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు వచ్చారు. కోర్టు సక్సెస్‌ ఎంజాయ్‌ చేస్తుండగానే మరో మూవీ థియేటర్లలో పడిపోయింది. వరుస సినిమాలతో ఫుల్‌ స్పీడ్‌లో ప్రియదర్శి నటించిన తాజా చిత్రం సారంగపాణి జాతకం. ఈ ఫుల్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ను టాలీవుడ్‌ సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించారు. ఇవాళ థియేటర్లలో విడుదలైన సారంగపాణి జాతకం ప్రేక్షకులను నవ్వించిందా? లేదా? అనేది రివ్యూలో చూద్దాం.


సారంగపాణి జాతకం కథేంటంటే..

సారంగ(ప్రియదర్శి) ఓ కార్ల కంపెనీలో సేల్స్‌ మెన్. చిన్నప్పటి నుంచి యావరేజ్‌ మార్కులతో పాసైన సారంగకు ఆ జాబ్‌ సాధించడం గొప్పే అని సారంగ తల్లిదండ్రుల ఫీలింగ్. ముఖ్యంగా ఇదంతా మనోడి జాతకం తెగ నమ్మేస్తుంటారు. అలా చిన్నప్పటి నుంచి జాతకాలపై సారంగకు పూర్తి నమ్మకం ఏర్పడుతుంది. అయితే ‍అదే కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తోన్న మైథిలి(రూప కొడువాయూర్)తో మన సారంగకు లవ్‌ మొదలవుతుంది. ఆమెకు సారంగ ప్రపోజ్‌ చేద్దాం అనుకునేలోపే మైథిలినే ఊహించని సర్‌ప్రైజ్‌ ఇస్తుంది. అలా ఇద్దరి మధ్య లవ్‌ ట్రాక్‌ మొదలై చివరికీ పెళ్లి వరకు తీసుకెళ్తుంది. అంతా ఓకే అనుకుంటుండగానే సారంగకు చేతి రేఖలు చూసి భవిష్యత్తును డిసైడ్ చేసే జిగ్గేశ్వర్(అవసరాల శ్రీనివాస్‌)ను అనుకోకుండా కలుస్తాడు. ఆయన చేతిరేఖల జాతకంలో ఫేమస్ కావడంతో అతని వద్దకు సారంగ వెళ్తాడు. ఆ తర్వాత సారంగ చేయి చూసిన జిగ్గేశ్వర్ (అవసరాల శ్రీనివాస్) చేతి రేఖలు చూసి అతని జాతకంలో ఉన్న ఓ షాకింగ్‌ విషయం చెప్తాడు. ముందు నుంచి జాతకాలు తెగ నమ్మే సారంగ ఆ విషయం తెలుసుకుని తెగ బాధపడిపోతుంటాడు. ఆ పని పూర్తయ్యాకే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఈ విషయంలో తన ఫ్రెండ్‌ చందు(వెన్నెల కిశోర్) సాయం కోరతాడు. ఇద్దరు కలిసి సారంగ జాతకం ప్రకారం ఆ పని కోసం తమ మాస్టర్‌ మైండ్స్‌తో స్కెచ్‌ వేస్తారు. మరి అది వర్కవుట్ అయిందా? అసలు సారంగ జాతకంలో ఉన్న ఆ షాకింగ్ విషయం ఏంటి? దాని కోసం చందుతో కలిసి వేసిన ప్లాన్స్‌ సక్సెస్ అయ్యాయా? చివరికీ సారంగ.. తన ప్రియురాలు మైథిలిని పెళ్లి చేసుకున్నాడా? అనేది తెలియాలంటే సారంగపాణి జాతకం చూడాల్సిందే.



ఎలా ఉందంటే..

సాధారణంగా మనదేశంలో జాతకాలంటే జనాలకు ఎంత పిచ్చో అందరికీ తెలిసిందే. మన గ్రామాల్లో అయితే ఇలాంటివీ విపరీతంగా నమ్మేస్తుంటారు. అలా జాతకాలను తెగ నమ్మేసే ఓ యువకుడి స్టోరీనే మన ముందుకు తీసుకొచ్చారు మోహనకృష్ణ ఇంద్రగంటి. చేతి రేఖల జాతకం అనే కాన్సెప్ట్‌తో తీసుకొచ్చిన ఈ కథ ఆడియన్స్‌కు వివరించే విషయంలో డైరెక్టర్‌ సక్సెస్ అయ్యారు. ప్రేక్షకులను నవ్వించేందుకు జాతకం అనే కాన్సెప్ట్‌ను ఎంచుకోవడం   ఈ సినిమాకు ప్లస్‌ పాయింట్. అలా ఫస్ట్ హాఫ్‌లో లవ్‌, కామెడీతో ఇంద్రగంటి కట్టిపడేశారు. ప్రతి సీన్‌లో పంచ్‌లు, ప్రాసలు, అక్కడక్కడ అడల్డ్‌ జోక్స్‌తో ప్రేక్షకున్ని నాన్‌స్టాప్‌గా నవ్వించేశారు డైరెక్టర్‌. తన జాతకం ప్రకారం జరగాల్సిన ఆ పనిని ముందే చేస్తే ఎలా ఉంటుంది? ఆ పని కోసం హీరో(సారంగ) ప్లాన్స్‌ చూస్తే థియేటర్లలో నవ్వుకోని వాళ్లు ఉండరేమో? అలా ఫస్ట్ హాఫ్‌లోనే తన కామెడీ పంచ్‌లతో సగటు ప్రేక్షకున్ని సీట్ నుంచి కదలకుండా చేసేశాడు. సరదాగా వెళ్తున్న కథలో ఓ సీరియస్‌నెస్ తెప్పించే ట్విస్ట్‌ ఇ‍చ్చిన ఇంద్రగంటి ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ పడేశాడు.  


ఫస్ట్‌ హాఫ్‌తోనే ప్రేక్షకులను తెగ నవ్వించేసిన డైరెక్టర్‌.. సెకండాఫ్‌లో కొత్త పాత్రలతో కథను మరింత ఇంట్రెస్టింగ్‌గా మార్చేశాడు. కొత్త క్యారెక్టర్స్‌తో ఎక్కడా బోర్‌ కొట్టకుండా కామెడీని మరో రేంజ్‌కు తీసుకెళ్లాడు. హర్ష చెముడు, ప్రియదర్శి, వెన్నెల కిశోర్ చేసే కామెడీ ఆడియన్స్‌కు హిలేరియస్‌గా అనిపిస్తుంది. సెకండాఫ్‌లో కథ మొత్తం ఓ హోటల్‌ చుట్టే ప్లాన్‌ చేశాడు డైరెక్టర్. హోటల్‌లో జరిగే సన్నివేశాలు ప్రేక్షకుల ఉహకందేలా ఉన్నప్పటికీ కామెడీతో ప్రేక్షకుడిని కట్టిపడేయడంలో ఇంద్రగంటి ఫుల్ సక్సెస్ అయ్యారు. సెకండాఫ్‌లో తనికెళ్ల భరణి(అహోబిలం రావు) ఎంట్రీతో ఆడియన్స్‌లో మరింత ఆసక్తి పెంచేశాడు. కథలో ఊహించని ట్విస్ట్‌లతో ఎక్కడా కూడా ప్రేక్షకుడికి బోరింగ్‌ అనే పదం గుర్తు రాకుండా చేశాడు దర్శకుడు. జాతకం అనే కాన్సెప్ట్‌తో ఇంద్రగంటి చేసిన కామెడీ.. రోటీన్‌ కంటే భిన్నంగా ఉందని సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు ఫీలవుతాడు. క్లైమాక్స్‌లో వచ్చే ఓ సీరియస్‌ సీన్‌లోనూ నవ్వులు పూయించడం ఆయనకే సాధ్యమైంది. సందర్భాన్ని బట్టి అక్కడక్కడా కొన్ని అభ్యంతరకర పదాలు వాడినప్పటికీ.. కామెడీ ఎంటర్‌టైనర్‌గా కావడంతో ప్రేక్షకులు అంతగా ఇబ్బందే పడే లా అయితే లేవు. ఓవరాల్‌గా జాతకం అనే కాన్సెప్ట్‌తో డైరెక్టర్‌ చేసిన కామెడీ తీరు ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకునేలా ఉందనడంలో సందేహం లేదు.  ఎవరైనా ఫ్యామిలీతో కలిసి కడుపుబ్బా నవ్వాలనుకుంటే మీరు కూడా సారంగపాణి జాతకంపై ఓ లుక్కేయండి.

ఎవరెలా చేశారంటే..

ప్రియదర్శి నటన, కామెడీ టైమింగ్‌తో మరోసారి అదరగొట్టేశాడు. మిస్టర్‌ ప్రెగ్నెట్‌ హీరోయిన్‌ రూప మరోసారి తన అందం, నటనతో మరోసారి ప్రేక్షకులను కట్టిపడేసింది. వెన్నెల కిశోర్, అవసరాస శ్రీనివాస్, హర్ష చెముడు, వీకే నరేశ్, తనికెళ్ల భరణి తమ పాత్రల్లో ఆడియన్స్‌ను అలరించారు. సాంకేతికత విషయానికొస్తే పీజీ విందా సినిమాటోగ్రఫీ బాగుంది.  మార్తాండ్ కె వెంకటేశ్‌ ఎడిటింగ్‌ ఫర్వాలేదు. కొన్ని సీన్స్‌ మరింత క్రిస్పీగా కట్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. వివేక్ సాగర్ నేపథ్యం సంగీతం ఆకట్టుకునేలా ఉంది. నిర్మాణ విలువలు శ్రీదేవి మూవీస్‌ సంస్థకు తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి.
 
 

ADVERTISEMENT
ADVERTISEMENT
3/5
Tags:
Priyadarshi Pulikonda
Sarangapani Jathakam Movie
Movie review
Tollywood Hero
Movie News
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

‘భాయ్‌కి ఏమైంది?..’ సల్మాన్‌ ఖాన్‌ ఆసక్తికర ట్వీట్‌

‘భాయ్‌కి ఏమైంది?..’ సల్మాన్‌ ఖాన్‌ ఆసక్తికర ట్వీట్‌

సింగ్ గీతం మూవీ.. ఓరి జీవుడా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

సింగ్ గీతం మూవీ.. ఓరి జీవుడా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

48 గంటల్లోనే నిషేదం.. ‘సట్లజ్‌’ వివాదం ఏంటి?

48 గంటల్లోనే నిషేదం.. ‘సట్లజ్‌’ వివాదం ఏంటి?

పలు దేశాల్లో నిషేధం.. సినిమా తెలుగు రివ్యూ

పలు దేశాల్లో నిషేధం.. సినిమా తెలుగు రివ్యూ

ఈ సిరీస్ చూస్తే ఫోన్ వాడాలంటే భయపడతారు

ఈ సిరీస్ చూస్తే ఫోన్ వాడాలంటే భయపడతారు

అమిర్ ఖాన్ మూడో పెళ్లి.. అతిథులకు స్పెషల్ ట్రీట్

అమిర్ ఖాన్ మూడో పెళ్లి.. అతిథులకు స్పెషల్ ట్రీట్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
Advertisement
 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.