బాలీవుడ్ క్యూట్ జోడి కియారా అద్వానీ–సిద్ధార్థ్ మల్హోత్రా తొలిసారి ‘కాఫీ విత్ కరణ్’ సీజన్ 9లో కలిసి సందడి చేశారు. ఈ ఎపిసోడ్ బుధవారం రాత్రి 7 గంటలకు జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుదలై.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముఖ్యంగా డేట్ నైట్స్‌పై కియారా చేసిన సరదా వ్యాఖ్య ఆకట్టుకుంటోంది.
అబ్ బస్ హో గయా
పెళ్లి తర్వాత కూడా డిన్నర్ పూర్తయ్యాక డేట్ నైట్స్ కొనసాగిస్తారా? అని హోస్ట్ కరణ్ జోహార్ ఈ జంటను ప్రశ్నించాడు. దీనికి కియారా తన బేబీ బంప్‌ను చూపిస్తూ ‘అబ్ బస్ హో గయా’ (ఇక చాలు) అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చింది. ఆమె సమాధానంతో అక్కడ నవ్వులు పూశాయి. దీనిపై సిద్ధార్థ్ కూడా సరదాగా స్పందించాడు. తమ వృత్తికి సంబంధించిన విషయాలను ఇంటికి తీసుకురావాలని తాము అనుకోవడం లేదని, ముఖ్యంగా బెడ్రూమ్లోకి మాత్రం వాటిని తీసుకురామని చెప్పాడు.
ఈ సందర్భంగా తమ పెళ్లికి సంబంధించిన ఆసక్తికర విషయాలను కరణ్ జోహార్‌తో ఈ జంట పంచుకుంది. పెళ్లిలో కరణ్ ఏ పాటకు డ్యాన్స్ చేశాడో చెప్పాలంటూ కియారా అతడిని ఆటపట్టించింది. అలాగే నటుడు షాహిద్ కపూర్ తనతో కలిసి స్టేజ్‌పైకి వచ్చాడని, ఆ తర్వాత కరణ్ అతడిని స్టేజ్ నుంచి దించేశాడని గుర్తుచేసుకుంది.
కాగా.. కియారా, సిద్ధార్థ్ తమ రెండో బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారు. రెండోసారి ప్రెగ్నెన్సీ అయిన విషయాన్ని అక్టోబర్ 7న ఈ జంట అధికారికంగా ప్రకటించింది. 2025లో వీరికి తొలి సంతానంగా కుమార్తె జన్మించింది.











