Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. National
  3. 'ఇట్లు అర్జున' మూవీ రివ్యూ అండ్ రేటింగ్
ADVERTISEMENT

'ఇట్లు అర్జున' మూవీ రివ్యూ అండ్ రేటింగ్

National Sakshi User Sakshi Sakshi Time Nov 13, 2026 02:09 PM IST Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
Itlu-Arjuna-Movie.jpg

అనస్వర రాజన్‌, అనీష్‌ జంటగా నటించిన చిత్రం ‘ఇట్లు అర్జున’. మహేశ్‌ ఉప్పల దర్శకత్వం వహించారు. ఈ సినిమా నవంబర్‌ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనీష్‌ రెడ్డికి ఇది తొలి చిత్రం కాగా.. అక్కినేని నాగార్జున సమర్పకుడిగా వ్యవహరించడం సినిమాపై ఆసక్తిని పెంచింది. మరోవైపు ఎన్టీఆర్‌, అఖిల్‌, రామ్‌చరణ్‌ వంటి స్టార్‌ హీరోలు సైతం ఈ సినిమాను ప్రమోట్‌ చేయడంతో విడుదలకు ముందే మంచి హైప్‌ క్రియేట్‌ అయింది. చిత్రబృందం కూడా వినూత్నంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించింది. మరి భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనీష్‌ తన తొలి సినిమాతో మెప్పించాడా? రివ్యూలో చూద్దాం.

కథేంటంటే?
అర్జున్‌ (అనీష్ ) పుట్టుకతోనే మూగవాడు. చిన్నప్పటి నుంచి తండ్రితో కలిసి దొంగతనాలు చేస్తూ పెరుగుతాడు. ఈ క్రమంలో చిన్న వయసులోనే జైలు జీవితం అనుభవించాల్సి వస్తుంది. అక్కడే చదువుకుంటాడు. చదువు అంతంతమాత్రంగానే ఉండటంతో జైలు నుంచి బయటకు వచ్చాక ర్యాపిడో డ్రైవర్‌గా జీవనం సాగిస్తుంటాడు. మరోవైపు అదే అపార్ట్‌మెంట్‌లో పై అంతస్తులో ఉండే కీర్తి (అనస్వర రాజన్‌)ను చిన్నప్పటి నుంచి ప్రేమిస్తుంటాడు. అయితే తన ప్రేమను ఆమెకు ఎలా చెప్పాలో తెలియక ఇబ్బందులు పడుతుంటాడు.

ఇదిలా ఉంటే.. రూ.1000 కోట్లకు సంబంధించిన ఓ పెన్‌డ్రైవ్‌ వ్యవహారం అర్జున్‌ను చిక్కుల్లో పడేస్తుంది. అసలు ఆ పెన్‌డ్రైవ్‌లో ఏముంది? దాని కోసం అర్జున్‌ ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు? మాటలు రాకపోయినా తన ప్రేమను కీర్తికి తెలియజేయగలిగాడా? ఆమె అతడి ప్రేమను అంగీకరించిందా? చివరకు అర్జున్‌ జీవితంలో ఏం జరిగింది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే? 
మూగవాడి ప్రేమకథకు ఓ చిన్నపాటి థ్రిల్లర్‌ను జోడించి దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రేమ, కామెడీ, ఎమోషన్స్‌, థ్రిల్లింగ్‌ అంశాలను మేళవించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా కథలో వచ్చే కొన్ని మలుపులు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతాయి. అయితే అక్కడక్కడా కథనం కాస్త నెమ్మదించినట్లు అనిపిస్తుంది.

తొలి భాగంలో అర్జున్‌, కీర్తి మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. మాటలు రాని ఓ యువకుడు తన ప్రేమను హావభావాలతో వ్యక్తం చేయడానికి పడే తపనను తెరపై చక్కగా చూపించారు. ఈ సన్నివేశాలు ఓ కొత్త తరహా ప్రేమకథను చూస్తున్న అనుభూతిని కలిగిస్తాయి. ముఖ్యంగా వెన్నెల కిషోర్‌ ఎంట్రీ తర్వాత కామెడీ మరింత వినోదాన్ని పంచుతుంది. ఆయన టైమింగ్‌ నవ్వులు పూయిస్తుంది. ఇలా ప్రేమ, వినోదంతో మొదటి భాగం ఆసక్తికరంగానే సాగుతుంది.

సెకండాఫ్‌ ప్రధానంగా రూ.1000 కోట్ల పెన్‌డ్రైవ్‌ చుట్టూ తిరుగుతుంది. దీంతో కథలో ఒక్కసారిగా థ్రిల్లర్‌ కోణం మొదలవుతుంది. ఈ క్రమంలో వచ్చే ట్విస్టులు, అర్జున్‌ ఎదుర్కొనే పరిస్థితులు ఆసక్తిని పెంచుతాయి. మరోవైపు ప్రేమ, భావోద్వేగాలకు కూడా దర్శకుడు ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా మాటలు రాని అర్జున్‌ తన భావాలను వ్యక్తం చేసే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అక్కడక్కడా కథనం కొంత సాగదీసినట్లు అనిపించినా.. కీలక మలుపులతో సినిమా ముగింపు వరకు ప్రేక్షకుల్లో ఆసక్తిని కొనసాగిస్తుంది. 

ఎవరెలా చేశారంటే? 
అనీష్‌ రెడ్డికి ఇది తొలి సినిమా అయినప్పటికీ.. అర్జున్‌ పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. ముఖ్యంగా మాటలు లేకుండానే కేవలం హావభావాలతో భావాలను పలికించిన తీరు ఆకట్టుకుంటుంది. తన తొలి సినిమాతోనే నటుడిగా మంచి ప్రయత్నం చేశాడని చెప్పొచ్చు. హీరోయిన్‌ అనస్వర రాజన్‌ కూడా కీర్తి పాత్రకు న్యాయం చేసింది. తన సహజమైన నటన, ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంది.

వెన్నెల కిషోర్‌ తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించాడు. చైల్డ్‌ ఆర్టిస్ట్‌ రోహన్‌ కూడా తన నటనతో మెప్పించాడు. బ్రహ్మాజీ, ముకేశ్‌ రిషి తదితరులు తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు.

సాంకేతికంగా సినిమా బాగుంది. సంగీత దర్శకుడు తమన్‌ మరోసారి తనదైన ముద్ర వేశాడు. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా కొన్ని కీలక సన్నివేశాలకు బలంగా నిలిచింది. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు మహేశ్‌ ఉప్పల ప్రేమకథకు థ్రిల్లర్‌ అంశాలను జోడించి కొత్తగా చెప్పే ప్రయత్నం చేశారు. కథనంలో అక్కడక్కడా వేగం తగ్గినా.. నటీనటుల ప్రదర్శన, కామెడీ, ట్విస్టులు సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తాయి.

ADVERTISEMENT
ADVERTISEMENT
3/5
tags Tags:
Movie review
Cinema News
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

‘రామాయణ’ పైరసీ.. వెంటనే తొలగించాలి’

‘రామాయణ’ పైరసీ.. వెంటనే తొలగించాలి’

మేము అదృష్టవంతులం.. కొత్త హీరోలకు అదొక్కటే దిక్కు: నాగార్జున

మేము అదృష్టవంతులం.. కొత్త హీరోలకు అదొక్కటే దిక్కు: నాగార్జున

రెజీనా కీలకపాత్రలో మైత్రీ కొత్త చిత్రం..

రెజీనా కీలకపాత్రలో మైత్రీ కొత్త చిత్రం..

90 ఏళ్ల బామ వేడుకోలు.. ఏడాది చిన్నారికి సోనూసూద్‌ భారీ సాయం

90 ఏళ్ల బామ వేడుకోలు.. ఏడాది చిన్నారికి సోనూసూద్‌ భారీ సాయం

కొడుకు ఫొటో రివీల్‌ చేసిన కత్రినా కైఫ్

కొడుకు ఫొటో రివీల్‌ చేసిన కత్రినా కైఫ్

రజనీకాంత్‌ ’ధర్మన్‌’ నుంచి రామ్‌ అప్‌డేట్‌ వచ్చేసింది

రజనీకాంత్‌ ’ధర్మన్‌’ నుంచి రామ్‌ అప్‌డేట్‌ వచ్చేసింది

మరిన్ని వార్తలు

ఫలితమివ్వని గ్రీన్ క్రాకర్స్‌.. టైమ్‌ దాటినా టపాసుల మోత!

ఫలితమివ్వని గ్రీన్ క్రాకర్స్‌.. టైమ్‌ దాటినా టపాసుల మోత!

సీఎం కనిపించగానే టీవీపై చెప్పులు విసిరిన మహిళలు!

సీఎం కనిపించగానే టీవీపై చెప్పులు విసిరిన మహిళలు!

కారులో మంటలు.. ఆరుగురి సజీవదహనం!

కారులో మంటలు.. ఆరుగురి సజీవదహనం!

అయోధ్య వేదికగా భగ్గమన్న రాజకీయం.. అఖిలేశ్‌కు యోగి అల్టిమేటం

అయోధ్య వేదికగా భగ్గమన్న రాజకీయం.. అఖిలేశ్‌కు యోగి అల్టిమేటం

పండక్కి ‘పీఎల్‌’ కూడా ఇవ్వరా?.. సోషల్‌ మీడియాలో రచ్చ!

పండక్కి ‘పీఎల్‌’ కూడా ఇవ్వరా?.. సోషల్‌ మీడియాలో రచ్చ!

పండుగ పూట పరీక్షేంటి?.. ‘బోర్డు’ను నిలదీస్తున్న విద్యార్థులు!

పండుగ పూట పరీక్షేంటి?.. ‘బోర్డు’ను నిలదీస్తున్న విద్యార్థులు!

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
 
Sakshi Home
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft