Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV
  • Tollywood
  • దక్షిణ భారత
  • OTT
  • Reviews
  • Gossips
  • Hollywood
  • Bollywood

Breadcrumb

  1. Home
  2. Movies
  3. Cinema Home
ADVERTISEMENT 

ఓటరును పడగొట్టే 'సినిమా'..ఇదో కొత్త రాజకీయం!

Movies Sakshi User Sakshi Sakshi Time Feb 26, 2026 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Leaders.jpg

సాధారణంగా రాజకీయ నాయకులు బయట చూడడానికి కాస్త గంభీరంగా ఉంటారు. వారి ప్రసంగాలు, నిర్ణయాలు అన్నీ సీరియస్‌గానే ఉంటాయి.  నిత్యం జనాల్లో ఉన్నప్పటికీ ‘మనవాడు’ అనే హోదా మాత్రం కొంతమందికే లభిస్తుంది. ఆ కొంతమందిలో తాము కూడా ఉండాలని చాలామంది నేతలు కోరుకుంటారు. అందుకే సామాన్య ప్రజలకు చేరువ కావడానికి 'సినిమా గ్లామర్'ను ఒక శక్తివంతమైన ఆయుధంగా వాడుకుంటున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, సూపర్ స్టార్ మోహన్ లాల్ మధ్య జరిగిన తాజా ఇంటర్వ్యూ దీనికి తాజా ఉదాహరణ మాత్రమే. అయితే, ఈ వ్యూహం వెనుక దశాబ్దాల చరిత్ర, అంతర్జాతీయ రాజకీయ తంత్రం దాగి ఉంది.


ఎన్నికల సమయంలో రాజకీయనాయకులు చేసే హడావుడి అంతా ఇంత కాదు. ఓటరుకు దగ్గరవ్వడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. రోడ్డు మీద బజ్జీలు వేస్తారు? పిల్లలతో కలిసి ఆటలు ఆడతారు, సెల్ఫీలు, ఇంట్లోకి వెళ్లి భోజనాలు.. ఇలా విచిత్రమైన పనులతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. అయితే  కానీ, ఓటరుకు మరింత దగ్గరవ్వాలంటే 'తమలోనూ ఒక సామాన్యుడు ఉన్నాడు' అని నిరూపించుకోవాలి. ఇందుకోసం సెలబ్రిటీలతో ఇంటర్వ్యూలు నిర్వహించడం ఒక గ్లోబల్ ట్రెండ్‌గా మారింది.

పినరయిలోని మరో కోణం
కేరళ రాజకీయాల్లో పినరయి విజయన్ అంటే అత్యంత కఠినమైన నాయకుడనే పేరుంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న సమయంలో పినరయి విజయన్ కు ఉన్న ఆ గంభీరమైన ముద్రను మార్చి, ఆయనలోని నవ్వు ముఖాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ ఛానల్ ఒక ఇంటర్వ్యూను ప్లాన్ చేసింది. మొదట మమ్ముట్టిని అనుకున్నప్పటికీ, ఇద్దరూ గంభీర స్వభావులే కావడంతో ఆ బాధ్యతను శ్రీనివాసన్ కు అప్పగించారు. శ్రీనివాసన్ అయితేనే పినరయిని నవ్వించగలరని భావించి చేసిన ఇంటర్వ్యూ సూపర్ హిట్ అయింది. తన చిన్నప్పటి దెయ్యాల భయం గురించి పినరయి సరదాగా చెప్పడం ప్రజల్లో ఆయనపై ఉన్న భయాన్ని పోగొట్టింది.

నటి నవ్య నాయర్ కూడా గతంలో పినరయి కుటుంబాన్ని ఇంటర్వ్యూ చేసింది. అక్కడ ఆమె పినరయిని ‘విజయన్ అంకుల్’ అని పిలిచారు. గంభీరమైన నాయకుడి వెనుక ఉన్న తండ్రిని, భర్తను ప్రజలకు పరిచయం చేయడమే ఆ కార్యక్రమ ఉద్దేశం.

కలిసొచ్చిన మోదీ ‘మామిడి పండ్ల’ ముచ్చట్లు
2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ సంచలనం సృష్టించింది. ఇది పూర్తిగా రాజకీయేతర సంభాషణ. మోదీకి మామిడి పండ్లు అంటే ఇష్టమా? ఆయన రోజుకు ఎన్ని గంటలు నిద్రపోతారు? వంటి వ్యక్తిగత విషయాల గురించి ఇందులో చర్చించారు.మమతా బెనర్జీ తనకు కుర్తాలు పంపిస్తారని చెప్పడం ద్వారా, రాజకీయ వైరం ఉన్నా వ్యక్తిగత సంబంధాలు బాగుంటాయని సందేశం ఇచ్చారు. ఇది సామాన్య ఓటర్లలో మోదీ పట్ల సానుకూలతను పెంచింది. ఇది ఎన్నికల గిమ్మిక్కు అని విపక్షాలు విమర్శించినా, ఫలితం మాత్రం మోదీకి అనుకూలంగానే వచ్చింది.  

ఇదే పంథాలో ప్రపంచ నాయకులు
భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాధినేతలు కూడా ఇదే పంథాను అనుసరిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేసినప్పుడు బరాక్ ఒబామా ‘బిట్వీన్ టూ ఫెర్న్స్’ వంటి హాస్య ప్రధాన్యత ఉన్న షోలలో పాల్గొన్నారు. తన ‘ఒబామా కేర్’ పథకం గురించి యువతకు చేరవేయడానికి సినీ తారల సహాయం తీసుకున్నారు. 2024లో జరిగిన అమెరికా ఎన్నికల సమయంలో డోనాల్డ్‌  ట్రంప్ జో రోగన్ వంటి పాపులర్ పాడ్‌కాస్టర్లతో గంటల తరబడి మాట్లాడారు. తన సోదరుడి మరణం గురించి భావోద్వేగంగా మాట్లాడుతూ ఓటర్లకు చేరువయ్యారు.

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్వతహాగా నటుడు కావడంతో, ఆయన తన ప్రతిష్టను పెంచుకోవడంలో సినిమా మాధ్యమాన్ని చక్కగా వాడారు. హాలీవుడ్ నటుడు షాన్ పెన్ ఆయనపై ‘సూపర్ పవర్’ అనే డాక్యుమెంటరీ కూడా తీశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తనను ఒక శక్తివంతమైన నాయకుడిగా ప్రపంచానికి చూపించుకోవడానికి హాలీవుడ్ దర్శకుడు ఆలివర్ స్టోన్ తో వరుస ఇంటర్వ్యూలు చేయించుకున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా అమెరికన్ టాక్ షో హోస్ట్‌లు స్టీఫెన్ కోల్బెర్ట్, కోనన్ ఓబ్రియన్ వంటి వారితో సరదాగా ముచ్చటిస్తూ తన ‘కూల్ ఇమేజ్’ను ప్రదర్శించారు.

కలిసొస్తున్న ‘గ్లామర్‌’ పాలిటిక్స్
రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఇవి కేవలం ఎన్నికల గిమ్మిక్కులు మాత్రమే కాదు. డిజిటల్ యుగంలో ప్రజలు నాయకుడిలోని 'మానవీయ కోణాన్ని' చూడాలని కోరుకుంటున్నారు.కఠినమైన విధాన నిర్ణయాల కంటే, ఇలాంటి సరదా సంభాషణలే ప్రజల మెదళ్లలో ఎక్కువ కాలం గుర్తిండిపోతాయి.దీంతో పాటు సెలబ్రిటీల ఫాలోయింగ్‌ను వాడుకోవడం ద్వారా యువ ఓటర్లను సులువుగా ఆకర్షించవచ్చు. కేరళలో పినరయి-మోహన్ లాల్ ఇంటర్వ్యూ అయినా, ఢిల్లీలో మోదీ-అక్షయ్ ముచ్చట్లయినా.. అంతిమ లక్ష్యం ఒక్కటే: "నేను మీలో ఒకడిని" అని చాటిచెప్పడం. గ్లామర్,పొలిటికల్‌ పవర్‌ కలిసినప్పుడు పుట్టే ఈ 'కొత్త రాజకీయం' భవిష్యత్తులో మరిన్ని వింత పోకడలకు దారితీస్తుందనడంలో సందేహం లేదు.


 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Mohanlal
Pinarayi Vijayan
Akshay Kumar
Narendra Modi
Donald trump
Cinema News
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఇక ఎన్డీఏ వేదిక 'మంగళ్ మిలన్’!

ఇక ఎన్డీఏ వేదిక 'మంగళ్ మిలన్’!

హర్ముజ్‌ జలసంధిపై కొత్త ఆధిపత్య పోరు!

హర్ముజ్‌ జలసంధిపై కొత్త ఆధిపత్య పోరు!

మళ్లీ ట్రిగ్గర్‌ నొక్కిన ట్రంప్.. మరింత ముదిరిన యుద్ధం

మళ్లీ ట్రిగ్గర్‌ నొక్కిన ట్రంప్.. మరింత ముదిరిన యుద్ధం

పుతిన్‌ తగ్గేదేలే.. మళ్లీ మంటలు రేపే యుద్ధమా?

పుతిన్‌ తగ్గేదేలే.. మళ్లీ మంటలు రేపే యుద్ధమా?

భీకరంగా మారిన అమెరికా-ఇరాన్‌ యుద్ధం!

భీకరంగా మారిన అమెరికా-ఇరాన్‌ యుద్ధం!

అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం.. మోదీ ఐదు సంకల్పాలు ఇవే..

అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం.. మోదీ ఐదు సంకల్పాలు ఇవే..

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.