బిచ్చగాడు ఫేమ్, కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ ఇంట్లో విషాదం నెలకొంది. 12వ తరగతి చదువుతున్న ఆయన కూతురు మీరా ఆంటోని సూసైడ్ చేసుకుంది. అయితే అమ్మాయిని గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యలో కన్నుమూసింది. తీవ్రమైన ఒత్తిడితోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
(ఇది చదవండి: ప్రిన్స్ ఒక వెధవ.. ప్రశాంత్‌కు డ్రగ్ ఎక్కేసింది: షకీలా)
కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ తన కుటుంబంతో చెన్నైలోని అల్వార్‌పేటలోని డీడీకే రోడ్డులో నివాసముంటున్నారు. విజయ్ ఆంటోనీ కూతురు మీరా ఆంటోనీ (16) చర్చ్ పార్క్ స్కూల్లో పన్నెండో తరగతి చదువుతోంది. అయితే చదువుల వల్లే ఒత్తిడికి లోనైనట్లు సమాచారం. మీరా తెల్లవారుజామున 3 గంటల సమయంలోనే తన గదిలో ఉరేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మీరాను గమనించిన కుటుంబసభ్యులు కావేరీ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో పోలీసులు ఆత్మహత్యగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఘటన జరిగిన సమయంలో విజయ్ ఆంటోని ఇంట్లో లేడని చెబుతున్నారు.
#BREAKING || நடிகரும் இசையமைப்பாளருமான விஜய் ஆண்டனியின் மகள் தூக்கிட்டு தற்கொலை
மன அழுத்தம் காரணமாக தற்கொலை என கூறப்படுகிறது
சென்னை, டிடிகே சாலையில் உள்ள வீட்டில் அதிகாலை 3 மணி அளவில் தூக்கிட்டு தற்கொலை #vijayantony | #vijayantonydaughter | #laara pic.twitter.com/MZ7Px8HsV2— Thanthi TV (@ThanthiTV) September 19, 2023
Disclaimer: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com